Nayanthara Character : నయనతార అలాంటిదా?.. అసలు కారెక్టర్ బయటపెట్టేసిన మమతా మోహన్ దాస్

Mamta Mohandas on Rajinikanth Song మమతా మోహన్ దాస్ తాజాగా చేసిన కామెంట్లను పట్టి చూస్తే నయనతారకు ఇగో ఉన్నట్టుగా కనిపిస్తోంది. సెట్ మీద ఇంకో హీరోయిన్ ఉంటే తాను రానని చెప్పేసేదట. అందుకే తనకు ఓ సాంగ్ చిత్రీకరణలో స్పేస్ ఇవ్వలేదని మమతా మోహన్ దాస్ చెప్పుకొచ్చింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 10, 2023, 08:20 PM IST
  • ట్రెండింగ్‌లో మమతా మోహన్ దాస్
  • అలాంటి కండీసణ్ పెట్టిన నయన్
  • నాటి విషయాలు చెప్పిన హీరోయిన్
Nayanthara Character : నయనతార అలాంటిదా?.. అసలు కారెక్టర్ బయటపెట్టేసిన మమతా మోహన్ దాస్

Mamta Mohandas Comment on Nayanthara మమతా మోహన్ దాస్ క్యాన్సర్‌ను జయించిన సంగతి తెలిసిందే. కేడీ సినిమా షూటింగ్‌ సమయంలో క్యాన్సర్ బారిన పడినా కూడా హెల్త్ సహకరించకపోయినా కూడా షూటింగ్‌ చేయమని మనో ధైర్యాన్ని నింపాడంటూ నాగార్జున గురించి ఎంతో గొప్పగా చెప్పింది మమతా మోహన్ దాస్. ఆ క్లిష్ట సమయంలో నాగ్ ఎంతో అండగా ఉన్నాడని చెప్పుకొచ్చింది.

అలాంటి మమతా మోహన్ దాస్ తాజాగా కొన్ని సంఘటనలు చెప్పుకొచ్చింది. గతంలో ఓ సారి నయనతార చేసిన విషయాన్ని ఇప్పుడు బయటపెట్టేసింది. రజనీకాంత్‌తో ఓ సారి సాంగ్ షూటింగ్ చేయాలని మేకర్లు అడిగారట. ఆ పాట కోసం మమతా మోహన్ దాస్‌ను అడిగారట. అయితే ముందుగా చెప్పినట్టు కాకుండా.. అసలు తాను కనిపించకుండా కత్తిరించి పాడేశారట. ఆ పాటలో అసలు తాను లేకుండానే చేశారట.

దానికి కారణం నయనతార అని, వేరే హీరోయిన్ సెట్ మీదుంటే తాను రానని నయనతార మొండికేసిందట. ఆ విషయాలన్నీ తనకు తరువాత తెలిశాయని మమతా మోహన్ దాస్ చెప్పుకొచ్చింది. ఆ పాట కోసం నాలుగు రోజులు షూట్ చేశామని, అది నాకు చాలా బాధగా అనిపించిందంటూ మమతా మోహన్ దాస్ నాటి సంగతులు గుర్తు చేసుకుని బాధపడింది.

ఇక అరుంధతి సినిమాను మిస్ చేసుకున్న తీరు గురించి ఇది వరకే చెప్పి ఎంతగానో బాధపడింది. అంత మంచి చాన్స్‌ను మిస్ చేసుకున్నావ్ అంటూ రాజమౌళి సైతం అన్నాడట. అలా కెరీర్ స్టార్టింగ్‌లోనే ఎంతో ఎత్తుకు ఎదగాల్సిన మమతా మోహన్ దాస్ ఇలా మిగిలిపోయింది.

డ్యాన్సర్‌, సింగర్‌, నటిగా ఇలా మమతా మోహన్ దాస్ పలు రకాలుగా తన ప్రతిభను చాటుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కొన్ని సినిమాలతో ఆమె బిజీగా ఉంది. ఆమె నటించిన రుద్రాంగి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే.

Also Read:  Anupama Photos : అనుపమా.. అందానికి చిరునామా?.. ఎన్ని వింత భంగిమలో.. పిక్స్ వైరల్

Also Read: Ram Charan : పదేళ్లుగా ఎంతో ఎదురుచూశాం!.. తండ్రి కాబోతోండటంపై రామ్ చరణ్‌ కామెంట్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News