Mahesh Babu: మరో వివాదంలో మహేష్ బాబు సంచలన చిత్రం.. ఇది దెబ్బ మీద దెబ్బ ..

Mahesh Babu : మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'శ్రీమంతుడు' మూవీ కథ తనదే అంటూ ఓ వ్యక్తి కోర్టు కెక్కి విజయం సాధించిన సంగతి తెలిసిందే కదా. తాజాగా మహేష్ బాబు హీరోగా తెరకెక్కి సూపర్ హిట్‌గా నిలిచిన మరో సినిమా కథ కూడా తనదే అంటూ అదే వ్యక్తి కోర్టు కెక్కబోతున్నాడు.  

Last Updated : Feb 15, 2024, 10:23 AM IST
Mahesh Babu: మరో వివాదంలో మహేష్ బాబు సంచలన చిత్రం.. ఇది దెబ్బ మీద దెబ్బ ..

Mahesh Babu: మన దగ్గర సినిమాలకు కథలను అందించే వాళ్లకు సరైన క్రెడిట్ దక్కడం లేదు. గతంలో ఏదైనా దర్శకుడు .. ఏదైనా కథ రచయతకు సంబంధించిన  స్టోరీని సినిమాగా తెరకెక్కిస్తే.. ఆయా రచయతలకు మంచి క్రెడిట్ ఇచ్చేవారు. ఒకప్పుడు యద్దనపూడి సులోచన రాణి, ఆ తర్వాత యండమూరి వీరేంద్రనాథ్, మల్లిక్, విజయేంద్ర ప్రసాద్ వంటి రచయితలకు మన దర్శకులు మంచి ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. రాను రాను కొంత మంది దర్శకులు .. రచయతల నుంచి కథలు విని అందులో ఇంపార్టెంట్ పార్ట్ లేపేసి తమ పేరుతోనే ఆ కథ తనదే అంటూ టైటిల్స్‌లో వేసుకుంటున్నారు. ఈ కోవలో శ్రీమంతుడు దర్శకుడు కొరటాల శివ ముందున్నాడు. శ్రీమంతుడు సినిమా కాపీ రైట్ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా కథ తనదే అంటూ ఎన్నో పోరాటాలు గట్రా చేసిన తర్వాత సుప్రీంకోర్టులో అతనికి న్యాయం లభించింది. అంతేకాదు దర్శకుడు కొరటాల శివ కాపీ చౌర్యం కిందా.. అతనిపై క్రిమినల్ కేసు నమోదైంది. ఈ వివాదం ఇంకా పూర్తిగా తేలకముందే మహేష్ బాబు.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేసిన 'మహర్షి' సినిమా కూడా ఇదే తరహా చిక్కుల్లో పడే అవకాశం కనిపిస్తోంది.

శ్రీమంతుడు  సినిమా కథను స్వాతి పత్రికలో ప్రచురించిన స్టోరీ ఆధారంగా కాపీ చేశారని రచయత శరత్ చంద్ర గతంలోనే హైదరాబాద్‌లోని నాంపల్లి క్రిమినల్ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే కదా. ఆయన వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు డైరెక్టర్ కొరటాల శివ కాపీ చౌర్యానికి పాల్పడ్టు నిర్దారణ చేసి అతనిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశించిన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా కథ స్వాతి వార పత్రికలో వచ్చిన 'చచ్చేంత ప్రేమ' అనే కథ నుంచి సీన్ టూ సీన్ కాపీ చేసారని ఆరోపించారు.

రీసెంట్‌గా ఏ సినిమా తీసుకున్న ఏమున్నది గర్వకారణం అన్నట్టు.. ప్రతి మూవీ స్టోరీ వెనక ఎంతో మంది దర్శక,నిర్మాతల మేథోమదనం ఉంటుంది. ఒక వ్యక్తి బుర్రలో పుట్టిన స్టోరీ అతనిదే అని నిరూపించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. రీసెంట్‌గా ఓ సినిమా పెద్ద సినిమాను తెరకెక్కించిన దర్శకుడును పక్కన పెట్టి సదరు నిర్మాత ఆ సినిమాను తానే డైరెక్ట్ చేసానంటూ పేరు కూడా వేసుకున్నాడు. పాపం సదరు నిర్మాతపై పోరాడే ఆర్ధిక స్థోమత సహా ఇండస్డ్రీలో అతన్ని సపోర్ట్ చేసే వర్గం గట్రా లేకపోవడంతో అతను లైమ్ లైట్‌లోకి రాలేకపోయాడు. అటు సుమంత్ సత్యం సినిమాలో చూపించనట్టు.. తాను రచించిన కథను వేరే ఎవరో తన పేరు వేసుకున్నట్టు .. శ్రీమంతుడు సహా పలు సినిమాల విషయంలో జరుగుతోంది అదే. తాజాగా మహర్షి సినిమా కథ తనదే అంటూ రచయత శరత్ చంద్ర సంచలన ఆరోపణలు చేసాడు. అంతేకాదు అందుకు ఆధారాలు చూపించాడు. తను రాసిన 'సమాహారం' అనే నవలలోని కొన్ని సీన్స్‌ను ఈ సినిమాలో యథాతదంగా వాడుకున్నట్టు చెబుతున్నాడు. 'శ్రీమంతుడు' సినిమా కేసు ఓ కొలిక్కి వచ్చింది. అందుకే ' 'మహర్షి' సినిమా విషయంలో తన హక్కును పొందేందకు కోర్టుకు ఎక్కబోతున్నట్టు చెబుతున్నారు.

'మహర్షి' సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమా హీరోగా మహేష్ బాబుకు 25వ చిత్రం. దిల్ రాజు, పీవీపీ, అశ్వనీదత్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది.  ఈ సినిమా 2019లో జాతీయ చలన చిత్ర అవార్డులలో ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా నేషనల్ అవార్డు సాధించింది. అలాంటి సినిమాపై ఇపుడు రచయత శరత్ చంద్ర .. కాపీ కథ అంటూ ఆరోపణలు చేస్తూ కోర్టుకు వెళ్లనుండటం ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది.

మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే.. రీసెంట్‌గా త్రివిక్రమ్ దర్శకత్వంలో 'గుంటూరు కారం' సినిమాతో పలకరించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అబౌ యావరేజ్‌గా నిలిచింది. ఈ సినిమా కూడా యద్దనపూడ సులోచన రాణి రాసిన 'కీర్తి కిరీటాలు' అనే నవలా ఆధారంగా తెరకెక్కించారు. దీనిపై కూడా వివాదం చెలరేగిపోకపోవడానికి కారణం ఆమె ఈ లోకంలో లేకపోవడమే. అంతకు ముందు గురూజీ..'అ..ఆ' మూవీ విషయంలో కూడా జరిగింది కూడా ఇదే. అంతేకాదు రూ. 200 కోట్ల గ్రాస్ క్లబ్బులో ప్రవేశించింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. అక్కడ నెంబర్ వన్‌గా ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. త్వరలో రాజమౌళితో చేయబోయే సినిమా కోసం మహేష్ బాబు ప్రిపేర్ అవుతున్నాడు.

Also read: AP Capital Issue: ఏపీ రాజధానిపై నిర్ణయం కేంద్రానిదే, మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News