Love story: కరోనా రాకుండా లవ్ స్టోరీ యూనిట్ సరికొత్త ఐడియా

అక్కినేని నాగ చైతన్య ( Naga Chaitanya ) ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్న 'లవ్ స్టోరీ' చిత్రంలో ( Love story movie ) నటిస్తున్నాడు. ఈ సినిమాలో చైతు సరసన ఫిదా ఫేమ్ సాయి పల్లవి ( Sai Pallavi ) జంటగా నటిస్తోంది.

Last Updated : Aug 29, 2020, 02:10 AM IST
Love story: కరోనా రాకుండా లవ్ స్టోరీ యూనిట్ సరికొత్త ఐడియా

అక్కినేని నాగ చైతన్య ( Naga Chaitanya ) ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్న 'లవ్ స్టోరీ' చిత్రంలో ( Love story movie ) నటిస్తున్నాడు. ఈ సినిమాలో చైతు సరసన ఫిదా ఫేమ్ సాయి పల్లవి ( Sai Pallavi ) జంటగా నటిస్తోంది. కరోనావైరస్ ( Coronavirus ) లేకపోయుంటే ఈ చిత్రం ఇప్పటికే విడుదలై ఉండేది. ఈ లవ్ స్టోరీ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయింది. Also read : Pushpa story: 'పుష్ప కథ కాపీ' ఆరోపణలపై సుకుమార్ వెర్షన్

ప్రస్తుతం ఈ సినిమా నిర్మాతలు వచ్చే నెల నుండి షూటింగ్‌ను తిరిగి ప్రారంభించాలని యోచిస్తున్నారు. సెప్టెంబర్ 7 నుంచి షూటింగ్ ప్రారంభమవుతుందని, ఇప్పటికే రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా షూటింగ్ కోసం ప్రత్యేక సెట్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం, కరోనా మహమ్మారి రోజు రోజుకి విజృంభిస్తున్న సమయంలో షూటింగ్ తిరిగి ప్రారంభించాలంటే సినిమా వాళ్లు వెనకడుగేస్తున్నారు. కానీ షూటింగ్‌ను తిరిగి ప్రారంభించడానికి ఈ లవ్ స్టోరీ యూనిట్ మాత్రం అన్ని తగిన జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్‌కి ఆటంకం కలగకుండా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. Also read : Chiranjeevi: చిరు పాటతో ఆయన్నే ఇంప్రెస్ చేసిన నటుడు

లవ్ స్టోరీ మూవీ షూటింగ్ ( Love story shooting ) షెడ్యూల్ ముగిసే వరకు తాము ఇంటికి వెళ్ళకుండా రామోజీ ఫిలింసిటీలోనే ఉండి షూటింగ్ పూర్తి చేసుకుంటామని యూనిట్ వర్గాలు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. అలాగే సినిమా నటీనటులకు, సిబ్బందికి ఏ ఇబ్బంది లేకుండా షూటింగ్ ముగిసే వరకు నిర్మాతలే రామోజీ ఫిలింసిటీలో వసతి ఏర్పాట్లు చేయబోతున్నారట. కేవలం 15 మంది సిబ్బందిని మాత్రమే ఈ సన్నివేశాలను చిత్రీకరించడానికి అనుమతించనున్నారనే టాక్ వినిపిస్తోంది. Also read : Vakeel Saab updates: వకీల్ సాబ్ టీజర్‌కి సమానంగా మోషన్ పోస్టర్

Trending News