Major Movie Release Date: 'మేజర్' మూవీ విడుదల తేదీ ఫిక్స్.. ఎప్పుడంటే!

Major Movie Release Date: కరోనా కారణంగా వరుస వాయిదాలతో నెట్టొస్తున్న 'మేజర్' చిత్రాన్ని ఎట్టకేలకు థియేటర్లలో రిలీజ్ చేసేందుకు చిత్రబృందం సిద్ధమైంది. ఈ మేరకు జూన్ 3న సినిమాను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 27, 2022, 12:47 PM IST
Major Movie Release Date: 'మేజర్' మూవీ విడుదల తేదీ ఫిక్స్.. ఎప్పుడంటే!

Major Movie Release Date: 26/11 ముంబయి ఉగ్రదాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితాధారంగా రూపొందిన చిత్రం 'మేజర్'. ఈ మూవీలోని సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో అడివి శేష్ నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదల సిద్ధమైంది. కానీ, కరోనా సంక్షోభం కారణంగా వరుస వాయిదాలు పడింది. దీంతో ఇప్పుడు సినిమా థియేటర్లు మళ్లీ తెరచుకోవడం వల్ల సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్రబృందం సిద్ధమైంది. 

'మేజర్' చిత్రాన్ని జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా ఉన్న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ మూవీని తెలుగుతో పాటు హిందీ, మలయాళ భాషల్లో విడుదల చేయనుంది. ఇదే విషయాన్ని చిత్రబృందం బుధవారం అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ వీడియోలు ఆకట్టుకుంటున్నాయి. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sesh Adivi (@adivisesh)

అడివి శేష్ నటించిన 'గూఢచారి' సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన శశికిరణ్ తిక్కా.. 'మేజర్' సినిమాకూ డైరెక్షన్ చేశారు. ఇందులో అడివి శేష్ సరసన బాలీవుడ్ హీరోయిన్ సయీ మంజ్రేకర్ నటిస్తోంది. ఈ చిత్రాన్ని ఏప్లస్ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ తో పాటు జీఎంబీ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై హీరో మహేష్ బాబు నిర్మిస్తున్నారు. 

 

Also Read: Avatar 2 Trailer: జేమ్స్ కెమెరూన్ భారీ ప్లాన్.. 160 భాషల్లో 'అవతార్ 2' రిలీజ్!

Also Read: Rakul Preet Photos: సంప్రదాయ దుస్తుల్లో మెరుస్తున్న సైజ్ జీరో బ్యూటీ రకుల్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News