Chiranjeevi: కూతురు సుస్మిత నిర్మాణం.. పవన్ దర్శకుడు.. చిరంజీవి క్రేజీ ప్రాజెక్ట్..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు. వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్‌తో అదరగొడుతున్నాడు. ప్రస్తుతం వశిష్ఠ దర్శకత్వంలో 'విశ్వంభర' మూవీ చేస్తోన్న చిరు.. తాజాగా కూతురు నిర్మాణంలో వపన్ కళ్యాణ్ దర్శకుడితో నెక్ట్స్ మూవీ చేయబోతున్నట్టు సమాచారం.

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 1, 2024, 02:19 PM IST
Chiranjeevi: కూతురు సుస్మిత నిర్మాణం.. పవన్ దర్శకుడు.. చిరంజీవి క్రేజీ ప్రాజెక్ట్..

Chiranjeevi: మెగాస్టార్ కీర్తి కిరీటంలో మరో అవార్డు వచ్చి చేరింది. తాజాగా కేంద్రం చిరును పద్మవిభూషణ్‌తో గౌరవించింది. త్వరలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులు మీదుగా చిరు ఈ అవార్డును అందుకోనున్నారు. ఆ సంగతి పక్కన పెడితే.. చిరంజీవి ప్రస్తుతం బింబిసార దర్శకుడు వశిష్ఠ డైరెక్షన్‌లో 'విశ్వంభర' మూవీ చేస్తున్నారు. ముందుగా ఈ సినిమాకు 'ముల్లోక వీరుడు' అనే టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. కానీ ఫైనల్‌గా ఈ మూవీకి 'విశ్వంభర' టైటిల్ ఫిక్స్ చేసారు.

ఈ చిత్రంలో చిరంజీవి సరసన త్రిష సహా మరో ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్నారు. మరోవైపు వరలక్ష్మి శరత్‌కుమార్ మరో కీలక పాత్రలో నటిస్తోందట. చిరు.. యముడికి మొగుడు, జగదేకవీరుడు అతిలోక సుందరి. అంజి సినిమాల తర్వాత నటిస్తోన్న సోషియో ఫాంటసీ మూవీ 'విశ్వంభర' కావడం గమనార్హం. ఈ మూవీలో చిరును ఢీ కొట్టే విలన్ పాత్రలో తమిళ హీరో శింబు నటిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే కథ విని ఇందులో చిరు పక్కన నటించాలనే కోరికతో ఈ మూవీలో యాక్ట్ చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం.

ఆ సంగతి పక్కన పెడితే.. చిరంజీవి కూతురు సుస్మిత నిర్మాణంలో ఓ సినిమా చేయడానికి ఓకే చెప్పారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ భాగస్వామ్యంలో ఈ చిత్రం తెరకెక్కబోతుంది. ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ డైరెక్ట్ చేయనున్నారు. ప్రస్తుతం రవితేజతో 'మిస్టర్ బచ్చన్' మూవీ చేస్తున్నాడు. మరో రెండు నెలల్లో ఈ మూవీ కంప్లీట్ కానుంది. ఈ మూవీ హిందీలో అజయ్ దేవ్‌గణ్ హీరోగా నటించిన 'రెయిడ్' మూవీకి రీమేక్. మరోవైపు పవన్ కళ్యాణ్‌తో చేస్తోన్న 'ఉస్తాద్ భగత్ సింగ్' ఎన్నికల తర్వాత ఈ యేడాది ద్వితీయార్ధంలో మళ్లీ ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. ఆ లోపు రవితేజ తర్వాత చిరుతో ఈ సినిమా కంప్లీట్ చేయనున్నాడు. త్వరలో ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: India Vs Eng: ఉప్పల్‌లో భారత జట్టుకు తీవ్ర నిరాశ.. టామ్ హార్ట్‌లేకు హార్ట్‌ లేదబ్బా

Also Read: Bottole Thrash: 'బాటిల్‌' కోసం చెప్పుతో కొట్టిన ప్రముఖ గాయకుడు.. నెట్టింట్లో తీవ్ర దుమారం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News