thalapathy 67 అప్డేట్.. రచ్చ రచ్చగా మారిన మనోబాలా ట్వీట్.. వెంటనే డిలీట్

thalapathy 67 Leaks దళపతి విజయ్, లోకేష్ కనకరాజ్ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఒకటి వచ్చింది. అయితే ఇది అనుకోకుండా వేసిన ట్వీట్ అని తెలుస్తోంది. అందుకే ఆ ట్వీట్‌ను నటుడు వెంటనే డిలీట్ చేశాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 2, 2023, 10:58 PM IST
  • దళపతి విజయ్ 67వ ప్రాజెక్ట్
  • షూటింగ్ స్టార్ట్ చేశారంటూ లీక్స్
  • దెబ్బకు ట్వీట్ డిలీట్ చేసిన మనోబాలా
thalapathy 67 అప్డేట్.. రచ్చ రచ్చగా మారిన మనోబాలా ట్వీట్.. వెంటనే డిలీట్

Manobala Deleted Tweet thalapathy 67 Leaks దళపతి విజయ్ లోకేష్ కనకరాజ్ మళ్లీ చేతులు కలపబోతోన్నారంటూ టాక్స్ వచ్చిన సంగతి తెలిసిందే. మాస్టర్ సినిమా తరువాత మళ్లీ ఈ ఇద్దరూ కలిసి సినిమాను చేస్తున్నారంటూ రూమర్లు వచ్చాయి. అయితే ఈ సినిమా గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేని లోకేష్ ఎప్పటికప్పుడు దాట వేస్తూ వచ్చేవాడు. విక్రమ్ సీక్వెల్, ఖైదీ సీక్వెల్ ఇలా చాలా ఉన్నాయని, లోకేష్ సినిమాటిక్ యూనివర్సిటీకి సంబంధించి తన వద్ద పదేళ్లకు సరిపడా కథలున్నాయని చెప్పుకొచ్చాడు.

అయితే తాజాగా లోకేష్, విజయ్ సినిమాకు సంబంధించిన న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. అసలు ఈ ప్రాజెక్ట్ ఉందని కూడా ఇంత వరకు అధికారికంగా ప్రకటించలేదు. కానీ సైలెంట్‌గా షూటింగ్ స్టార్ట్ చేసింది చిత్రయూనిట్. నేడు జరిగిన షూటింగ్‌లో తమిళ నటుడు మనోబాలా కూడా ఎంట్రీ ఇచ్చాడు.  అయితే తన ఎగ్జైట్మెంట్ ఆపుకోలేక వెంటనే ట్విట్టర్‌లో అప్డేట్ చేశాడు.

 

thalapathy 67 షూటింగ్ స్టార్ అయిందని, ఈ రోజు లోకేష్, మన దళపతిని కలిశాను అని, అదే ఎనర్జీ అదే ఫుల్ స్వింగ్.. ఫస్ట్ డే అదిరిపోయిందంటూ ట్వీట్ వేశాడు. ఇంతలో ఈ ట్వీట్ ఒక్కసారిగా వైరల్ అయింది. అఫీషియల్‌గా ఇలా లీక్ చేసినట్టు అయింది. అయితే లోకేష్ అండ్ టీం మనోబాలాను బాగానే తిట్టినట్టుంది. వెంటనే ఆయన ట్వీట్ డిలీట్ చేశాడు. క్షమించండి అని ట్వీట్ పెట్టాడు. కానీ అంతలోపే స్క్రీన్ షాట్లు నెట్టింట్లో చక్కర్లు కొట్టేశాయి.

అలా thalapathy 67 సినిమాకు సంబంధించిన అనధికారిక ప్రకటన వచ్చేసినట్టు అయింది. ఇప్పుడు వారసుడు సినిమాను విజయ్ పూర్తి చేశాడు. ఇక లోకేష్ కనకరాజ్ సినిమాను మొదలుపెట్టేశాడు. ఈ చిత్రం ఈ ఏడాదిలోనే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది.

Also Read: Kalyaan Dhev New Year Post : ఈ ఏడాదిలో ఎన్నో నేర్చుకున్నా.. కళ్యాణ్‌ దేవ్ ఎమోషనల్ పోస్ట్

Also Read: Heroine Poorna Pregnant : తల్లి కాబోతోన్న హీరోయిన్ పూర్ణ.. అందుకే వాటికి దూరమైందా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News