Manchu Manoj Bhuma Mounika : ఏడిపించిన మంచు మనోజ్ భూమా మౌనిక.. అన్ని కష్టాలు పడ్డారా?

Manchu Manoj And Bhuma Mounika Love Story మంచు మనోజ్, భూమా మౌనికల వ్యవహారం మీద వచ్చిన రూమర్లు అందరికీ తెలిసిందే. చివరకు మౌనిక మనోజ్‌ల పెళ్లి సైతం హాట్ టాపిక్ అయింది. ఈ పెళ్లితోనే మంచు వారి మధ్య ఉన్న విబేధాలు బయటకు వచ్చాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 13, 2023, 01:16 PM IST
  • నెట్టింట్లో మంచు ఫ్యామిలీ సందడి
  • మంచు వారి గొడవలపై చర్చలు
  • షోలో మనోజ్, మౌనికల ముచ్చట్లు
Manchu Manoj Bhuma Mounika : ఏడిపించిన మంచు మనోజ్ భూమా మౌనిక.. అన్ని కష్టాలు పడ్డారా?

Manchu Manoj And Bhuma Mounika మంచు మనోజ్ మొదటి పెళ్లి, సమస్యలు, విడాకులు, సినిమాల మీద ఫోకస్ పెట్టడం, కరోనా వల్ల సినిమాలు ఆలస్యం అవ్వడం, ఇక రెండో పెళ్లికి సంబంధించిన రూమర్లు, భూమా మౌనికతో మనోజ్ వివాహానికి సంబంధించిన వార్తల గురించి అందరికీ తెలిసిందే. అయితే మనోజ్ రెండో పెళ్లితో మంచు వారింట్లో ఉన్న విబేధాలు బయటకు వచ్చాయి. మంచు మనోజ్ పెళ్లిలో విష్ణు కనిపించకపోవడంతో గొడవలు నిజమేనని అందరికీ అర్థం అయ్యాయి. అయితే ఈ పెళ్లి వల్లే విబేధాలు వచ్చాయా? అంతకు ముందు నుంచి కూడా గొడవలున్నాయా? అన్నది తెలియడం లేదు.

మంచు మనోజ్, మౌనికలు ఇద్దరూ కూడా తాజాగా వెన్నెల కిషోర్ అలా మొదలైంది షోకు గెస్టుగా వచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు బయటకు వచ్చింది. ఇందులో ఈ ఇద్దరూ తమ తమ పర్సనల్ విషయాలను పంచుకున్నారు. తాము పడ్డ కష్టాలను చెబుతూ ఏడిపించేశారు. సరదా సంగతులు చెప్పి నవ్వించారు.

Also Read:  Samantha : సమంత ఆంటీ ఇంకా రెండు రోజులే ఉంది!.. సామ్ రిప్లై ఇదే

మౌనిక బయటకు ఇలా శాంతంగా కనిపిస్తుంది కానీ.. మచ్చా.. అంటూ వెన్నెల కిషోర్‌కు తన బాధను చెప్పేశాడు మనోజ్. ఇంట్లో వేరేలా ఉంటుందని హింట్ ఇచ్చాడు మనోజ్. ఇక ఇద్దరిలో నాటీ ఎవరు అన్నట్టుగా వెన్నెల కిషోర్ అడిగితే.. నేనే అంటూ మనోజ్ అసలు విషయం చెప్పాడు. ఫోన్‌లో మాట్లాడేప్పుడు నువ్వే పెట్టు.. నువ్వే పెట్టు అంటూ ఫన్నీగా మాట్లాడుకునేవారట. ఇలాంటివి నువ్ చేశావంటే ఊహించుకోవడం కష్టంగా ఉందని వెన్నెల కిషోర్ కౌంటర్లు వేశాడు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News