MAA Elections 2021: మెగాబ్రదర్ సంచలన నిర్ణయం..'మా' సభ్యత్వానికి నాగబాబు రాజీనామా

'మా' ఎన్నికల ఫలితాలు దాదాపు వెలువడిన నేపథ్యంలో నాగబాబు సంచలన నిర్ణయం తీసున్నారు, 'మా' సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 11, 2021, 11:02 AM IST
  • ఎన్నికల ఫలితాల తరువాత నాగబాబు సంచలన నిర్ణయం
  • మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన
  • ఇండస్ట్రీలో హాట్ టాపిక్ మారిన నాగబాబు రాజీనామా
MAA Elections 2021: మెగాబ్రదర్ సంచలన నిర్ణయం..'మా' సభ్యత్వానికి నాగబాబు రాజీనామా

MAA Elections 2021: తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన 'మా'ఎన్నికలు (MAA Elections) జరగటం, వాటి ఫలితాలు కూడా దాదాపు వెలువడ్డట్టే.. మంచు విష్ణు (Manchu Vishnu) ప్రకాష్ రాజ్ (Prakash Raj) పై గెలిచినా సంగతి తెలిసిందే. ట్విట్టర్ వేదికగా ప్రముఖులు మంచు విష్ణుకు అభినందనలు తెలుపుతున్నారు.

గెలుపు కోసం ఇరు వర్గాలు తమదైన రీతుల్లో విమర్శలు, ఆరోపణలు చేసుకున్న సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో కూడా కొంచెం గందరగోళం నెలకొన్న.. ఎన్నికలకు మాత్రం సజావుగానే జరిగాయి. 

మెగా బ్రదర్ నాగ బాబు (Mega Brother Nagababu), ప్రకాష్ రాజ్ (Prakash Raj) కు మద్దతు తెలపటం, గెలిపించుకుంటామని  ప్రకటన చేయటం మన అందరికీ తెలిసిందే. కానీ 'మా' ఫలితాలు వెలువడిన వెంటనే నాగ

Aslo Read: Petrol prices, diesel prices: మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. Fuel rates today

బాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. 'మా' ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. నాగబాబు నిర్ణయంతో సినీ ఇండ్రస్ట్రీ మొత్తం ఒక్కసారిగా షాక్ కు గురైంది.

"ప్రాంతీయ వాదం మరియు సంకుచిత మనస్తత్వం తో కొట్టు-మిట్టులాడుతున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (Movie Artists Association) లో కొనసాగడం నాకు ఇష్టం లేక "మా" అసోసియేషన్లో  "నా" ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను...సెలవు......... - నాగబాబు అంటూ ట్విట్టర్ ద్వారా తెలిపారు. 

అంతేకాకూండా, 48 గంటల్లో తన సిబ్బంది ద్వారా 'మూవీ అసోసియేషన్ కార్యాలయానికి'  (Movie Association Office) రాజీనామా లేఖ పంపిస్తానని తెలిపారు. అంతేకాకుండా, ఇది నేను ఎంత గానో అలోచించి, ప్రలోభాలకు అతీతంగా నా చిత్త శుద్దితో తీసుకున్న నిర్ణయం అని నాగ పీబాబు పేర్కొన్నారు. 

Aslo Read: India-China Talks: ఆ ప్రాంతాల్నించి చైనా వెనక్కి వెళ్లాల్సిందే

ఇది వరకు నాగబాబు 'మా' అధ్యక్ష్యుడిగా కొనసాగిన సంగతి మన అందరికి తెలిడిసిందే. ప్రకాష్ రాజ్ కు మద్దతు తెలిపిన ఓడిపోవటం.. మరియు ఫలితాలు వెలువడిన కాసేపటికే నాగబాబు 'మా' ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేయటం.. సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News