శైలజారెడ్డి అల్లుడిగా "నాగచైతన్య"

   

Last Updated : Oct 27, 2017, 06:30 PM IST
శైలజారెడ్డి అల్లుడిగా "నాగచైతన్య"

టాలీవుడ్‌లో మళ్లీ పాత ట్రెండ్ కొత్త పద్ధతితో ఊపందుకుంటోంది. ఇదివరకు ఎప్పుడో మనం మంగమ్మ గారి మనవడు, అనసూయమ్మ గారి అల్లుడు లాంటి టైటిల్స్ గురించి విన్నాం. ఇప్పుడు అదే రకం టైటిల్‌తో దర్శకుడు మారుతి నాగచైతన్యతో ఓ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఆ సినిమాకి "శైలజారెడ్డి అల్లుడు" అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అయితే "అర్జున్ రెడ్డి" మానియా ప్రభావం ఈ టైటిల్ మీద ఉందని కొందరు అంటున్నారు. రమ్యక్రిష్ణ ఈ సినిమాలో టైటిల్ రోల్ పోషించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్కు జరుగుతుందని కూడా వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. బహుశా ఈ సినిమా కామెడీ లవ్ స్టోరితో కూడిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అయ్యి ఉండవచ్చని పలువురు భావిస్తున్నారు. మారుతి ఇటీవలే దర్శకత్వం వహించిన "మహానుభావుడు" హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. మరి నాగచైతన్యతో తీయబోయే కామెడీ ఎంటర్‌టైనర్ వర్కవుట్ అవుతుందో లేదో వేచి చూడాల్సిందే.  

Trending News