Nivin Pauly rape case : హేమ కమిటీ నివేదిక విడుదలైన తరువాత లైంగిక వేధింపుల ఆరోపణలు మరింత జోరుగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు వివరాల్లోకి వెళితే.. ఒక మలయాళం నటి నివిన్ పౌలీ తో కలిపి ఆరుగురి మీద రేప్ కేసు నమోదు చేశారు. ప్రేమమ్ సినిమాతో మలయాళంలో మాత్రమే కాక తెలుగులో కూడా మంచి ఫేమ్ అందుకున్న నటుడు నివిన్ పౌలీ. తాజాగా ఇప్పుడు మలయాళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపుల ఆరోపణల విషయంలో నివిన్ పేరు కూడా కొత్తగా జత అయ్యింది.
ఒక నటి ఎర్నాకులం రూరల్ ఎస్పీకి నివిన్ కి వ్యతిరేకంగా కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. వారు ఉనుక్కల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయాలని ఆదేశించినట్లు సమాచారం. ఈ ఆరోపణల్లో నివిన్ పౌలీ పేరు ఆరో నిందితుడిగా నమోదు అయ్యింది. ఈ కేసులో నిర్మాత ఏకే సునీల్ రెండవ నిందితుడుగా ఉన్నారు.
తాజా సమాచారం ప్రకారం, శ్రేయ అనే మహిళ మొదటి నిందితురాలు అని తెలుస్తోంది. ఆమె బాధితురాలైన నటితో ఒక సినిమా గురించి చర్చించడానికి దుబాయ్ రావాలని పిలిచింది అని.. అక్కడే ఆమెపై లైంగిక వేధింపులు జరిగాయని బాధితురాలు ఆరోపించారు.
అయితే నివిన్ పౌలీ ఈ ఆరోపణలపై వెంటనే స్పందించారు. ఆయన ట్విట్టర్ ద్వారా ఈ ఆరోపణలను ఖండిస్తూ, “నా మీద దుష్ప్రచారం జరుగుతోంది. ఇది పూర్తిగా అబద్ధం. ఈ ఆరోపణలలో నిజం లేదు అని నిరూపించడానికి ఎంత దూరమైనా వెళ్తాను. ఇందులో బాధ్యులను బయటపెట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటాను. మిగతా చట్టపరమైన వ్యవహారాలు అన్నీ న్యాయపరంగానే జరుగుతాయి,” అని ట్వీట్ చేశారు.
— Nivin Pauly (@NivinOfficial) September 3, 2024
జస్టిస్ హేమ కమిటీ నివేదిక ఆగస్టు 19న బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. దీని తర్వాత మలయాళ పరిశ్రమలో మీటూ ఉద్యమం మరింత జోరు అందుకుంది. దీనిలో భాగంగా నటులు సిద్ధీక్, ముకేశ్, దర్శకుడు రంజిత్ వంటి ప్రముఖులపై కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మోహన్‌లాల్, మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (AMMA) అధ్యక్ష పదవికి రాజీనామా కూడా చేశారు.
Read more: Hydra Ranganath: సీఎం రేవంత్ మరో సంచలనం.. హైడ్రా రంగనాథ్ కు మరో అదిరిపోయే పోస్టు..?..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
Twitterమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి