Megastar Chiranjeevi : ఆ ఘటనతోనే ఆక్సిజన్‌ బ్యాంకు ఆలోచన వచ్చింది - చిరంజీవి

Chiranjeevis Emotional Speech: క‌రోనా కష్టకాలంలో ఆక్సిజ‌న్ బ్యాంక్ సేవ‌లందించిన మెగా అభిమానుల‌కు ఆయన అభినందనలు తెలిపారు. హైదరాబాద్‌లోని రక్తనిధి కేంద్రంలో (blood bank center) తెలంగాణలోని అభిమానులతో మెగాస్టార్ (Megastar) భేటీ అయి పలు విషయాలపై మాట్లాడారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 17, 2021, 07:03 PM IST
  • కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆక్సిజన్‌ బ్యాంకుల నిర్వహణలో అభిమానుల సేవలు ఎనలేనివి
  • కరోనాతో అభిమానుల్ని కోల్పోవడం దురదృష్టకరం
  • హీరో మెగాస్టార్ చిరంజీవి వెల్లడి
Megastar Chiranjeevi : ఆ ఘటనతోనే ఆక్సిజన్‌ బ్యాంకు ఆలోచన వచ్చింది - చిరంజీవి

Megastar Chiranjeevis Emotional Speech on Telangana fans meet: కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆక్సిజన్‌ బ్యాంకుల (Oxygen‌ banks) నిర్వహణలో అభిమానుల సేవలు ఎనలేనివని హీరో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) అన్నారు. క‌రోనా కష్టకాలంలో ఆక్సిజ‌న్ బ్యాంక్ సేవ‌లందించిన మెగా అభిమానుల‌కు ఆయన అభినందనలు తెలిపారు. హైదరాబాద్‌లోని రక్తనిధి కేంద్రంలో (blood bank center) తెలంగాణలోని అభిమానులతో మెగాస్టార్ (Megastar) భేటీ అయి పలు విషయాలపై మాట్లాడారు. 

కరోనాతో అభిమానుల్ని కోల్పోవడం దురదృష్టకరమని అన్నారు. ఆక్సిజన్‌ కొరతతో గొల్లపల్లిలో (Gollapalli) చాలా మంది చనిపోయిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకుని బాధపడ్డారు. ఆ ఘటనతోనే ఆక్సిజన్‌ బ్యాంకు (Oxygen‌ Bank) ఆలోచన వచ్చిందని చిరు చెప్పారు. దుబాయ్‌, గుజరాత్‌, వైజాగ్‌ నుంచి ఆక్సిజన్‌ సిలిండర్లు తెప్పించామన్నారు. ఇక రెండో దశలో 3వేలకు పైగా సిలిండర్లు తయారు చేయించామని చెప్పుకొచ్చారు మెగాస్టార్.

Also Read : Keerthy Suresh Birthday : కీర్తి సురేశ్‌ పుట్టినరోజున పోస్టర్స్ హంగామా.. భోళా శంకర్‌, సర్కారు వారి పాట చిత్రాల పోస్టర్స్ రిలీజ్‌

కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఆక్సిజన్‌ బ్యాంకుల నిర్వహణలో అభిమానుల సేవలు గర్వకారణం అని చిరంజీవి ప్రశంసించారు. ఇక వచ్చే వారం ఏపీ అభిమాన సంఘాలతో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) సమావేశం కానున్నారు.

Also Read : CM KCR: హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో గెలిచి తీరుతాం: సీఎం కేసీఆర్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News