Malaika Arora Wedding: త్వరలో బాలీవుడ్‌లో మరో జంట పెళ్లి.. స్టార్ హీరోయిన్ అండతో..!

Malaika Arora all set for Wedding with Arjun Kapoor. బాలీవుడ్‌ వర్గాల సమాచారం ప్రకారం మలైకా అరోరా, అర్జున్ కపూర్ ఈ ఏడాది శీతాకాలంలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : May 18, 2022, 05:52 PM IST
  • త్వరలో బాలీవుడ్‌లో మరో జంట పెళ్లి
  • పెళ్లికి సిద్ధమైన మలైకా అరోరా
  • స్టార్ హీరోయిన్ అండతో
Malaika Arora Wedding: త్వరలో బాలీవుడ్‌లో మరో జంట పెళ్లి.. స్టార్ హీరోయిన్ అండతో..!

Malaika Arora all set for Wedding with Arjun Kapoor: గతకొంత కాలంగా బాలీవుడ్‌లో పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న విషయం తెలిసిందే. 2021 డిసెంబర్‌లో లవ్‏బర్డ్స్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లి బంధంతో ఒక్కటి కాగా.. 2022 ఏప్రిల్ 14 ప్రేమ పక్షులు అలియా భట్, రణ్‌బీర్ కపూర్ పెళ్లి పీటలు ఎక్కారు. తాజాగా బాలీవుడ్‌లో మరో ప్రేమ జంట కూడా వివాహ బంధంలోకి అడుగుపెట్టనుందని తెలుస్తోంది. లవ్‏బర్డ్స్ మలైకా అరోరా, అర్జున్ కపూర్ త్వరలోనే మూడుముళ్ల బంధంతో ఒక్కటి కానున్నారని బాలీవుడ్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

బాలీవుడ్‌ వర్గాల సమాచారం ప్రకారం మలైకా అరోరా, అర్జున్ కపూర్ ఈ ఏడాది శీతాకాలంలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. నవంబర్ చివరిలో కానీ లేదా డిసెంబర్ ఆరంభంలో కానీ లవ్‏బర్డ్స్ పెళ్లి చేసుకునే అవకాశం ఉందట. వీరి పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ముంబైలోనే వారిద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొన్నారట. స్టార్ హీరోయిన్, అర్జున్ కపూర్ సోదరి కరీనా కపూర్ అధ్వర్యంలో ఈ పెళ్లి జరుగుతుందని సమాచారం. 

మలైకా అరోరా, అర్జున్ కపూర్ నిరాడంబరంగా తమ పెళ్లి తతంగం ముగించి.. భారీగా వెడ్డింగ్ డిన్నర్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. వెడ్డింగ్‌లో మలైకా, అర్జున్ కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులతో సహా బాలీవుడ్‌ సినిమా పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులు పాల్గొననున్నారట. పెళ్లికి ఇంకా చాలా సమయం ఉన్నా.. ఈ లవ్‏బర్డ్స్ ఇప్పటినుంచే అన్నీ ప్లాన్ చేసుకుంటున్నారట. 

గత నాలుగు సంవత్సరాల పాటు మలైకా అరోరా, అర్జున్ కపూర్ డేటింగ్ చేస్తున్నారు. ఇద్దరు కలిసి బాహాటంగానే చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. ఇరు కుటుంబాల ఫంక్షన్‌లకు కూడా హాజరవుతున్నారు. అర్జున్‌ వయసు 36 కాగా.. మలైకాకు 48 ఏళ్లు. వీళ్లిద్దరి మధ్య వయసు తేడా 12 ఏళ్ల కారణంగా ఈ రిలేషన్‌ విషయంలో తరచూ ట్రోల్స్‌ వచ్చినా అవేమీ పట్టించుకోకుండా ముందుకుపోతున్నారు. మలైకా గతంలో సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్‌ని పెళ్లి చేసుకోగా.. వారికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. అర్బాజ్ నుంచి విడాకులు తీసుకున్న ఈ హాట్ బ్యూటీ అర్జున్‌తో రిలేషన్‌షిప్ కొనసాగిస్తుంది.

Also Read: AVAK OTT: ఓటీటీలోకి 'అశోకవనంలో అర్జున కల్యాణం'.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచో తెలుసా?

Also Read: Warangal Tractor Accident: వరంగల్‌లో ఘోర విషాదం... ట్రాక్టర్ బోల్తా పడి ఐదుగురు దర్మరణం...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News