Mukku Avinash Wedding:పెళ్లి చేసుకున్న ముక్కు అవినాష్.. 'బ్లండర్‌ మిస్టేక్‌' అంటున్న రాంప్రసాద్!

జబర్దస్త్ ఫేమ్ ముక్కు అవినాష్ పెళ్లి ఘనంగా జరిగింది. పలువురు బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ మరియు నటీనటులు హాజరై పెళ్లిలో సందడి చేసారు. కానీ తాళి కడుతున్న వీడియోను 'బ్లండర్‌ మిస్టేక్‌' అంటూ రాంప్రసాద్ పోస్ట్ చేసి షాక్ ఇచ్చాడు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 20, 2021, 03:57 PM IST
  • ఘనంగా జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్ పెళ్లి
  • హాజరైన బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్స్ మరియు నటీనటులు
  • 'బ్లండర్‌ మిస్టేక్‌' అంటూ పోస్ట్ చేసిన రాంప్రసాద్
Mukku Avinash Wedding:పెళ్లి చేసుకున్న ముక్కు అవినాష్.. 'బ్లండర్‌ మిస్టేక్‌' అంటున్న రాంప్రసాద్!

 Mukku Avinash Wedding Video: జబర్దస్త్ ద్వారా బుల్లితెరకు పరిచయమై, కమెడియన్ గా అవకాశాలు అందుకుంటున్న బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ ముక్కు అవినాష్ జరిగిన చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ముక్కు అవినాష్ ఎంగేజ్మెంట్ ఫోటోలో నెట్లో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. 

చిన్ననాటి స్నేహితురాలు అనుజనుతో ఎంగేజ్మెంట్ చేసుకున్న ముక్కు అవినాష్ ఈ రోజు ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ముక్కు అవినాష్ వివాహ వేడుక కుటుంబ సభ్యుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. కొంత మంది నటీనటులతో పాటూ బిగ్‌బాస్‌ ఫేమ్ అరియాన గ్లోరీ, సయ్యద్‌ సోహైల్‌, దివి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

Also Read: Aryan Khan Drugs Case: హీరోయిన్‌తో ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ చాటింగ్.. తెరపైకి సంచలన నిజాలు


 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jabardasth Ram Prasad (@jabardasth_ramprasad)

నిజానికి ముక్కు అవినాష్ సొంత యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించి అందులోనే తన పెళ్లి వీడియో పోస్ట్ చేయాలనీ ప్లాన్ చేసుకున్నాడు. కానీ జబర్దస్త్ రామ్ ప్రసాద్ అనుజ మెడలో మంగళసూత్రం కడుతున్న వీడియోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. "సారీ అవినాష్ ఇట్స్ బ్లండర్‌ మిస్టెక్‌... బట్ ఐ కాంట్ హెల్ప్ యు.. హావ్ ఫన్" అంటూ పోస్ట్ చేసి అవినాష్ కు షాక్ ఇచ్చాడు. 

పలువురు నటీ నటులు, బిగ్‌బాస్‌ ఫేమ్ అరియాన గ్లోరీ, సయ్యద్‌ సోహైల్‌, దివి అవినాష్ పెళ్ళికి హాజరై.. హంగామా చేసారు. అంతేకాకుండా, వారి సోషల్ మీడియా వారి వారి అకౌంట్లో పోస్ట్ చేస్తూ అవినాష్- అనుజ జంటకు విషెస్ తెలుపుతున్నారు. 

Also Read: Srikakulam: చెరువులో బోల్తా పడిన స్కూలు బస్సు.. ఒక విద్యార్ధి మృతి, నలుగురికి గాయాలు (వీడియో)

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News