Miheeka Daggubati: చంటి బిడ్డతో ఫోటో షేర్ చేసిన రానా భార్య.. శుభాకాంక్షలు వెల్లువ.. అసలు విషయం ఇదే!

Miheeka Daggubati Shares a Baby Photo: రానా భార్య మిహీకా బజాజ్ ఒక పసిపాపతో ఉన్న ఫోటో షేర్ చేయడం పెద్ద ఎత్తున హాట్ టాపిక్ అయింది. ఆమె తల్లయింది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే 

Written by - Chaganti Bhargav | Last Updated : Nov 5, 2022, 11:42 AM IST
Miheeka Daggubati: చంటి బిడ్డతో ఫోటో షేర్ చేసిన రానా భార్య.. శుభాకాంక్షలు వెల్లువ.. అసలు విషయం ఇదే!

Miheeka Daggubati Shares a Baby Photo: దగ్గుబాటి రానా మిహికా బజాజ్ అనే యువతిని ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. సినీ పరిశ్రమకు ఏమాత్రం సంబంధం లేకపోయినా వెంకటేష్ కుమార్తెలలో ఒకరి స్నేహితురాలైన మిహికా బజాజ్ ను రానా ప్రేమించారు. ఇక వీరు ప్రేమించుకున్నాక పెద్దలను ఒప్పించి కరోనా సమయంలో వీరి వివాహం ఘనంగా చేసుకున్నారు. ఈ దెబ్బకు అసలు ఎవరు ఈ మిహికా బజాజ్ అంటూ చాలా మంది అప్పట్లో ఆమె గురించి వెతికారు.

కానీ ఆమె గురించి పూర్తి వివరాలైతే బయటకు రాలేదు. ఆమె నార్త్ ఇండియన్ అయినా నగరంలో స్థిరపడిన కుటుంబానికి చెందిన మిహికా తల్లిదండ్రులు బంగారం వ్యాపారం చేస్తూ ఉంటారు. అయితే వారి వివాహం జరిగి చాలా కాలమే అయినా ఇప్పటివరకు మీరు ఎలాంటి శుభవార్త చెప్పలేదు. ఎప్పుడు ఎప్పుడు శుభవార్త చెబుతారా? అంటూ అభిమానులైతే కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో మిహికా బజాజ్ తన చేతుల్లో ఒక పసి పాప ఫోటో షేర్ చేయడంతో అందరూ ఆమెకు పుట్టిన బిడ్డ అనుకుని ఆమెకు కంగ్రాట్స్ చెప్పడం ప్రారంభించారు.

అయితే విషయాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారనే విషయం అర్థం చేసుకున్న మిహీకా బజాజ్ వెంటనే ఆ ఫోటోకు ఒక క్యాప్షన్ తగిలించారు. తన మేనకోడలితో ఇది మొదటి ఫోటో అని ఆమె తన ఏంజెల్ అని ఆమె చెప్పుకొచ్చారు. అయితే అప్పటికే ఆ ఫోటో చూసి పొరబడిన చాలామంది సెలబ్రిటీలు సాధారణ నెటిజన్లు ఆమెకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్టులు పెడుతున్నారు. మరి కొందరు మాత్రం ఇలా శుభాకాంక్షలు చెప్పేముందు అసలు ఫోటోకి ఏం క్యాప్షన్ ఉందో చూసుకోవాల్సిన పనిలేదా అంటూ ప్రశ్నిస్తున్నారు.

ఫోటోలో ఉన్నది ఈ విషయంలో ఈమెకు కంగ్రాట్స్ చెబితే దానికి అర్థం ఏమిటని కామెంట్ చేస్తున్నారు. అయితే రానా తండ్రి అయ్యాడు అని భావించిన దగ్గుబాటి అభిమానులందరూ ఈ పాప ఫోటో రానా దగ్గుబాటి వారసురాలు కాదని మిహికా బజాజ్ మేనకోడలు అని తెలియడంతో అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఫోటో మీరు కూడా చూసేయండి మరి. 

Also Read: Vishwak Sen out: పవన్ చేతుల మీదుగా ప్రారంభమైన సినిమా నుంచి విశ్వక్ అవుట్.. పెద్ద పంచాయితీ అయ్యేట్టుందే?

Also Read: Chittibabu Comments: దేవీ నువ్వు మగాడివేనా.. దమ్ముంటే ఆ పని చెయ్.. లైవ్ డిబేట్లో రెచ్చిపోయిన చిట్టిబాబు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News