Unstoppable 2: త్వరలో మెగాస్టార్ చిరుతో బాలయ్య అన్‌స్టాపబుల్ 2, స్ట్రీమింగ్ ఎప్పుడంటే

Unstoppable 2: కారణాలు ఏమైనప్పటికీ అన్‌స్టాపబుల్ సీజన్ 2 మాత్రం దూసుకుపోతోంది. షో కారణంగా ఓటీటీ వేదిక ఆహాకు డిమాండ్ పెరిగింది. ఇప్పుడు మరో విశిష్ట అతిధిని తీసుకురానున్నారు బాలయ్య.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 3, 2023, 11:37 PM IST
Unstoppable 2: త్వరలో మెగాస్టార్ చిరుతో బాలయ్య అన్‌స్టాపబుల్ 2, స్ట్రీమింగ్ ఎప్పుడంటే

బాలయ్య హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్ 2 దుమ్ము రేపుతోంది. తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌లు షోకు హాజరయ్యారు. త్వరలో మరో స్టార్ నటుడు రావచ్చని సమాచారం. ఇప్పటికీ ఆ హీరో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని తెలుస్తోంది. 

నందమూరి బాలకృష్ణ గత ఏడాది ఆహా ఓటీటీ వేదికలో అన్‌స్టాపబుల్ షో హోస్ట్‌గా అవతారమెత్తారు. హోస్ట్‌గా తనదైన శైలిలో షోను రక్తి కట్టించారు. మోహన్ బాబు చిట్‌చాట్‌తో మొదలై..మహేశ్ బాబుతో సీజన్ 1 ముగిసింది. ఇప్పుడు రెండవ సీజన్ ప్రారంభమై..దిగ్విజయంగా దూసుకెళ్తోంది. సీజన్ 1లో మోహన్ బాబు, సుకుమార్, అల్లు అర్జున్, మహేశ్ బాబు, రవితేజ, నాని వంటి సెలెబ్రిటీలు హాజరయ్యారు. సీజన్ 2 చంద్రబాబు నాయుడితో ప్రారంభమైంది. ఇటీవలే పాన్ ఇండియా హీరో ప్రభాస్‌తో షో ముగిసింది. రెండవ పార్ట్ జనవరి 6న స్ట్రీమింగ్ కానుంది. ప్రభాస్‌తో బాలయ్య షో రెండు భాగాలుగా తీశారు. 

మరోవైపు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌తో బాలయ్య అన్‌స్టాపబుల్ షుూటింగ్ నడుస్తోంది. త్వరలో పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపధ్యంలో మెగాస్టార్ చిరంజీవితో ఎప్పుడుంటుందనే ప్రశ్నలు గట్టిగానే విన్పించసాగాయి. ఇప్పుడా ప్రశ్నలకు కూడా సమాధానం లభించేసింది. త్వరలోనే బాలయ్య అన్‌స్టాపబుల్ షోకు చిరంజీవి హాజరుకానున్నారని తెలుస్తోంది. ఇప్పటికే చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

సంక్రాంతికి ముందే ఈ చిరంజీవి ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయ్యేలా సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఎందుకంటే సంక్రాంతికి అటు చిరంజీవి, ఇటు బాలయ్య సినిమాలు భారీగా విడుదల కానున్నాయి. 

Also read: Hero Srikanth Varisu Movie : వారసుడులో అలాంటి సీన్లుంటాయి.. హీరో శ్రీకాంత్ కామెంట్స్ వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News