chiranjeevi: మెగాస్టార్ పెద్ద మనసు..అభిమాని కోసం ఫ్లైట్ టికెట్స్ పంపి మరీ....

Mega Star Chiranjeevi: ఫ్యాన్స్ కోసం ఏ సహాయం చేయడానికైనా మెగాస్టార్ చిరంజీవి ముందుంటారు. తాజాగా ఆయన మరోసారి తన మంచి మనుసు చాటుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ అభిమానిని కలిసి...అతడి చికిత్స కోసం మెుత్తం  ఖర్చులు తానే భరిస్తానని చిరంజీవి భరోసా ఇచ్చారు.

Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 24, 2021, 12:37 PM IST
chiranjeevi: మెగాస్టార్ పెద్ద మనసు..అభిమాని కోసం ఫ్లైట్ టికెట్స్ పంపి మరీ....

Mega Star Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన పెద్ద మనుసు చాటుకున్నారు. తాజాగా ఓ అభిమాని కోసం మెగాస్టార్(Mega Star Chiranjeevi) చేసిన పనికి మెగా ఫ్యాన్స్(Mega fans) ఫిదా అవుతున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఒక అభిమాని.. తనను కలవాలని కోరగా..  ప్లైట్ టికెట్ బుక్ చేసి మరీ ఇంటికి పిలిపించుకున్నారు. స్వయంగా ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకోవడమే కాదు.. చికిత్స కోసం ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ ఫేమస్ ఆస్పత్రికి తరలించారు. అవరమైతే మరింత మెరుగైన వైద్యం కోసం చెన్నై తరలించడానికి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. 

వివరాల్లోకి వెళితే.. 
మెగాస్టార్ వీరాభిమాని, విశాఖపట్నానికి చెందిన వెంకట్(Venkat) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే వెంకట్ చిరంజీవిని కలవాలన్న కోరికను ట్విటర్(Twitter) ద్వారా వెలిబుచ్చారు.  ‘నా ఆరోగ్యం అంతగా బాగుండడం లేదు, నేను మిమ్మల్ని కలవాలని కోరుకుంటున్నాను’ అని ట్విటర్ వేదికగా చిరంజీవి గారిని వెంకట్ అభ్యర్థించారు. ఈ విషయం మీద మెగాస్టార్ వెంటనే స్పందించి వెంకట్ ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు వాకబు చేసి వెంటనే వచ్చి తనను కలవాల్సిందిగా కోరారు. 

Also read: Rajinikanth PeddannaTeaser: రజనీకాంత్‌ ‘పెద్దన్న’ టీజర్‌‌ అదిరింది.. ఫ్యాన్స్‌కు వెంకటేశ్‌ సర్‌ప్రైజ్‌

ఫ్లైట్ టికెట్స్  పంపీ..
ఇందుకోసం వెంకట్, ఆయన భార్యకు విశాఖపట్నం నుంచి హైదరాబాదు(Hyderabad)కు ఫ్లైట్ టికెట్స్ తీయించి..భాగ్యనగరానికి రప్పించారు. శనివారం నాడు చిరంజీవి.. వెంకట్ ఆయన భార్య సుజాతను తన నివాసంలో కలిశారు. ఇద్దరితో దాదాపు 45 నిమిషాల సమయం కూడా గడిపారు చిరంజీవి. వెంకట్ ఆరోగ్యానికి సంబంధించిన అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు. వెంకట్ మెడికల్ రిపోర్ట్స్ పరిశీలించిన చిరంజీవి, మెరుగైన వైద్యం అందించడం కోసం హైదరాబాద్ ఓ ప్రైవేట్‌ హాస్పిటల్స్ లో చెకప్ కోసం పంపించారు.

అన్నీ ఖర్చులు తానే భరిస్తానని..
అక్కడ అన్ని రకాల పరీక్షలు చేయించి, అక్కడి వైద్యులను సంప్రదించిన ఆయన దీనికి వెంకట్ సొంత ప్రాంతం అయిన విశాఖపట్నం(Visakhapatnam)లో హాస్పిటల్ లో చేర్చే విషయం గురించి మాట్లాడారు. విశాఖ హాస్పిటల్ లో ఖర్చులు తానే చూసుకుంటానని చిరంజీవి పేర్కొన్నారు. అవసరమైతే చెన్నై హాస్పిటల్ కి తరలించి అక్కడ వైద్యం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని, తన వీరాభిమానిని కాపాడుకోవడానికి వెనుకాడేది లేదని చిరంజీవి వెంకట భార్య సుజాతకు భరోసా ఇచ్చారు. ఈ విషయం తెలిసి మెగా అభిమానులు అందరూ మెగాస్టార్ మంచి మనసు తమకు తెలుసని, అది మరోసారి ప్రూవ్ అయింది అని హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

Also Read: Koozhangal Oscar entry: ఆస్కార్‌ బరిలో నయతారకు కాబోయే భర్త మూవీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News