Manchu Vishnu Strong Warning to MAA Members: హైదరాబాదులోని దసపల్లా హోటల్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికై ఏడాది పూర్తి సందర్భంగా ఈ మీడియా సమావేశం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఇక ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మంచు మోహన్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ 2021 మా ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపించాయని అనంతరం అక్టోబర్ 13వ తేదీన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నానని వెల్లడించారు.
తాను ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు సినీ పరిశ్రమలో ఎంతో అలజడి ఏర్పడిందని, తర్వాత ఆ అలజడి సద్దుమణిగేలా తన చర్యలు తీసుకున్నానని చెప్పుకొచ్చారు. తాను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి మాత్రమే కాదు ప్రేక్షకులకు కూడా జవాబు దారిని అని పేర్కొన్న మంచు విష్ణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో తాను చేసిన వాగ్దానాలు 90% పూర్తయ్యాయని పేర్కొన్నారు. సంక్రాంతి తర్వాత మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ యాప్ తీసుకొస్తామని, అలాగే నటీనటుల అవకాశాలు పెంపొందించేందుకు గాను ప్రత్యేక బుక్లెట్ కూడా తయారు చేశామని పేర్కొన్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో 20 శాతం మంది నటులు కానీ సభ్యులు ఉన్నారని అందుకే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో సభ్యత్వాన్ని కఠినంగా ఉండేలా తుది నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.
ఇక మీదట మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో సభ్యత్వం ఉన్నవాళ్లు మాత్రమే సినిమాల్లో నటించాలని నిర్మాతలకు సూచించామని నిర్మాతలు మండలి కూడా ‘మా’ సూచనలను పరిగణలోకి తీసుకుంటామని చెప్పారని ఆయన పేర్కొన్నారు. మా అసోసియేషన్ వ్యతిరేకంగా ఏ నటీనటులైనా కార్యవర్గ సభ్యులైనా, ధర్నాలు చేసిన మీడియా ముందుకు వెళ్లిన వారి సభ్యత్వం శాశ్వతంగా రద్దు చేస్తామని అలాగే ఐదేళ్లు శాశ్వత సభ్యుడిగా ఉంటేనే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు.
‘మా’కు వ్యతిరేకంగా ఎవరైనా పోస్టులు పెట్టిన వారు అనర్హత అవుతారని పేర్కొన్నారు. ఇక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ క్రమశిక్షణ కమిటీ సభ్యులుగా మోహన్ బాబు, గిరిబాబు, జయసుధ, స్వప్నదత్ వ్యవహరిస్తారని పేర్కొన్నారు. ఇక గతంలో ఈ పదవికి చిరంజీవి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అలాగే మంచు విష్ణు మాట్లాడుతూ రెండు సినిమాల్లో నటించి విడుదలైన వారికి ‘మా’లో విశేషమైన శాశ్వత సభ్యత్వం ఇస్తామని, అలాగే కనీసం ఐదు నిమిషాలు అయినా సినిమాలో కనిపించి డైలాగ్ చెప్పిన వాళ్లకు అసోసియేట్ సభ్యత్వం ఇస్తామని అయితే అసోసియేట్ గా ఉన్నవారికి ‘మా’లో ఓటు హక్కు ఉండదని ఆయన పేర్కొన్నారు.
ఇక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ భవనం కోసం రెండు ఆప్షన్స్ సూచించామని ఫిలిం నగర్కు అరగంట దూరంలో ఒక భవనం నిర్మిస్తామని, అలాగే ఇప్పుడున్న ఫిలిం ఛాంబర్ భవనాన్ని కూల్చివేసి కొత్త భవనం కట్టేందుకు తాను ఖర్చు భరిస్తానని ఈ రెండు ఆప్షన్స్ మా సభ్యుల ముందు ఉంచితే చాలా మంది సభ్యులు రెండవ అంశానికి మద్దతు పలికారని అన్నారు .
Also Read: Mahesh Babu New Look: ఏమున్నాడ్రా బాబు.. మహేష్ కొత్త లుక్ తో ఫిదా అవుతున్న లేడీ ఫాన్స్!
Also Read: Pooja Hegde Birthday: ముగ్గురు హీరోలతో పూజా హెగ్డే పుట్టినరోజు వేడుకలు(ఫోటోలు)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook