రంగంలోకి మెగాస్టార్... నేడు సీఎం జగన్‌తో భేటీ.. సినిమా టికెట్ ధరల వివాదం కొలిక్కి వచ్చేనా?

Chiranjeevit to meet CM Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి గురువారం (జనవరి 13) మధ్యాహ్నం భేటీ కానున్నారు. ఈ మేరకు సీఎం కార్యాలయ వర్గాలు చిరంజీవికి అపాయింట్‌మెంట్ ఫిక్స్ చేశాయి. సీఎం, చిరంజీవి కలిసి లంచ్ చేయనున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 13, 2022, 11:18 AM IST
  • నేడు సీఎం జగన్‌తో చిరంజీవి భేటీ
  • మధ్యాహ్నం కలిసి లంచ్ చేయనున్న జగన్, చిరు
  • సినిమా టికెట్ ధరల తగ్గింపుపై చర్చించే అవకాశం
రంగంలోకి మెగాస్టార్... నేడు సీఎం జగన్‌తో భేటీ.. సినిమా టికెట్ ధరల వివాదం కొలిక్కి వచ్చేనా?

Chiranjeevit to meet CM Jagan: ఏపీలో సినిమా టికెట్ల ధరల తగ్గింపుపై అటు సినీ ఇండస్ట్రీకి, ఇటు ప్రభుత్వానికి మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది. ధరల తగ్గింపుపై బడా నిర్మాతలు, హీరోలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మరోవైపు, ఏపీ ప్రభుత్వం తమకు చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అనే తేడా లేదని... అన్నీ ఒక్కటేనని చెబుతోంది. ఈ క్రమంలో ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న వార్‌తో (AP Movie Ticket War) ఇరువురి మధ్య గ్యాప్ అంతకంతకూ పెరుగుతోంది. ప్రభుత్వంతో సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించుకుంటే మంచిదని తమ్మారెడ్డి లాంటి పెద్దలు చెబుతున్నప్పటికీ... అందుకు చొరవ తీసుకునేదెవరు అన్న ప్రశ్న తలెత్తుతూ వచ్చింది. తాజాగా ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు స్వయంగా మెగాస్టార్ చిరంజీవే రంగంలోకి దిగుతుండటం గమనార్హం.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) గురువారం (జనవరి 13) మధ్యాహ్నం భేటీ కానున్నారు. ఈ మేరకు సీఎం కార్యాలయ వర్గాలు చిరంజీవికి అపాయింట్‌మెంట్ ఫిక్స్ చేశాయి. సీఎం, చిరంజీవి కలిసి లంచ్ చేయనున్నారు. ఈ సందర్భంగా టికెట్ ధరల తగ్గింపుపై చిరంజీవి జగన్‌తో చర్చించనున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో సినీ ఇండస్ట్రీపై పలువురు నేతల అనుచిత వ్యాఖ్యలను చిరు సీఎం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. జగన్‌తో భేటీ కోసం మొదట గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్న చిరంజీవి... అక్కడి నుంచి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లనున్నారు. జగన్-చిరంజీవి భేటీతో సినిమా టికెట్ల వివాదం ఓ కొలిక్కి వచ్చే అవకాశం లేకపోలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కోర్టు పరిధిలో టికెట్ల ధరల తగ్గింపు వ్యవహారం :

సినిమా టికెట్ల ధరల తగ్గింపు వ్యవహారం ప్రస్తుతం హైకోర్టు పరిధిలో ఉంది. టికెట్ల ధరలను తగ్గిస్తూ (AP Movie Ticket Price Issue) గతేడాది ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నం.35 ను హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. పాత విధానంలో థియేటర్ యజమానులే టికెట్ల ధరలు నిర్ణయించుకునేలా హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం డివిజన్ బెంచ్‌లో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం టికెట్ ధరల ఖరారుకు కమిటీ వేయాలని ఆదేశించింది. ఆ మేరకు ప్రభుత్వం కమిటీని వేయగా... ఇంకా ఆ నివేదిక ప్రభుత్వానికి అందలేదు. అఫిడవిట్ దాఖలుకు ఏపీ ప్రభుత్వం హైకోర్టును మరింత సమయం కోరడంతో... తదుపరి విచారణను కోర్టు ఫిబ్రవరి 10కి వాయిదా వేసింది.

Also Read: Today Horoscope January 13 2022: నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News