Golden GLobe 2023 : గోల్డెన్ గ్లోబ్‌ నామినేషన్‌ లిస్ట్‌లో నాటు నాటు.. కీరవాణికి అంతర్జాతీయ అవార్డు రానుందా?

Golden GLobe 2023 Nomination List గోల్డెన్ గ్లోబ్ నామినేషన్ లిస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆర్ఆర్ఆర్ సినిమా, నాటు నాటు పాట నామినేషన్‌ లిస్ట్‌లోకి ఎక్కేసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 12, 2022, 08:35 PM IST
  • వరల్డ్ వైడ్‌గా ఆర్ఆర్ఆర్ క్రేజ్
  • ఆస్కార్ రేసులో ఆర్ఆర్ఆర్ చిత్రం
  • గోల్డెన్ గ్లోబ్‌ను సొంతం చేసుకోనున్న నాటు నాటు?
Golden GLobe 2023 : గోల్డెన్ గ్లోబ్‌ నామినేషన్‌ లిస్ట్‌లో నాటు నాటు.. కీరవాణికి అంతర్జాతీయ అవార్డు రానుందా?

Golden GLobe 2023 Nomination List అంతర్జాతీయంగా సినిమా రంగంలో ఆస్కార్ అవార్డులను ఉన్నతంగా చూస్తారు. ఆస్కార్ అవార్డ్‌కు ఎక్కువగా ప్రాముఖ్యతను ఇస్తారు. అయితే ఆస్కార్ అవార్డుల తరువాత అందరూ గోల్డెన్ గ్లోబ్ పురస్కారాలను, అవార్డులను ఎంతో గౌరవంగా భావిస్తారు. ఇప్పుడు ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు సంబంధించిన నామినేషన్స్ లిస్ట్ వైరల్ అవుతోంది. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన చిత్రాలకే ఈ అవార్డును అందిస్తారు.

అయితే ఇప్పుడు గోల్డెన్ గ్లోబ్ పురస్కారాలు అందుకోబోయే సినిమాల జాబితా నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇందులోంచి చాలా సినిమాలు పోటీలోకి వచ్చాయి. అయితే మన ఇండియా నుంచి మాత్రం ఆర్ఆర్ఆర్ ఒక్కటే పోటీలో నిల్చింది. బెస్ట్ పిక్చర్ నాన్ ఇంగ్లీష్ కేటగిరీలో పోటీ పడుతోంది. ఇక ఇది పక్కన పెడితే.. ఎం ఎం కీరవాణి కొట్టిన నాటు నాటు సాంగ్‌ కూడా పోటీలో ఉంది.

కీరవాణి ఇచ్చిన బాణీకి కాళ భైరవ, రాహుల్ సిప్లిగంజ్‌లు పాడిన తీరుకి, ఎన్టీఆర్ రామ్ చరణ్‌ సమన్వయంతో వేసిన స్టెప్పులతో నాటు నాటు పాట వరల్డ్ వైడ్‌గా దూసుకుపోయింది. హాలీవుడ్ స్టార్లు, క్రిటిక్స్, వెస్ట్రన్ కంట్రీస్ సినీ అభిమానులంతా నాటు నాటు పాటకు ఫిదా అయ్యారు. ఇప్పుడు ఈ పాట ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో పోటీ పడుతోంది.

అయితే ఈ నాటు నాటు పాట..  వేర్ ది క్రావ్‌డడ్స్ సింగ్ నుంచి కరోలినా, గైల్లెర్మో డెల్ టోరోస్ పినాకియో నుంచి సియా పాపా, టాప్ గన్ మావెరిక్ నుంచి హోల్డ్ మై హ్యాండ్, బ్లాక్ పాంథర్ వకండా ఫరెవర్ నుంచి లిఫ్ట్ మీ అప్ వంటి పాటలతో పోటీ పడనుంది. మరి వీటిలో మన నాటు నాటు గెలుస్తుందా? లేదా? అన్నది చూడాలి.

Also Read : Ram Charan Video Call : గుడ్ న్యూస్ చెప్పబోతోన్న ప్రభాస్!.. లీక్ చేసిన రామ్ చరణ్‌

Also Read : Anasuya Bharadwaj White Dress : బొడ్డు చూపిస్తున్న జబర్దస్త్ బ్యూటీ.. తెలుపు దుస్తుల్లో అనసూయ అందాలు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News