Nagarjuna Bigg Boss Remuneration: బిగ్ బాస్ మొదటి సీజన్ లో ఎన్టీఆర్.. రెండవ సీజన్లో నాని.. హోస్ట్ లుగా వ్యవహరించారు. ఇక బిగ్ బాస్ మూడవ సీజన్ నుంచి నాగార్జున నే హోస్ట్ గా కొనసాగుతూ వచ్చారు. బిగ్ బాస్ ఓటిటి కి కూడా నాగార్జున నే హోస్ట్ గా కనిపించారు. గత రెండు మూడు సీజన్ల నుంచి ఈసారి నాగార్జున కనిపించకపోవచ్చు అని వార్తలు అయితే వచ్చాయి కానీ.. మళ్లీ నాగార్జున నే హోస్ట్ స్థానంలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
సీజన్ 8 లో ఖచ్చితంగా నాగార్జున హోస్టుగా వ్యవహరించరు.. అంటూ చాలామంది కామెంట్లు చేశారు. కానీ వాటన్నిటికీ చెక్ పెడుతూ.. మళ్లీ నాగార్జున నే హోస్ట్ గా ప్రకటించింది బిగ్ బాస్ బృందం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నాగార్జునకి బిగ్ బాస్ షూటింగ్ చేయడం కష్టం అవుతుంది. కానీ ఎలాగో అలవాటు ఉన్న పనే కాబట్టి.. 20, 30 రోజులు అడ్జస్ట్ చేద్దామని నాగార్జున ఓకే చెప్పేసారట.
అయితే మిగతా సీజన్ లతో పోలిస్తే ఈ సీజన్లో నాగార్జున విషయంలో ఒక తేడా ఉండబోతోంది. అది నాగార్జున తీసుకోబోయే రెమ్యూనరేషన్. నాగార్జున రెమ్యూనరేషన్ ఇప్పటిదాకా 20 కోట్లు ఉండేది. కానీ ఈసారి పది పెంచి 30 కోట్లు డిమాండ్ చేశారట. బిగ్ బాస్ బృందం కూడా ఇంకొక ఆప్షన్ లేదు అన్నట్టు నాగార్జున డిమాండ్ కి ఓకే చెప్పారని తెలుస్తోంది.
అంతేకాకుండా బిగ్ బాస్ సెట్ కూడా అన్నపూర్ణ స్టూడియోస్ లోనే ఉంది. దానికి ఎంతో కొంత చార్జ్ ఉంటుంది. అన్నపూర్ణ స్టూడియోస్ లో సెట్ వేయడం వల్ల చాలావరకు విషయాలు బయటకు లీక్ అయిపోతున్నాయి. ఈసారి లొకేషన్ మారుద్దామని అనుకున్నారు కానీ కుదరలేదు. కాబట్టి స్టూడియో రెంట్, రెమ్యూనరేషన్.. ఇలా రెండు విధాలుగా నాగార్జునకి లాభం అని చెప్పొచ్చు.
ఇదిలా ఉండగా ఆ సెప్టెంబర్ 1 నుంచి.. బిగ్ బాస్ సీజన్ 8 మొదలవుతుంది. ఈసారి కూడా చాలామంది సెలబ్రిటీలు, బుల్లితెర యాంకర్లు, సింగర్లు, సీరియల్ నటీనటులతో పాటు యూట్యూబర్లు కూడా షోలో పాల్గొనబోతున్నారు.
Also Read: Sun Transit 2024: ఆగస్టు 16న సొంత రాశిలోకి సూర్యుడు.. ఈ రాశులవారికి డబ్బే, డబ్బు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి