Acton Movie - Madras High Court orders to Vishal: హీరో విశాల్‌కు మద్రాస్ హైకోర్టు నుంచి షాక్ తగిలింది. విశాల్ (Vishal), మిల్కీబ్యూటి తమన్నా హీరో హీరోయిన్లుగా నటించిన ‘యాక్షన్’ (Vishal Acton Movie) సినిమా వల్ల.. భారీగా నష్టపోయిన సినీ నిర్మాతకు.. హీరో విశాలే ఆ నష్టాన్ని భర్తీ చేయాలని మద్రాస్ హైకోర్టు (Madras High Court) శుక్రవారం తీర్పునిచ్చింది. వాస్తవానికి.. విశాల్ హీరోగా ప్రముఖ దర్శకుడు, నటి ఖుష్బు భర్త సుందర్. సి (Sundar C.) దర్శకత్వంలో.. రవీంద్రన్ నిర్మాతగా రూపొందించిన భారీ బడ్జెట్ సినిమా ‘యాక్షన్’ (Action) గతేడాది నవంబర్‌లో విడుదలైంది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా ఆడలేదు. వాస్తవానికి దర్శకనిర్మాతలు ఈ సినిమాను ముందుగా తక్కువ బడ్జెట్‌లో పూర్తి చేయాలనుకున్నారు. కానీ భారీగా ఖర్చు పెరిగింది. ఈ క్రమంలో ఈ సినిమా రూ.20 కోట్ల కలెక్షన్లు వసూలు చేయకపోతే.. ఆ నష్టాన్ని తానే భరిస్తానని హీరో విశాల్ నిర్మాత ఆర్ రవింద్రన్‌కు (R. Ravindran ) హామీ ఇచ్చాడు. ఆయన హామీతో సినీ నిర్మాత రవీంద్రన్ రూ.44 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను పూర్తి చేశారు. Also read: Prabhas: ప్రభాస్ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్
అయితే ఈ సినిమా విడుదలైన తరువాత హీరో విశాల్, నిర్మాత రవీంద్రన్‌కు ఊహించని విధంగా ఎదురుదెబ్బ తగిలింది. ఈ సినిమా తమిళనాడులో రూ.7.7 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ.4 కోట్ల వసూళ్లు మాత్రమే చేసింది. విశాల్ చెప్పినట్లు కలెక్షన్లు రాకపోవడంతో.. నిర్మాత విశాల్‌ను ఆశ్రయించారు. ఈ క్రమంలో తన తరువాతి సినిమాను అదే బ్యానర్లో చేస్తానని విశాల్ నిర్మాత రవీంద్రన్‌కు మాటిచ్చాడు. కానీ ఆ తర్వాతి సినిమాను తన సొంత బ్యానర్.. విశాల్ ఫిలిం ఫ్యాక్టరీలో చేస్తుండడంతో నిర్మాత రవీంద్రన్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. Also read: Nani: సినిమా సెట్‌లో ‘టక్ జగదీష్’
అయితే నిర్మాత రవీంద్రన్ వేసిన పిటిషన్‌పై శుక్రవారం మద్రాస్ న్యాయస్థానం విచారణ జరిపింది. వాదనలు విన్న తర్వాత.. ఈ ‘యాక్షన్’ సినిమా వల్ల నష్టపోయిన నిర్మాతకు విశాల్ పరిహారం చెల్లించాల్సిందేనని తీర్పునిచ్చింది. ఈ మేరకు రూ.8.29 కోట్ల నష్టాన్ని భర్తీ చేసే విధంగా విశాల్ నిర్మాతకు హామీ ఇవ్వాలని ఆదేశాలిచ్చింది. అయితే.. ధర్మాసనం తీర్పుపై ఇంతవరకు విశాల్ స్పందించలేదు. Also read: NTR: అలాంటివారితో ఆన్‌లైన్ పరిచయాలొద్దు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Vishal: ఆ నష్టాన్ని హీరో విశాల్ భరించాల్సిందే: మద్రాస్ హైకోర్టు