దేవా, పార్వతులను విడదీసేందుకు చాముండేశ్వరి ఏం చేసింది ?

ముద్దమందారం సీరియల్‌ 31 జులై ఎపిసోడ్ వివరాలు

Last Updated : Aug 1, 2018, 04:13 PM IST
దేవా, పార్వతులను విడదీసేందుకు చాముండేశ్వరి ఏం చేసింది ?

మీ అభిమాన జీ తెలుగులో మీరు మెచ్చిన, మనసుకు నచ్చిన చక్కటి ముద్దమందారం సీరియల్‌కు సంబంధించి ఈ ఎపిసోడ్‌లో అఖిలాండేశ్వరిగా వున్న చాముండేశ్వరి ఏం చేసిందనే విశేషాలను చూడవచ్చు. కుటుంబం అంతా షాక్ అయ్యేలా అఖిలాండేశ్వరి ప్రవర్తన వుంది. శివశంకర్‌కి అసలు ఏమీ పాలు పోవడం లేదు. దేవా, పార్వతులు ఎప్పటికీ భార్యభర్తలు కాలేరని, జనం కూడా అదే అంటున్నారని, జనం మాటే తాను అంటున్నానని అంటుంది అఖిలాండేశ్వరి. మెడలో తాళి పడ్డాక వాళ్లు భార్యభర్తలు కారు అనే హక్కు మనకి లేదని శివశంకర్ చెప్పినా ఆమె వినిపించుకోదు. దేవా ఆమెతో నాకు మాటిచ్చావ్ కదా అనే మాటకు ససేమిరా అంటుంది అఖిలాండేశ్వరిగా వున్న చాముండేశ్వరి. చోద్యం చూస్తున్నట్టు చూస్తున్న మహి కూడా ఇన్‌వాల్వ్ అయ్యి ఏదో అనబోయేసరికి అఖిలాండేశ్వరి అతని నోరు మూయిస్తుంది. దాంతో దేవా-పార్వతులు ఒకటయ్యేలా చేయమని మహి వెళ్లి శివశంకర్‌‌ని బతిమాలుతాడు. 

 

ఇదంతా ఇలా జరుగుతుంటే, అఖిలాండేశ్వరి మరో అడుగు ముందుకేసి, భవానీని తన వైపుకు తిప్పుకుంటుంది. భవానీకి ముందు అర్ధం కాకపోయినా అఖిలాండేశ్వరి బంగారం ఇస్తానని, నగలు ఇస్తానని ఎర చూపేసరికి సై అంటుంది. ఎలాగైనా సరే... దేవా, పార్వతులు విడిపోవాలని, అందుకు నీవంతు నువ్వు ఏం చేయగలవో చేయమని భవానీని తనవైపు తిప్పుకుంటుంది అఖిలాండేశ్వరిగా వున్న చాముండేశ్వరి. వంటగదికే పరిమితమైన తన జీవితాన్ని చూసి బాధపడుతున్న పార్వతిని దేవా ఓదారుస్తాడు. ఈ సీరియల్ ఎపిసోడ్స్‌ని ZEE5 ఎపిసోడ్‌లో చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి. 

Trending News