Thandel: నాగచైతన్య కోసం ఏకంగా పాకిస్తాన్ సెట్.. ఎక్కడో తెలిస్తే షాక్!

Naga Chaitanya: సినిమాలలో పలు రకాల భారీ సెట్లు వేయడం మనకు తెలుసు. అయితే నాగచైతన్య సరికొత్త చిత్రం కోసం ఏకంగా మన దయాధులకు సంబంధించిన సెట్ ను సిద్ధం చేస్తున్నారు. ఇంతకీ అది ఎక్కడో తెలుసా?

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 6, 2024, 08:08 PM IST
Thandel: నాగచైతన్య కోసం ఏకంగా పాకిస్తాన్ సెట్.. ఎక్కడో తెలిస్తే షాక్!

Thande Update

కెరీర్ లో  హిట్ కోసం రిస్క్ చేయడానికి కూడా వెనకాడని యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య. రీసెంట్ గా అతను నటించిన ధూత వెబ్ సిరీస్ మంచి ఆదరణ అందుకుంది. భారీ అంచనాల మధ్య వచ్చిన కస్టడీ చిత్రం ఊహించిన ఫలితాలను అందుకోవడంలో విఫలం అయింది. దీంతో ప్రేమమ్ మూవీతో తనకు మంచి సక్సెస్ అందించిన చందూ మొండేటి తో తండేల్ మూవీ చేస్తున్నాడు నాగచైతన్య. 

ఈ మూవీలో నాగచైతన్య లక్కీ హీరోయిన్ సాయి పల్లవి జంటగా నటిస్తోంది. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన లవ్ స్టోరీ చిత్రం సూపర్ డూపర్ సక్సెస్ సాధించింది. ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా బాగా సెట్ కావడంతో ఈ జంటను మరొకసారి స్క్రీన్ పై చూడడానికి అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ఇక మూవీ స్టోరీ విషయానికి వస్తే జాలర్ల జీవితం, వారు ఎదుర్కొనే పలు రకాల సమస్యలు నేపథ్యంలో సాగే ఈ చిత్రం లో నాగచైతన్య ఒక మత్స్యకారుడుగా కనిపిస్తాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన గ్లింప్స్.. మూవీ పై అంచనాలను బాగా పెంచింది. మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ లో నాగచైతన్య టోల్డ్ బాడీ చూస్తే అతను ఈ మూవీ కోసం ఎంత కష్టపడ్డాడు అన్న విషయం అర్థమైపోతుంది. ఇది యధార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిచ్చిన చిత్రం అని టాక్.

ఈ మూవీలో కొంతమంది మస్త్యకారులు వేటకు వెళ్లిన సమయంలో అనుకోకుండా భారత్ వాటర్ బార్డర్ దాటి పాక్ వాటర్ బార్డర్ లోకి  వెళ్తారు. వీళ్లను అక్కడ పాక్ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకుంటారు. ఇక అక్కడ నుంచి ఈ మత్స్యకారులు ఎలా బయటపడ్డారు అనేది చిత్రం యొక్క మూల కథ. ఇందులో నాగచైతన్య కోసం తపన పడే పాత్రలో సాయి పల్లవి నటన పీక్స్ అని టాక్. ఈ మూవీ కోసం ప్రత్యేకంగా ఆమె శ్రీకాకుళానికి సంబంధించిన యాసను నేర్చుకుందట.

కాగా మూవీ గ్లింప్స్ లో పాకిస్తాన్ జైలుకు సంబంధించిన ఒక సీన్ ని కూడా చూపిస్తారు. అయితే ఈ మూవీ కోసం ప్రత్యేకంగా హైదరాబాద్ లోని బీహెచ్ఈఎల్ ప్రాంతంలో ఓ ప్రత్యేకమైన భారీ సెట్ ను నిర్మించారు. పాకిస్థాన్ లో ఏ విధంగా అయితే ఉంటాయో అదేవిధంగా పరిసర ప్రాంతాలు, జైలు, ఆఫీసులు ఉండే విధంగా ఒక సెట్ ను ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర తంగల ఆధ్వర్యంలో నిర్మించారు. పాకిస్తాన్ లో ఈ సినిమాకు సంబంధించి ఉండే అన్ని సీన్స్ ఈ సెట్స్ లోనే షూట్ చేయబోతున్నారు. భారీ బడ్జెట్ తో.. సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న నాగ చైతన్య ఈ మూవీతో మంచి సక్సెస్ సాధించాలి అని అక్కినేని అభిమానులు ఆశిస్తున్నారు. మరి తండేల్ మూవీ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.

Read More: Actress Kajal Agarwal: హీరోయిన్ కాజల్ అగర్వాల్ నడుముపై చెయివేసిన అభిమాని.. సోషల్ మీడియాలో రచ్చగా మారిన వీడియో ఇదే..

Read More: Pragya Jaiswal Bikini Pics: బికినీలో బ్లాస్ట్ చేసిన ప్రగ్యా జైస్వాల్.. మరి ఇంతలానా..!

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News