Mr Bachchan Trailer Talk Review: రవితేజ, దర్శకుడు హరీష్ శంకర్ ఇద్దరు అమితాబ్ బచ్చన్ అభిమానులు.. మరోవైపు హరీష్ శంకర్ కూడా బచ్చన్ అభిమానులు కావడంతో ఈ సినిమాకు ఈ టైటిల్ పెట్టారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ముఖ్యంగా దేశ సరిహద్దులను కాపాడే వాడు కాదు.. దేశ సంపదను కాపాడే వాడు కూడా సైనికుడే అనే డైలాగుతో ఈ చిత్రంలో రవితేజ.. ఇంకమ్ టాక్స్ ఆఫీసర్ పాత్రలో నటించారు. ఈ సినిమా హిందీలో అజయ్ దేవ్ గణ్ హీరోగా నటించిన ‘రెయిడ్’ మూవీకి రీమేక్. ఈ సినిమా బిహార్ నేపథ్యంలో తెరకెక్కితే.. ఈ సినిమాను తెలుగు నేటివిటితో హరీష్ శంకర్ పూర్తిగా తన మార్క్ దర్శకత్వంలో తెరకెక్కించారు.
అక్రమార్కుడైన ఓ రాజకీయ నాయకుడి ఇంటిపై ఓ నిజాయితీ గల ఇంకమ్ టాక్స్ ఆఫీసర్ దాడి చేస్తాడు. ఈ క్రమంలో ఎలాంటి సంఘటలను ఆ ఆదాయ పన్ను అధికారులు ఫేస్ చేసారనేదే ఈ సినిమా స్టోరీ. హిందీలో ఊపిరి బిగపట్టే సన్నివేశాలతో ఆ సినిమా ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంటుంది. కానీ ఈ సినిమాను హరీష్ శంకర్ ఎలా డీల్ చేసాడనేది చూాడాలి.
Electrifying & Power Packed 🔥🔥💯💯 Trailer Of #MassMahaRajaRaviTeja #MrbachchanTrailer @RaviTeja_offl @harish2you @peoplemediafcy #MrBachchan https://t.co/CVBmzKfH7p pic.twitter.com/4rH9TucXue
— BA Raju's Team (@baraju_SuperHit) August 7, 2024
ఈ చిత్రాన్ని 80 బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించాడు. అప్పట్లో జరిగిన నిజ జీవిత సంఘటలను కళ్లు ముందు పెట్టేలా ఆనాటి వింటేజ్ లుక్ ను ఈ సినిమాలో రీ క్రియేట్ చేసాడు. అంతేకాదు సెట్టింగ్స్ కూడా బాగున్నాయి. హరీష్ శంకర్ గతంలో ‘దబాంగ్’ మూవీని తెలుగు నేటివిటీకి తగ్గట్టు రీమేక్ చేసాడు. అందులో షోలేలో విలన్ అయిన గబ్బర్ సింగ్ పాత్ర పేరును ఈ సినిమాకు పెట్టాడు. కానీ మిస్టర్ బచ్చన్ ను షోలేలో హీరోగా నటించిన అమితాబ్ బచ్చన్ పేరును వాడుకున్నాడు. మొత్తంగా హరీష్ శంకర్ షోలో సినిమాపై ప్రేమను చాటుకున్నాడు. అంతేకాదు ఈ సినిమాలో అమితాబ్ ‘దీవార్’ స్టిల్ తో రవితేజను చూపెట్టాడు. మరోవైపు ఆగష్టు 15న షోలే సినిమా రిలీజైందన్న విషయాన్ని కూడా ప్రస్తావించాడు.
‘మిస్టర్ బచ్చన్’ సినిమాలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది. ఇతర పాత్రల్లో జగపతి బాబు, సత్య, తనికెళ్ల భరణి నటించారు. మొత్తంగా ఈ సినిమాను ఆగష్టు 15న మంచి పోటీలో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాతోనైనా రవితేజ తన ఫ్లాపులకు బ్రేకులు వేస్తాడా..? లేదా అనేది చూడాలి.
ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..
ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter