Chiranjeevi: దెయ్యం​ లుక్​లో మెగాస్టార్..వైరల్ అవుతోన్న వీడియో

MegaStar chiranjeevi: మెగాస్టార్​ చిరంజీవి దెయ్యం లుక్​లో కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 1, 2021, 11:47 AM IST
  • ఘోస్ట్ లుక్ లో మెగాస్టార్
  • వైరల్ గా మారిన చిరు పిక్
  • అక్టోబర్​ 31న హలోవీన్ డే సందర్భంగా చిరు వీడియో
Chiranjeevi: దెయ్యం​ లుక్​లో మెగాస్టార్..వైరల్ అవుతోన్న వీడియో

MegaStar chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి దెయ్యం లుక్‌(chiranjeevi new look)లో కనిపించి ఫ్యాన్స్‌ను థ్రిల్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్ మరియు వీడియో నెట్టింట వైరల్​గా మారాయి.

అయితే ఈ లుక్​ ఏ మూవీ కోసమో కాదు. అక్టోబర్​ 31న హలోవీన్ డే(halloween day 2021)​ సందర్భంగా పలువురు నటులు సరదాగా సెలబ్రేషన్స్​ చేసుకున్నారు. ఇందులో భాగంగానే చిరు కూడా దెయ్యం లుక్​లో ఉన్న తన సరదా వీడియోను ఇన్​స్టా స్టోరీస్(Insta Stories)​లో పోస్ట్​ చేశారు. 'హ్యాపీ హలోవీన్' అంటూ శుభాకాంక్షలు తెలిపారు. 'ఉత్కంఠభరితమైన రోజు' అనే వ్యాఖ్యను జోడించారు. అయితే ఆయన ఈ లుక్ కోసం మేకప్ వేసుకోలేదు. జస్ట్ ఓ యాప్ ఉపయోగించి వీడియో చేశారు. ​సోషల్ మీడియా(Social Media)లో ఈ వీడియో తెగ హాల్ చల్ చేస్తోంది. మీరు ఓ లుక్కేయండి.

Also read: Puneeth Rajkumar Death News: పునీత్ రాజ్ కుమార్ పార్ధీవ దేహానికి నివాళులు అర్పించిన చిరంజీవి, వెంకటేష్

ఇక సినిమాల విషయానికి వస్తే.. మెగాస్టార్ కొరటాల శివ దర్శకత్వంలో నటించిన ఆచార్య మూవీ(chiranjeevi acharya Movie) ఫిబ్రవరి 4, 2022న థియేటర్లలో విడుదల కానుంది. ఇందులో రామ్​చరణ్(Ramcharan)​, కాజల్​, పూజాహెగ్డే కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక లూసిఫర్‌ రీమేక్‌గా తెరకెక్కుతోన్న ‘'గాడ్ ఫాదర్'’ చిత్రీకరణ దశలో ఉంది. మరోవైపు మెహర్ రమేశ్ దర్శకత్వంలో ‘'భోళా శంకర్'’ త్వరలో పట్టాలెక్కనుంది. 

Also Read: RRR Movie Glimpse: ‘ఆర్ఆర్ఆర్’ నుంచి గ్లింప్స్ వచ్చేసింది.. వీడియో ఎలా ఉందంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News