12 Years For Khaleja : ఖలేజ సినిమాకు ఇవే మైనస్‌లు.. మహేష్‌ త్రివిక్రమ్ చేసిన తప్పులివే

Khaleja Completes 12 Years మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ఖలేజా చిత్రం అందరినీ అంతగా మెప్పించలేకపోయింది. డిజాస్టర్ చిత్రంగా బాక్సాఫీస్ వద్ద చతికిల పడింది. అయితే మహేష్ మ్యానరిజానికి అంతా ఫిదా అయిపోయారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 7, 2022, 02:46 PM IST
  • మహేష్‌ బాబు త్రివిక్రమ్ మూవీలు
  • ఖలేజా విడుదలై పుష్కర కాలం
  • సినిమాలోని మైనస్‌లు ఇవేనా?
12 Years For Khaleja : ఖలేజ సినిమాకు ఇవే మైనస్‌లు.. మహేష్‌ త్రివిక్రమ్ చేసిన తప్పులివే

Mahesh Babu- Trivikram - Khaleja : అతడు సినిమాతో మహేష్‌ బాబు త్రివిక్రమ్ కాంబో ఓ ట్రెండ్ సెట్ చేసింది. సినిమా ఆసాంతం వినోదభరితంగా, ఫ్యామిలీ అంతా కలిసి హాయిగా కూర్చునే చిత్రంగా అతడు నిలిచిపోయింది. అతడు సినిమాను బుల్లితెరపై ఎన్ని సార్లు వేసినా జనాలు చూస్తూనే ఉంటారు. నెలకు రెండు మూడు సార్లైనా కూడా అతడు సినిమాను ప్రసారం చేస్తుంటారు. అయితే అతడు సినిమా కలెక్షన్ల పరంగా నిర్మాతను సంతృప్తి పరచకపోయినా.. ప్రేక్షకుడు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశాడు.

అతడు సినిమా తరువాత ఖలేజాతో మహేష్‌ త్రివిక్రమ్ మ్యాజిక్ చేసేందుకు వచ్చారు. ఈ సినిమా కంటే ముందు మహేష్‌ రెండున్నరేళ్ల గ్యాప్ ఇవ్వడం, సినిమాను చాలా దీర్ఘంగా షూట్ చేస్తూ ఉండటం, అప్పటికే వచ్చిన లీకులు, మహేష్‌ బాబు ఈ సినిమాలో దేవుడిగా కనిపిస్తాడట.. అంటూ టాక్ రావడం, టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ కూడా అంచనాలు పెంచేసింది.

తీరా సినిమా విడుదలకు ముందు.. ఖలేజా టైటిల్ మీద వివాదం వచ్చింది. చివరకు ఖలేజా సినిమాను మహేష్‌ ఖలేజాగా మార్చేశారు. అయితే ఫస్ట్ డే ఫస్ట్ షోకే ఈ సినిమాకు దారుణమైన టాక్ వచ్చింది. సినిమా కాన్సెప్ట్ ఏంటి? అసలు మహేష్‌బాబు దేవుడా? కాదా? సినిమా నేపథ్యం ఏంటి? అసలేం జరుగుతోంది? అనేది ఎవ్వరికీ అర్థం కాలేదు. దీంతో గందరగోళంగా మారింది.

అలా మొదలైన నెగెటివ్ టాక్ పెరుగుతూనే వచ్చింది. అంచనాలు అందుకోలేక అట్టడుగునే ఆగింది. అనుష్క పాత్రను తీర్చి దిద్దిన తీరు, కథలోని అసలు పాయింట్ చివర్లో ఎప్పుడో రివీల్ చేయడం, మహేష్‌ బాబుని దేవుడిగా ఊహించుకుని వచ్చిన ప్రేక్షకులకు అది నిజం కాదని తెలియడంతో అంతా నిరాశ చెందారు. దీంతో ఖలేజా బాక్సాఫీస్ వద్ద ఓడినా.. బుల్లితెరపై గెలిచింది. మహేష్‌ బాబు సరికొత్త డైలాగ్ డెలివరీ, మ్యానరిజంతో ఆకట్టుకున్నాడు. మణిశర్మ పాటలు కొత్తగా అనిపిస్తాయి. నేపథ్యం సంగీతం అందరినీ ఆకట్టుకుంది. సదాశివ సన్యాసి పాట ఇప్పటికీ ఎప్పటికీ అలా నిలిచిపోతుంది. ఈ చిత్రం 2010 అక్టోబర్ 7న విడుదలైంది. నేటికి పన్నెండేళ్లు అవుతోంది. ఇప్పుడు అంతా కూడా SSMB 28 కోసం ఎదురుచూస్తున్నారు. 

Also Read : మెగా ఫాన్స్ ఆగ్రహం.. చిరంజీవితో మాట్లాడతా, అందరికీ చెప్పండి..లైవ్లోనే గరికపాటి!

Also Read : Dhanush - Aishwarya : మళ్లీ ఒక్కటవ్వబోతోన్న ఐశ్వర్య - ధనుష్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News