Balakrishna: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం బాలకృష్ణ.. కన్నప్పలో ఆ పాత్ర చేయనున్నారు!

Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ భక్త కన్నప్ప.. ఇది డ్రీమ్ ప్రాజెక్ట్ అనడం కంటే కూడా మల్టీ స్టార్ ప్రాజెక్ట్ అనడం కరెక్ట్ గా ఉంటుంది. ఇప్పటికే భారీ తారాగణంతో నిండిపోయిన ఈ చిత్రంలో మరొక నటసింహం ప్రవేశించనుంది అని టాక్.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 28, 2024, 07:48 PM IST
Balakrishna: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం బాలకృష్ణ.. కన్నప్పలో ఆ పాత్ర చేయనున్నారు!

Balakrishna in Kannappa: మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ డివోషనల్ మూవీ భక్త కన్నప్ప. ఈ మూవీ తన డ్రీమ్ ప్రాజెక్ట్ విష్ణు ఎప్పటినుంచో చెబుతూ వస్తున్నాడు. ఎన్ని సంవత్సరాలకి ఫైనల్ గా ఈ చిత్రం సెట్స్ ఫైకి వచ్చింది. ఇక ఈ మూవీలో మంచు విష్ణు టైటిల్ రోల్ భక్తకన్నప్పగా కనిపించబోతున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక అతనితోపాటు భారీ తారాగణం ఈ చిత్రానికి స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనున్నారు. ఇప్పటికే ప్రభాస్, శివరాజ్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు లాంటి స్టార్ హీరోలు ఈ లిస్టులో ఉన్నారు. అయితే తాజాగా ఈ లిస్టులో నందమూరి అందగాడు కూడా యాడ్ కాబోతున్నట్లు టాక్.

అవును మంచి విష్ణు భక్తకన్నప్ప చిత్రంలో బాలకృష్ణ కూడా భాగం కాబోతున్నారు అని సినీ వర్గాల సమాచారం. స్టోరీ పరంగా ఒక పాత్రకు బాలకృష్ణ అయితే బాగా సెట్ అవుతాడు అని చిత్ర బృందం చెప్పడంతో మంచు విష్ణు తో పాటు మోహన్ బాబు కూడా పర్సనల్ గా బాలకృష్ణను కలవబోతున్నారట. స్టోరీ విన్నాక బాలయ్య ఓకే చెబుతారా లేదా అన్న విషయం తెలుస్తుంది. అయితే నో చెప్పినా తమకేమీ ఇబ్బంది లేదు అని ముందుగానే చెప్పాలని మోహన్ బాబు అభిప్రాయం. 

అయితే ఇక్కడ గమనించాల్సిన కొన్ని ముఖ్య విషయాలు ఉన్నాయి. ఇప్పటివరకు బాలయ్య గెస్ట్ రోల్ ప్లే చేసిన లిస్ట్ చాలా తక్కువ. ఒకవేళ చేసిన అది కేవలం అతని తండ్రి ఎన్టీఆర్ మూవీస్ కోసం మాత్రమే. అయితే చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మంచు విష్ణు నటించిన ఊ కొడతారా ఉలిక్కి పడతారా చిత్రంలో బాలయ్య గెస్ట్ రోల్ చేశారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఆ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. కనీసం కొన్ని రోజులైనా థియేటర్లలో ఆ మూవీ ఆడింది అంటే కేవలం బాలయ్య బ్రాండ్ అనడంలో ఎటువంటి డౌట్ లేదు. 

అయితే పూర్తి ఆధ్యాత్మికత కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న భక్తకన్నప్ప మూవీకి మార్కెట్ బాగానే ఉండే అవకాశం ఉంది. ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఈ మూవీ లో  రావణబ్రహ్మ పాత్ర కోసం బాలయ్యను అడగబోతున్నారు. ఒకప్పుడు ఎన్టీఆర్ చేసి ప్రజలను మెప్పించిన ఈ పాత్ర చేయడానికి బాలయ్య ఓకే చెప్పే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. నిజంగా బాలయ్య ఈ మూవీలో రావణబ్రహ్మగా కనిపిస్తే మూవీ క్రేజ్ వేరే లెవెల్ లో ఉండడం ఖాయం.అయితే ఎన్నికల బిజీలో ఉన్న బాలయ్య ఎంతవరకు ఈ చిత్రానికి డేట్ కేటాయించగలడు అన్న విషయం ప్రశ్నార్థకంగా మారుతోంది.

కాగా ఈ మధ్యనే ‘కన్నప్ప’ రెండో షెడ్యూల్‌ను న్యూజిలాండ్‌ లో ప్రారంభించారు సినిమా యూనిట్.   ఆల్రెడీ న్యూజిలాండ్‌లో 90 రోజుల పాటు నిర్విరామంగా ఫస్ట్ షెడ్యూల్‌ను ముగించుకున్న ఈ చిత్ర యూనిట్ ఫస్ట్ షెడ్యూల్ అయ్యాక కొంత రెస్ట్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ సెకండ్ షెడ్యూల్‌ను గ్రాండ్‌గా ప్రారంభించింది.

ఈ మేరకు న్యూజిలాండ్‌లో దిగిన విష్ణు మంచు ఓ వీడియోను కూడా షేర్ చేశారు. ఇందులో మోహన్ బాబు, విష్ణు మంచు కనిపిస్తున్నారు. ఈ రెండో షెడ్యూల్‌లో ఒళ్లు గగుర్పొడిచే సీన్లను చిత్రీకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా న్యూజిలాండ్‌, థాయ్‌లాండ్, ఇండియాకు చెందిన అత్యంత ప్రతిభావంతులైన ఆర్టిస్టులు, టెక్నిషియన్లతో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది.

Also Read: ఒక్క ఎంపీ సీటైనా గెలవండి.. కేటీఆర్‌కు సీఎం రేవంత్ ఓపెన్ ఛాలెంజ్

Also Read: రూ.500 కే గ్యాస్ సిలిండర్ పథకానికి గైడ్ లైన్స్.. అర్హులు మాత్రం వీళ్లే..

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News