Ram Charan: పాకిస్తాన్ లో మెగా హీరో గురించి చర్చ.. వైరల్ అవుతున్న వీడియో

Ram Charan in Pakistan Media: ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నారు రామ్ చరణ్. రాజమౌళి పుణ్యమా అంటూ ప్రస్తుతం ఈ హీరో పేరు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో మెగా పవర్ స్టార్ గురించి పాకిస్తాన్ మీడియాలో సైతం చర్చ జరగడంతో అది కాస్త వైరల్ అవుతోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 8, 2024, 10:03 AM IST
Ram Charan: పాకిస్తాన్ లో మెగా హీరో గురించి చర్చ.. వైరల్ అవుతున్న వీడియో

Global Star Ram Charan: రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో రామరాజు క్యారెక్టర్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు తెచ్చుకున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ సినిమాతో గ్లోబల్ స్టార్ గా ఎదిగిన రామ్ చరణ్ పాపులారిటీ మెగా అభిమానులను తెగ ఖుషి చేస్తోంది. ఈ మధ్యనే అనంత అంబానీ పెళ్లిలో కనిపించి అందరి దృష్టిని తమ వైపు తిప్పుకున్నారు రామ్ చరణ్, ఉపాసన. తెలుగు హీరోలు ఎవ్వరికీ ఇన్విటేషన్ రాలేదా లేదా ఇన్విటేషన్ వచ్చినా రామ్ చరణ్ మాత్రమే అనంత్ అంబానీ పెళ్లికి వెళ్లారా అనే దాని పైన ఎన్నో చర్చలు సాగాయి.

ఈ నేపథ్యంలో ఇప్పుడు రామ్ చరణ్ పేరు ఏకంగా పాకిస్తాన్ మీడియాలో వినిపివ్వడం ద్వారా ఆయన మరోసారి వార్తల్లో నిలుస్తున్నారు. 

ఆర్ఆర్ఆర్ సినిమాలో ముఖ్యంగా తన ఎంట్రెన్స్ దీనికి రామ్ చరణ్ ఎంతో పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. వేలమంది జనాల మధ్యలోకి దూకి రామ్ చరణ్ చేసే యాక్షన్ సీక్వెన్స్ అందరిని ఆకట్టుకుంది. తాజాగా ఈ యాక్షన్ సీన్ గురించి, రామ్ చరణ్ ఇంటెన్స్ యాక్టింగ్ గురించి పాకిస్తాన్ మీడియాలో సైతం మాట్లాకోవడం దృష్టిని ఆకట్టుకుంటోంది. అసలు విషయానికి వస్తే పాకిస్తాన్ కి చెందిన ఓ ప్రముఖ ఎంటర్‌టైన్మెంట్ ఛానల్‌లో.. ఈ యాక్షన్ సీక్వెన్స్ గురించి ప్రత్యేకంగా చర్చించుకున్నారు. “ఆర్అర్ఆర్ లో..రామరాజు పాత్ర పోషించిన రామ్ చరణ్ వేలమంది మధ్యలోకి దూకి మరి ఫైట్ చేసి, మళ్ళీ తిరిగి వచ్చి అదే పొజిషన్ లో నిలబడే సిన్ మైండ్ బ్లోయింగ్ అనిపించింది” అంటూ చెప్పుకొచ్చారు.

ఇలా పాకిస్తాన్ మీడియాలో సైతం రామ్ చరణ్ పేరు వినిపించడంతో ఆ వీడియో కాస్త తెగ వైరల్ అవుతోంది. అయితే రామ్ చరణ్ ఈ పాత్రతో చూపించిన ఇంపాక్ట్.. ఇలా పాకిస్తాన్ మీడియాలో చర్చించుకోవడంతో ఆగిపోలేదు. ఇటీవల హాలీవుడ్ లో కూడా ఈ సీన్ కి సంబంధించిన వీడియో షేర్ చేస్తూ.. ‘ప్రాజెక్ట్ లో ఒక పాత్ర కోసం రామ్ చరణ్ లాంటి నటుడు కావాలి’ అంటూ హాలీవుడ్ కి చెందిన ఓ ప్రముఖ కాస్టింగ్ సైట్ ప్రకటన ఇవ్వడం గమనార్హం.

 

 ఇక రామ్ చరణ్ రాబోయే సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈ మెగా పవర్ స్టార్ తమిళ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న గేమ్ చేంజర్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు మూడు సంవత్సరాల నుంచి జరుగుతూ ఉండటంతో ఈ చిత్రం ఎప్పుడు విడుదలవుతుందని రామ్ చరణ్ అభిమానులు తెగ ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి అవ్వగానే బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ తన తదుపరి చిత్రాన్ని చేయబోతున్నారు.

Also Read: Gaami Twitter Review: గామి ట్విట్టర్ రివ్యూ.. విజువల్ వండర్.. ఫిక్స్ అయిపోండి.. పక్కా హిట్..!  

Also Read: Indiramma Housing Scheme: ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు.. ఎప్పుడు.. ఎంతిస్తారంటే..?  

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

 

Trending News