Manam Saitham: సినీ సౌండ్ ఇంజనీర్ కి సహాయం…మరోసారి మంచి మనసు చాటిన మనం సైతం

Kadambari Kiran: సినిమా ఇండస్ట్రీలో ఎవరు సమస్యలో ఉన్నారన్న వెంటనే సహాయం చేస్తూ వస్తోంది మనం సైతం. పెద్ద ఆర్థిస్ట్.. చిన్న ఆర్టిస్ట్.. అని చూడకుండా ఎవరు అడిగినా వాళ్ళకి ముందుంది మరి సహాయం చేస్తోంది..

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 4, 2024, 09:25 AM IST
Manam Saitham: సినీ సౌండ్ ఇంజనీర్ కి సహాయం…మరోసారి మంచి మనసు చాటిన మనం సైతం

Manam Saitham:
సినీ నటుడు, ‘మనం సైతం' వంటి గొప్ప సంస్థ ఫౌండేషన్ నిర్వాహకులు కాదంబరి కిరణ్ మరోసారి తన మంచి గుణం చాటుకున్నారు. కిడ్నీ సమస్యతో పోరాడుతున్న సినీ సౌండ్ ఇంజనీర్ ఈమని శ్రీనివాస్ కి మనం సైతం తరుపున ఆయన దాదాపు 25,000 ఆర్థిక సాయం చేశారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో సౌండ్ ఇంజనీర్ గా పనిచేసిన ఈమని శ్రీనివాస్ రావుకి కిడ్నీలు ఫెయిల్ అయ్యి తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆయన భార్య ఈమని శ్రీదేవి తన కిడ్నీ దానం చయడానికి సిద్ధమయ్యారు. కానీ ఆ కిడ్నీ మార్పిడి ఆపరేషన్ కోసం డబ్బు అవసరం కాగా మనం సైతం వారికి సహాయం చేశారు. ఆపద కాలంలో ఆర్థిక సాయం చేసిన   ‘మనం సైతం' నిర్వాహకులు కాదంబరి కిరణ్ కు ఆమె ఎప్పుడు రుణపడి ఉంటానని కృతజ్ఞతలు తెలిపారు.

మనం సైతం సినీ రంగంలో ఎవరికి సహాయం కావాలన్నా అందజేస్తూ ఉంటుంది. గతవారం కూడా సినీ రైటర్ భరత్ కుమార్ పక్షపాతం, హృద్రోగంతో తీవ్ర అనారోగ్యానికి గురికాగా.. ఆయన వైద్య సదుపాయాల కోసం మనం సైతం నుంచి కాదాంబరీ కిరణ్ రూ.25,000 సాయం అందించి మానవత్వం చాటుకున్నారు.

సూర్యాపేటకు చెందిన రిపోర్టర్ వై. రవి కుమార్ తల్లి తారమ్మ కిడ్నీస్ ఫెయిల్ కాగా... వారి తండ్రికి కూడా కాళ్ళు ఇన్ఫెక్షన్ తో ఇబ్బందులు పడుతున్నారు. వారికి కూడా మనం సైతం సహాయం అందజేశారు. వారి వైద్యవసరాల కోసం రూ.25,000 ఆర్థిక సాయం చేసారు కాదంబరి కిరణ్.

ఇక నేడు సీనియర్ జర్నలిస్ట్ టి ఎల్ ప్రసాద్ కంటి ఆపరేషన్ కొరకు కూడా మనం సైతం తరఫున కాదంబరి కిరణ్ 25,000/-ఆర్ధిక సాయం అందించారు.
పది సంవత్సరాల నుంచి మనం సైతం ఫౌండేషన్ ద్వారా కాదంబరి కిరణ్ పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇకమీదట కూడా ఇలాంటివి సహాయాలు ఎన్నో చేయడానికి ముందున్నారు కిరణ్.

Also Read: Pawan Kalyan Fever: పవన్‌ కల్యాణ్‌కు అస్వస్థత.. యాత్రను వదిలేసి హుటాహుటిన హైదరాబాద్‌కు

Also Read: AP Pensions: ఏపీ ప్రజలకు భారీ షాక్.. ఇకపై ఇంటింటికి పథకాలు రావు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News