Manchu Manoj: తండ్రి కాబోతున్న మంచు మనోజ్.. గుడ్ న్యూస్ షేర్ చేసిన హీరో..

Manchu Manoj Tweet: మంచు ఫ్యామిలీ లో మరో వారసుడు రాబోతున్నారు. మంచు మనోజ్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ గుడ్ న్యూస్ తన అభిమానులకు తెలియజేశారు. మంచు మనోజ్ ఈ మధ్యనే భూమా మౌనికను రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా వీరిద్దరూ తల్లిదండ్రులు కాబోతున్నట్లు మంచు మనోజ్ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 17, 2023, 08:47 AM IST
Manchu Manoj: తండ్రి కాబోతున్న మంచు మనోజ్.. గుడ్ న్యూస్ షేర్ చేసిన హీరో..

Manchu Manoj To Become Father: టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ ఈ మధ్యనే భూమా నాగ మౌనిక రెడ్డి ని ప్రేమించి రెండో పెళ్లి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం మార్చిలో ఇరువైపులా కుటుంబ పెద్దల సమ్మతితో వీరిద్దరి వివాహం జరిగింది. ఈ నేపథ్యంలో మౌనిక తల్లి శోభా నాగిరెడ్డి జయంతి సందర్భంగా మంచు మనోజ్ శుభవార్త చెప్పారు. త్వరలో తాను తండ్రిని కాబోతున్నానని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. ఇది తమకు ఎంతో సంతోషకర సమయం అని, అందరూ తమ ఆశీస్సులు అందించాలని కోరారు. ఈ మేరకు మంచు మనోజ్ ట్వీట్ చేశారు. 

“అత్తమ్మ శోభా నాగిరెడ్డి గారి జయంతి సందర్భంగా... ఈ శుభవార్తని అందరితో పంచుకుంటున్నా. అత్తమ్మా... నువ్వు, భూమా నాగిరెడ్డి మామ మరోసారి అమ్మమ్మ, తాతయ్యలు అవ్వ పోతున్నారు. మా చిన్నారి ధైరవ్ అన్న కాబోతున్నాడు. నాకు తెలుసు... పైనుంచి మీరు మీ ఆశీస్సులను మాకు అందిస్తూ, మా కుటుంబం ఎదుగుదలను అనుక్షణం పరిరక్షిస్తూ, మీ అశేష ప్రేమాభిమాని మాపై కురిపిస్తూ ఉంటారు. మా అమ్మ నిర్మల, మా నాన్న మోహన్ బాబుల ఆశీస్సులతో, కుటుంబ సభ్యులం అందరి ప్రేమాభిమానాలతో ముగ్ధులమవుతున్నాం" అంటూ ట్వీట్ వేశారి ఈ హీరో.

కాగా మోహన్‌బాబు వారసుడిగా దొంగ దొంగది సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చిన మనోజ్.. ఆ తరువాత వైవిధ్యమైన కథలు కలిగిన సినిమాలు చేస్తూ మంచి హీరోగా పేరు తెచ్చుకున్నారు. కానీ ఆయనకు ఆ మధ్య వరసగా ఫ్లాపులు రావడంతో గత కొన్నేళ్లుగా పూర్తిగా సినిమాలే చేయడం మానేశాడు. 2015లో ప్రణతీ రెడ్డి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న మనోజ్.. 2019లో ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. మళ్లీ ఈ సంవత్సరం అనగా 2023లో మార్చి నెవలో భూమా మౌనికని పెళ్లి చేసుకున్నాడు. భూమా మౌనిక కి కూడా ఇది రెండే పెళ్లే.…మౌనిక కి ఇదివరకే తన మొదటి భర్తతో ధైర్యవ్ అనే కుమారుడు ఉన్నాడు. అయితే మౌనిక కూడా తన మొదటి భర్తతో విడాకులు తీసుకుని మంచి మనోజ్ ని వివాహమాడారు. ఇప్పుడు వీళ్ల ప్రేమకు గుర్తుగా మరో బుజ్జాయి రాబోతున్నాడు. కాగా ప్రస్తుతం ఈ వార్త తెగ వైరల్ అవుతుంది. 

Also Read: Bank Alerts: డిసెంబర్ 31లోగా బ్యాంకుకు వెళ్లి ఈ పని పూర్తి చేయకుంటే ఇబ్బందులు తప్పవు

Also Read: KCR Discharge: కోలుకున్న కేసీఆర్, యశోద ఆసుపత్రి నుంచి ఇంటికి డిశ్చార్జ్

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News