Mahesh Babu Offer: దటీజ్ మహేష్.. జీ తెలుగు డాన్స్ ఇండియా డాన్స్ కంటెస్టంట్లకు స్టేజ్ మీదే ఆఫర్

Mahesh Babu Gave Movie Chance to Zee Telugu Dance India Dance Contestants: దటీజ్ మహేష్ అనిపించుకున్నారు మహేష్ బాబు, జీ తెలుగు డాన్స్ ఇండియా డాన్స్ కంటెస్టంట్లకు స్టేజ్ మీదే ఆఫర్ ఇచ్చేశారు. ఆ వివరాలు

Written by - Chaganti Bhargav | Last Updated : Sep 3, 2022, 06:27 PM IST
Mahesh Babu  Offer: దటీజ్ మహేష్.. జీ తెలుగు డాన్స్ ఇండియా డాన్స్ కంటెస్టంట్లకు స్టేజ్ మీదే ఆఫర్

Mahesh Babu Gave Movie Chance to Zee Telugu Dance India Dance Contestants: సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకపక్క సినిమాలు చేస్తూనే మరో పక్క  సినిమాలు నిర్మిస్తున్నారు. అదేవిధంగా సమాజ సేవా కార్యక్రమాలు చేస్తూనే మరోపక్క వ్యాపారాలు కూడా చేస్తున్నారు. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఆదివారం నాడు జీ తెలుగులో ప్రసారమవుతున్న డాన్స్ ఇండియా డాన్స్ తెలుగు వెర్షన్ షోకి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రసారం కాబోతున్న ఈ షోలో మహేష్ బాబు తన కుమార్తె సితారతో కలిసి సందడి చేశారు.

ఇప్పటికే ఈ షో కి సంబంధించిన ప్రోమోలు అలాగే ట్రైలర్ షో మీద విపరీతమైన ఆసక్తి ఏర్పాటయ్యేలా ఉంది. ఇక కంటెస్టెంట్లు చేసిన సందడి మొత్తం హైలైట్ అవుతోంది. ముందుగా సుహానా అనే ఒక చిన్నారి మహేష్ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉందని చెప్పడంతో మహేష్ మురిసిపోవడం కనిపిస్తోంది. అలాగే భూమిక అనే ఒక కంటెస్టెంట్ తన అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ తో మహేష్ బాబును మెప్పించడమే కాదు మహేష్ తో ఒక హగ్గు కూడా తీసుకుంది.

సితార నాన్నకు హగ్ ఇచ్చారు మరి నా హగ్ ఎక్కడ అంటూ డిమాండ్ చేసి మరీ తీసుకుంది. తరువాత మైఖేల్ బాబు, కుమార్ ఇద్దరూ డాన్స్ పెర్ఫార్మెన్స్ చేయడంతో అది మహేష్ బాబుకు బాగా నచ్చేసింది. దీంతో మహేష్ బాబు మరో ఆలోచన లేకుండా ఇప్పుడు చేస్తున్న సినిమా కానీ చేయబోతున్న సినిమాలకు గాని మిమ్మల్ని కచ్చితంగా పెట్టుకుంటానంటూ వారికి అక్కడికక్కడే హామీ ఇచ్చారు. దీంతో ఆ సెట్ లో ఉన్న అందరూ ఒక్కసారిగా థ్రిల్ ఫీలయ్యారు. మిగతా కంటెస్టెంట్లు కూడా ఆనందం వ్యక్తం చేశారు.

ఇక ఆఫర్ అందుకున్న కంటెస్టెంట్లు మరో ఆలోచన లేకుండా మహేష్ దగ్గరికి వెళ్లి కాళ్ళ మీద పడిపోవడంతో ఆయన లేపి వారిని హగ్ చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. మహేష్ బాబు సినిమా విషయానికి వస్తే ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు.  మహేష్ బాబు కెరీర్ లో 28వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ మీద రూపొందిన ఈ సినిమా షూటింగ్ ఈ నెలలో ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఇంకా సెట్స్ మీదకు అయితే వెళ్లలేదు.

Also Read: Brahmastra Promotions in Cash Program: క్యాష్ ప్రోగ్రాంకి అలియా-రణబీర్.. బాలీవుడ్ రేంజ్ పడిపోయిందా.. తెలుగు ఆడియన్స్ రేంజ్ పెరిగిందా?

Also Read: Anchor Lasya Hospitalised: యాంకర్ లాస్యకు అస్వస్థత.. హాస్పిటల్లో చేరిక!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News