Bhola Shankar: మరో సాంగ్ వచ్చేసింది.. 'మిల్కీ బ్యూటీ నువ్వే నా స్వీటీ’ అంటున్న చిరు..

Bhola Shankar: చిరంజీవి లీడ్ రోల్ లో నటిస్తున్న చిత్రం భోళా శంకర్ (Bhola Shankar). ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీ నుంచి మరో సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 21, 2023, 07:03 PM IST
Bhola Shankar: మరో సాంగ్ వచ్చేసింది.. 'మిల్కీ బ్యూటీ నువ్వే నా స్వీటీ’ అంటున్న చిరు..

Bhola Shankar Songs: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ చిత్రం భోళా శంకర్ (Bhola Shankar). మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తోన్న ఈసినిమాలో మిల్క్ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంలో చిరంజీవి చెల్లిగా కీర్తి సురేష్ నటిస్తుండగా.. కీలకపాత్రలో సుశాంత్ కనిపించనున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. రీసెంట్ గా రిలీజైన జామ్‌ జామ్‌ జజ్జనక సాంగ్ అయితే ఓ రేంజ్ లో అలరించింది. ఈ క్రమంలో ఇవాళ మరో సాంగ్ ను రిలీజ్ చేసింది చిత్రబృందం. 'మిల్కీ బ్యూటీ.. నువ్వే నా స్వీటీ' అంటూ సాగే ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. 

దాదాపు దశాబ్దం తర్వాత దర్శకత్వం వహిస్తోన్న మెహర్ రమేశ్ ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని కృతనిశ్చయంతో ఉన్నారు. ఇందులో చిరు టాక్సీ డ్రైవర్ పాత్రలో కనిపించనున్నారు. అన్నా, చెల్లి మధ్య ఉండే సెంటిమెంట్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ చిత్రంలో తులసి, రఘు బాబు, రావు రమేష్​, ఉత్తేజ్​, వెన్నెల కిశోర్​, మురళీ శర్మ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు.  ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ సంగీతం సమకూరుస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీని  ఆగస్టు 11న రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News