Manchu Lakshmi about Pushpa 2: ఇండస్ట్రీలో ముక్కుసూటిగా ఉండే మనుషులలో.. మంచు లక్ష్మి కూడా ఒకరు. తన అభిప్రాయాన్ని ఏమాత్రం సంకోచించకుండా బయటికి చెబుతూ.. మంచు లక్ష్మి ఇప్పటికే కొన్ని వివాదాల్లో కూడా ఇరుక్కున్నారు. వివాదాల విషయంలో మంచు లక్ష్మీ తన తండ్రి మోహన్ బాబు లాగానే ప్రవర్తిస్తూ ఉంటారు.
ఈ నేపథ్యంలోనే మంచు లక్ష్మి ఇంటర్వ్యూ ఒకటి.. సోషల్ మీడియాలో మళ్లీ సర్కులేట్ అవుతుంది. ఇంటర్వ్యూ లో భాగంగా బాహుబలి, పుష్ప సినిమాలలో ఏది తనకి ఇష్టం అని అడగగా.. మంచు లక్ష్మీ వెంటనే బాహుబలి అని జవాబు ఇచ్చింది. ఎందుకు అని అడిగితే మంచి లక్ష్మి ఇప్పుడు అది కాంట్రవర్సీ అవుతుంది అని అన్నారు.
"నాకు పుష్ప సినిమాలో హీరో క్యారెక్టర్రైజేషన్ తో ప్రాబ్లం ఉంది. అందులో ఆడవాళ్ళని ఆబ్జెక్టిఫై చేయడం నాకు అసలు నచ్చలేదు. అలాంటి ఒక సూపర్ హీరో అలా చేస్తే.. అది నార్మల్ అవుతుంది. బయట ప్రేక్షకులు పల్లెటూర్లలో ఉండేవాళ్ళు అల్లు అర్జున్ చేస్తే నేను కూడా చేయొచ్చు అని అనుకుంటారు. ఆ విషయంలో నాకు బాధ అనిపించింది" అని అన్నారు మంచు లక్ష్మి.
"ఐ లవ్ బన్నీ.. ఐ లవ్ పుష్ప.. కానీ అలా అని తను చేసిన పాత్ర నాకు నచ్చాలి అని లేదు కదా" అని అన్నారు మంచి లక్ష్మి. నిజానికి సినిమా విడుదలైనప్పుడు కూడా కార్ సీన్ మీద చాలా వివాదం ఏర్పడింది. ఆ సీన్ బాగాలేదు అని చాలామంది కామెంట్లు చేశారు. రష్మిక మందన్న పుష్ప సినిమాలు హీరోయిన్గా కనిపించింది.
తన శ్రీవల్లి పాత్ర కూడా ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఇక ప్రస్తుతం ఈ సినిమాకి సీక్వెల్ గా పుష్ప 2 త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం డిసెంబర్ 6న థియేటర్లలో విడుదల కాబోతోంది.
Also Read: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!
Also Read: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook