Megastar Chiranjeevi Charishma: మెగాస్టార్ పనైపోయింది.. కంబ్యాక్ లో గాడ్ ఫాదర్ వే అత్యల్ప ఓపెనింగ్ కలెక్షన్స్!

Megastar Chiranjeevi Charishma Down: గాడ్ ఫాదర్ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ ఊహించిన మేర అయితే రాలేదు. ఈ క్రమంలో రకరకాల చర్చలు తెర మీదకు వస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే 

Written by - Chaganti Bhargav | Last Updated : Oct 6, 2022, 03:22 PM IST
Megastar Chiranjeevi Charishma: మెగాస్టార్ పనైపోయింది.. కంబ్యాక్ లో గాడ్ ఫాదర్ వే అత్యల్ప ఓపెనింగ్ కలెక్షన్స్!

Megastar Chiranjeevi Charishma Down: God Father Shocking Low Collections: మెగాస్టార్ చిరంజీవి హీరోగా గాడ్ ఫాదర్ అనే సినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన లూసిఫర్ సినిమాకి ఈ సినిమా తెలుగు రీమేక్ గా రూపొందింది. వాస్తవానికి ఈ సినిమా ప్రేక్షకులు నచ్చకపోవచ్చు అని ముందు నుంచి అంచనాలు ఉన్నాయి కానీ సినిమా విడుదలైన తర్వాత అంచనాలు తలకిందులై సినిమాకు పాజిటివ్ దాకా మొదలైంది. అయితే ఎంత పాజిటివ్ టాక్ వచ్చినా ఈ సినిమాకి తొలి రోజు కలెక్షన్స్ మాత్రం అంచనాలను ఏ మాత్రం అందుకోలేకపోయాయి.

బుధవారం నాడు విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 38 కోట్ల గ్రాస్ వసూలు మాత్రమే కలెక్ట్ చేసినట్లు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. కానీ వాస్తవానికి ఈ సినిమా అంత గ్రాస్ కూడా కలెక్ట్ చేయలేదని ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవి కం బ్యాక్ ఇచ్చిన తర్వాత చేసిన సినిమాల్లో ఈ సినిమా అత్యల్ప ఓపెనింగ్ కలెక్షన్స్ దక్కించుకుందని అంటున్నారు. ఎందుకంటే ఖైదీ నెంబర్ 150 సినిమా మొదటి రోజు 23 కోట్ల పాతిక లక్షలు వసూలు చేసింది.

సైరా సినిమా అయితే 38 కోట్ల 75 లక్షలు వసూలు చేసింది. ఆచార్య లాంటి డిజాస్టర్ మూవీ కూడా 29 కోట్ల 50 లక్షలు వసూలు చేసింది. కానీ గాడ్ ఫాదర్ మాత్రం 12 కోట్ల 97 లక్షలు మాత్రమే వసూలు చేసింది. అయితే దీని వెనుక పెద్ద కారణమే ఉందని అంటున్నారు. అదేమిటంటే ఆచార్య భారీ డిజాస్టర్ తర్వాత మెగాస్టార్ నటించిన సినిమా కావడంతో చాలా చోట్ల డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయారు. డిస్ట్రిబ్యూటర్లు స్వయంగా సినిమాను రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపించలేదు. దీంతో అడ్వాన్స్ పద్ధతిలో సినిమాను రిలీజ్ చేశారు. అలాగే గతంలో భారీ ఎత్తున థియేటర్ల కౌంట్ తో సినిమాను విడుదల చేసేవారు.

కానీ ఈసారి మాత్రం చాలా పరిమితంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా 715 ధియేటర్లలో మాత్రమే ఈ సినిమాను రిలీజ్ చేశారు. ఆ ఇంపాక్ట్ కలెక్షన్స్ మీద పడింది. దీంతో కలెక్షన్స్ భారీగా తగ్గిపోయాయి. అయితే ఈ లెక్కలు ఏవి తెలియని కొంతమంది మెగాస్టార్ పని అయిపోయింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇది కరెక్ట్ కాదని మెగా అభిమానులు అంటున్నారు. మెగాస్టార్ సత్తాను ఎవరు టచ్ చేయలేరని మెగా మాస్ అంటే అది ఎప్పటికీ టాప్ లోనే ఉంటుందని వారంతా చెబుతున్నారు. మొత్తం మీద ఈ వ్యవహారం మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పక తప్పదు.
 Also Read: Akhanda Vs God Father: తక్కువ టికెట్ రేట్లతో రిలీజైన అఖండను దాటలేకపోయిన గాడ్ ఫాదర్!

Also Read: RRR in Oscars: ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్.. అఫీషియల్ గా ప్రకటించిన సినిమా యూనిట్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News