Bheemla Nayak: భీమ్లా నాయక్​ పాటకు థియేటర్లో స్టెప్పులేసిన తమన్​..

Bheemla Nayak: తెలుగు రాష్ట్రాల్లో భీమ్లా నాయక్ సందడి కొనసాగుతోంది. థియేటర్లో సినిమా చూసి.. మ్యూజిక్ డైరెక్టర్​ తమన్​, డ్రమ్స్​ స్పెషలిస్ట్​ శివమణి, సింగర్ రేవంత్​లు మాస్​ స్టెప్పులేశారు.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 26, 2022, 12:56 PM IST
  • థియేటర్లో భీమ్లా నాయక్​ సినిమా చూసిన తమన్
  • లా.. లా.. భీమ్లా సాంగ్​కు స్టెప్పులు
  • డ్రమ్స్ స్పెషలిస్ట్​ శివమణి, సింగర్ రేవంత్​లూ సందడి
Bheemla Nayak: భీమ్లా నాయక్​ పాటకు థియేటర్లో స్టెప్పులేసిన తమన్​..

Bheemla Nayak: తమ ఫేవరెట్ హీరో సినిమా రిలీజ్ అయ్యిందంటే.. ఫ్యాన్స్​ థియేటర్ల ముందు సందడి చేయడం.. సినిమా చూస్తున్నప్పుడు ఈలలు, కేకలు వేయడం సాధారణంగా చూస్తుంటాం. ఇక పవన్ కల్యాణ్​ సినిమా విడుదలైందంటే.. ఆ సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

నిన్న (ఫిబ్రవరి 25) పవన్ కల్యాణ్ నటించిన 'భీమ్లా నాయక్' మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదలై హిట్​ టాక్ సొంత చేసుకుంది. సినిమా చూసిన ఫ్యాన్స్​ చేసిన రచ్చ అంతా ఇంత కాదు.

పవన్ కల్యాణ్ సినిమా అంటే కేవలం సాధారణ ఫ్యాన్స్​ మాత్రమే కాదు.. సెలెబ్రెటీ ఫ్యాన్స్​ కూడా తెగ ఎంజాయ్​ చేస్తారు. ఈ సినిమాకు మ్యూజిక్​ డైరెక్టర్​గా పని చేసిన ఎస్. తమన్​ కూడా పవన్​ కల్యాణ్ ఫ్యాన్ అని తెలుసు. ఆయన కూడా.. డ్రమ్స్​ స్పెషలిస్ట్​ శివమణి, సింగర్​ రేవంత్​లతో కలిసి థియేటర్లలో సాధారణ ప్రేక్షకుల్లా సినిమా చూశారు.

సెలెబ్రెటీలు థియేటర్లలో ప్రేక్షకుల మధ్య సినిమా చూడటంలో సాధారణమేగా అనుకుంటున్నారా? అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. థియేటర్లో స్కీన్​ ముందు స్టెప్పులేశారు థమన్​. తమన్ మాత్రమే కాదు.. శివమణి, రేవంత్​లు కలిసి..  లా.. లా.. భీమ్లా.. సాంగ్​కు దుమ్ము లేపే స్టెప్పులేశారు. సెలెబ్రెటీలనా.. సగటు ప్రేక్షకుళ్లా వాళ్లు చేసిన సందడిని ట్విట్టర్​లో షేర్ చేశారు తమన్​.

ఇది మా ప్రియమైన పవర్​స్టార్​ పవన్​ కల్యాణ్​, జీనియస్ డైరెక్టర్​ త్రివిక్రమ్​ కోసం అంటూ రాసుకొచ్చారు తమన్​.

Also read: Bheemla Nayak Day 1 Collections: బాక్సాఫీస్ పై 'భీమ్లా నాయక్' దండయాత్ర... ఫస్ట్‌ డే కలెక్షన్లు ఎంతంటే?

Also read: Radhe Shyam New Song: రాధేశ్యామ్‌ నుంచి మెలోడీ సాంగ్ విడుదల.. ఫిదా అవుతున్న ఫాన్స్!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News