రాయ్ లక్ష్మికి మెగాస్టార్ ఫ్లయింగ్ కిస్

    

Last Updated : Nov 23, 2017, 08:04 PM IST
రాయ్ లక్ష్మికి మెగాస్టార్ ఫ్లయింగ్ కిస్

మెగాస్టార్ చిరంజీవి హీరోయిన్ రాయ్ లక్ష్మికి  ఊహించని గిఫ్ట్ ఇచ్చారు. ఫ్లయింగ్ కిస్ ఇచ్చి... లవ్ యు చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు విషయం ఏమిటంటే.. హీరోయిన్ గా రాయ్ లక్ష్మీ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఆమె హీరోయిన్ గా నటించిన జూలీ 2  హిందీ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా చిరంజీవి ఆమెకు ఆల్ ది బెస్ట్ అంటూ  ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపిన  ఓ వీడియోను పంపారు. 

ఇంతకీ చిరంజీవి వీడియో‌లో ఏమన్నారంటే...'జూలీ 2' సినిమా నీకు ప్రత్యేక మైంది...ఎందుకంటే నీ కెరీర్ లో 50 వ సినిమా. అనేక భాషల్లో నటిస్తూ... అభిమానులను మెప్పిస్తున్న నిన్ను చూస్తే చాలా సంతోషంగా ఉంది. నీ టాలెంట్ ను, నీలో ఉన్న సత్తాను 'జూలీ 2' చూపిస్తుందని ఆశిస్తున్నా.. నీవు జీవితంలో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని మనసారా కోరుకుంటున్నా.'వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్... గుడ్ లక్ టు 'జూలీ -2' అంటూ చివర్లో ఫ్లయింగ్ కిస్ విసిరారు. మీరూ చూడండి ఈ వీడియో...

 

 

మెగాస్టార్ పంపిన ఈ వీడియోను చూసి రాయ్ లక్ష్మి సంతోషంతో ఉబ్బితబ్బిబ్బైపోతూ రిప్లై ఇచ్చింది. ఆమె మాట్లల్లో చెప్పాలంటే .."ఓ మై గాడ్. మీ నుంచి శుభాకాంక్షలు అందుకోవడం నిజంగా ఒక ఆశీర్వచనంలాంటిది. నా జీవితంలో ఇది ఒక గొప్ప బహుమతి. థ్యాంక్యూ సో మచ్ చిరంజీవి గారు. ఊహించని అనుభూతికి నేను లోనయ్యాను. లవ్ యూ సర్" అంటూ రిప్లై ఇచ్చింది రాయ్ లక్ష్మి.

Trending News