Hanuman Movie: హనుమాన్ మూవీకి రెండేళ్లు ప్రాణం పెట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. యాడ్స్‌ నుంచి పాన్‌ఇండియా స్థాయికి..!

Hanuman Movie Music Director Gaura Hari: భారీ అంచనాల నడుమ హనుమాన్ మూవీ విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమాకు సంగీత దర్శకుడు గౌర హరి రెండేళ్లుగా ప్రాణం పెట్టి పనిచేశారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 10, 2024, 08:00 PM IST
Hanuman Movie: హనుమాన్ మూవీకి రెండేళ్లు ప్రాణం పెట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. యాడ్స్‌ నుంచి పాన్‌ఇండియా స్థాయికి..!

Hanuman Movie Music Director Gaura Hari: యాడ్స్, టీవీ సీరియల్స్‌తో సంగీత ప్రస్థానం ఆరంభించిన మ్యూజిక్ డైరెక్టర్ గౌర హరి.. ఏకంగా పాన్‌ ఇండియా మూవీకి మ్యూజిక్ అందించే స్థాయికి ఎదిగారు. తేజ సజ్జ-ప్రశాంత్ వర్మ కాంబో తెరకెక్కిన హనుమాన్ మూవీకి ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్‌ పనిచేయగా.. గౌర హరి ఎక్కువ భాగం చూసుకున్నారు. సంగీత దర్శకుడు అనుధీప్ దేవ్ ఆవకాయ అంజనేయ అనే సాంగ్ కంపోజ్ చేయగా.. మరో మ్యూజిక్ డైరెక్టర్ కృష్ణ సౌరభ్ ఒక ఎమోషనల్ సాంగ్ చేశారు. ఇక మూవీలో మిగిలిన సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మొత్తం గౌర హరి చూసుకున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్, ట్రైలర్‌తో ఆయన తన మార్క్ చూపించారు.  

హనుమాన్ మూవీకి గౌర హరి దాదాపు రెండేళ్లు ఎంతో కష్టపడి మ్యూజిక్ అందించారు. ఇప్పటివరకు రిలీజ్ అయిన బీజీఎమ్, హనుమాన్ చాలీసా, శ్రీరామ దూత స్తోత్రం ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే.  ఆ సాంగ్స్‌ వింటుంటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయని ఎంతో మంది ఆడియన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. దర్శకుడి విజన్‌కు తగ్గట్టుగా.. తీసిన విజువల్స్‌ను తన సంగీతంతో మరోక మెట్టు ఎక్కించడంలో మ్యూజిక్ డైరెక్టర్‌గా గౌర హరి వంద శాతం సక్సెస్ అయినట్లే తెలుస్తోంది.

హనుమాన్ మూవీ ప్రొమోషన్స్‌లో  కూడా గౌర హరి పనితనం గురించి ఎంతో గొప్పగా చెప్పారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఈ సినిమా తరువాత చాలా పెద్ద సినిమా ఆఫర్లు అందుకుంటాడని అన్నారు. గౌర హరి పేరు ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తుందన్నారు. రెండేళ్లుగా అంతే ఉత్సాహంతో ఒకే సినిమాకు పనిచేయడం గ్రేట్ అని హీరో తేజ సజ్జ అన్నారు. గౌర హరి ఎంతో ఎఫర్ట్ పెట్టారని.. అందుకే ట్రైలర్ చాలా రీచ్‌గా వచ్చిందన్నారు.

జనవరి 12న ఆడియన్స్ ముందుకు రానుంది హనుమాన్ మూవీ. తేజ సజ్జకు జోడిగా అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తోంది.  వరలక్ష్మి శరత్‌కుమార్, వినయ్ రాయ్, గెటప్ శ్రీను, సముద్రఖని తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై ప్రొడ్యూసర్ కె.నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. భారీ అంచనాల నడుమ ఆడియన్స్‌ ముందుకు రానున్న హనుమాన్ మూవీ.. అంచనాలను ఏ మాత్రం అందుకుంటుందో చూడాలి.  

Also Read: Sankranthi Special Trains: సంక్రాంతి రద్దీ తట్టుకునేందుకు మరిన్ని ప్రత్యేక రైళ్లు

Also Read: Home Loan Rates: హోమ్‌ లోన్స్‌ గుడ్‌ న్యూస్‌..వడ్డీ రేట్లు తగ్గబోతున్నాయ్‌..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x