Ranveer Singh Nude Photoshoot Case: రణవీర్ సింగ్ న్యూడ్ ఫోటోషూట్ చేసినప్పటి నుండి ఆ విషయం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కొందరికి ఈ విషయంలో అతని స్టైల్ బాగా నచ్చగా, మరికొందరు మాత్రం అతను చేసిన పనికి విస్తుపోయారు. ఈ విషయానికి సంబంధించి రణ్వీర్ సింగ్‌పై పోలీసు కేసు కూడా నమోదైంది. ఇప్పుడు దీనికి సంబంధించి, శుక్రవారం, ముంబై పోలీసులు రణవీర్ ఇంటికి వెళ్లినట్టు సమాచారం.
అయితే నటుడు ఇంట్లో లేకపోవడంతో వారు వెను తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. రణ్వీర్ శుక్రవారం విచారణకు హాజరు కావాలని అంటున్నారు. ముంబై పోలీసులు నటుడు రణవీర్ సింగ్ ఇంటికి చేరుకున్నా, ఆయన నగరంలో లేడని తెలుసుకున్నారు. దీంతో పోలీసులు వెనుదిరిగారు. రణ్వీర్ తిరిగి రాగానే నోటీసులిచ్చేందుకు ముంబై పోలీసులు మళ్లీ అతడి ఇంటికి వెళతారని సమాచారం. ఆగస్ట్ 22 లోపు రణ్వీర్ పోలీసుల ముందు విచారణకు హాజరుకావాల్సి ఉంటుందని పోలీసు వర్గాల వారు చెబుతున్నారు.
రణవీర్ గత నెలలో ఒక మ్యాగజైన్ కవర్ పేజీ కోసం నగ్న ఫోటోషూట్ చేశాడు. ఆ తర్వాత ఆయన ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కాడు. ఈ నగ్న చిత్రాలను చూసిన వారందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఈ ఫోటోలలో చిత్రాలలో రణవీర్ పూర్తిగా నగ్నంగా కనిపించారు. రణవీర్ సింగ్ తరువాత ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తనకు కావాలంటే, 1000 మంది ముందు నగ్నంగా ఉండగలనని, ఎందుకంటే నేను దానిని పట్టించుకోనని అన్నారు. ఇక రణ్వీర్ సింగ్ సినిమాల విషయానికి వస్తే కరణ్ జోహార్ తఖ్త్, రాకీ మరియు రాణికా ప్రేమ కహానీ, రోహిత్ శెట్టి సర్కస్, సింబా 2లో కనిపించనున్నారు.
Also Read: Prabhas: అభిమానులకు షాక్ ఇవ్వబోతున్న ప్రభాస్.. ఆ బ్యానర్లో మరో సినిమా!
Also Read: Anjali Arora: లీకైన ఎంఎంఎస్ పై పెదవి విప్పిన అంజలి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.