Naga Chaitanya: సినిమా ఫ్లాప్ అవుతుందని తెలిసి కూడా నటించిన నాగచైతన్య... కారణం ఇదే

Dhootha: నాగచైతన్య చేసిన మొదటి వెబ్ సిరీస్ దూత అమెజాన్ ప్రైమ్ లో విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆయన ఈ మధ్య నటించిన ఒక చిత్రం ఫ్లాప్ అవుతుందని తెలిసి కూడా తాను నటించాను అని చైతు చెప్పడం అందరిని ఆశ్చర్యపరిచింది.. ఇంతకీ ఆ సినిమా ఏదో ఒకసారి చూద్దాం

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 6, 2023, 06:52 PM IST
Naga Chaitanya: సినిమా ఫ్లాప్ అవుతుందని తెలిసి కూడా నటించిన నాగచైతన్య... కారణం ఇదే

Naga Chaitanya: కస్టడీ.. థాంక్యూ లాంటి సినిమాలతో వరుస ఫ్లాపులు చవిచూసారు అక్కినేని హీరో నాగచైతన్య. కాగా ఈ వరుస ఫ్లాపుల తర్వాత ఇప్పుడు నాగచైతన్య నటించిన వెబ్ సిరీస్ దూత మాత్రం ప్రేక్షకుల దగ్గర నుంచి మంచి స్పందన తెచ్చుకుంటుంది. నాగచైతన్య కి మనం లాంటి బ్లాక బస్టర్ అలానే థాంక్యూ లాంటి డిజాస్టర్ ఇచ్చిన దర్శకుడు విక్రమ్ కే కుమార్ ఈ వెబ్ సిరీస్ ని తెరకెక్కించడం విశేషం.

అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ వెబ్ సిరీస్ నాగచైతన్య నటించిన మొదటి వెబ్ సిరీస్. అయితే మొదటి వెబ్ సిరీస్ తోనే మంచి విజయం సాధించారు చైతు. ఈ నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో పాల్గొన్న నాగచైతన్య తన చిత్రాలలో ఒక సినిమా ఫ్లాప్ అవుతుంది అని తెలిసి కూడా నటించాను అని చెప్పడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంతకీ ఆ సినిమా ఏమిటి అంటే నాగచైతన్య హిందీ హీరో అమీర్ ఖాన్ తో కలిసి నటించిన లాల్ సింగ్ చద్ద.

ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాగచైతన్య తను నటించిన బాలీవుడ్ సినిమా లాల్ సింగ్ చద్ద ఫ్లాప్ కావడం పైన స్పందించారు. దూత వెబ్ సిరీస్ లో తనకు ముందు జరగబోయేవి అన్ని తెలిసిపోతూ ఉంటాయని..
అలానే తనకు తాను హిందీలో చేసిన లాల్ సింగ్ చద్దా సినిమా ఫ్లాప్ అవుతుందని కూడా ముందే తెలిసినప్పటికీ ఆ సినిమాలో నటించానని తెలిపారు. అయితే ఎందుకు నటించారో కారణం చెబుతూ.. ‘ఆ సినిమాలో నాకు అమీర్ ఖాన్ తో కలిసి నటించే అవకాశం వచ్చింది కాబట్టి ఆ సినిమా ఫలితం గురించి ఆలోచించకుండా నటించాను. అందుకే ఆ సినిమా ఫలితం నన్ను బాధించలేదు. ఆయనతో నటించి నేను చాలా విషయాలను సైతం నేర్చుకున్నానని. అలాంటి సినిమాలో నటించినందుకు ఇప్పటికీ గర్వపడుతున్నాను’ అంటూ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశాడు నాగచైతన్య.

Also read: Tornados in cyclone: రాజమండ్రి సహా పలు ప్రాంతాల్లో విధ్వంసం రేపిన సుడిగాలి

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News