MAA elections 2021: పవన్‌ కల్యాణ్‌పై మంచు విష్ణు ప్యానెల్ కామెంట్స్‌పై Prakash Raj ఘాటు కౌంటర్

MAA elections 2021, Prakash Raj about Pawan Kalyan: పవన్ కల్యాణ్, పోసాని కృష్ణమురళి (Pawan Kalyan vs Posani Krishna Murali) మధ్య రాజుకున్న వివాదం కూడా తారాస్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ అంశంపై పవన్ కల్యాణ్ వీరాభిమాని అయిన నిర్మాత, నటుడు బండ్ల గణేష్ స్పందించాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 2, 2021, 07:48 AM IST
  • వేడెక్కిన మా ఎన్నికల రాజకీయం (MAA elections 2021 politics).
  • ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు ప్యానెల్స్ మధ్య మాటల యుద్ధం
  • మా ఎన్నికల రాజకీయాల్లోకి చిరంజీవి, కృష్ణ, పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పేర్లు తీసుకురావడంపై ప్రకాశ్ రాజ్ ఆగ్రహం
MAA elections 2021: పవన్‌ కల్యాణ్‌పై మంచు విష్ణు ప్యానెల్ కామెంట్స్‌పై Prakash Raj ఘాటు కౌంటర్

MAA elections 2021, Prakash Raj about Pawan Kalyan: మా ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ ప్యానెల్స్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంటోంది. తాజాగా మంచు విష్ణు ప్యానెల్ ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ.. మా ఎన్నికల రాజకీయాల్లోకి చిరంజీవి, కృష్ణ లాంటి పెద్ద వారిని ఎందుకు లాగుతున్నారని అసహనం వ్యక్తంచేశారు. అంతేకాకుండా పవన్ కల్యాణ్ పేరును కూడా మా ఎన్నికల్లోకి లాగడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసిన ప్రకాశ్ రాజ్ (Prakash Raj).. పవన్ కల్యాణ్ గురించి మాట్లాడేటప్పుడు కాస్త ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడటం మంచిదని హితవు పలికారు. 

పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ముందుగా ఓ నటుడు అని గుర్తుచేసిన ఆయన.. ఆ తర్వాతే రాజకీయ నాయకుడిగా చూడాల్సి ఉంటుందని అన్నారు. పవన్ కల్యాణ్ గురించి మంచు విష్ణు ప్యానెల్ (Manchu Vishnu pannel) ప్రస్తావించడాన్ని తీవ్రంగా తప్పుపడుతూ.. మీ సినిమాల మొత్తం బడ్జెట్ కలిపినా పవన్ కల్యాణ్ సినిమాల మార్నింగ్ షో కలెక్షన్స్ అంత ఉండదు. అలాంటిది మీరు ఆయన గురించి మాట్లాడటం ఏంటని ఎద్దేవా చేశారు.

Also read : Allu Arjun: రిపబ్లిక్ మూవీకి, సాయి ధరమ్ తేజ్‌కి అల్లు అర్జున్ సపోర్ట్

ఇదిలావుంటే, పవన్ కల్యాణ్, పోసాని కృష్ణమురళి (Pawan Kalyan vs Posani Krishna Murali) మధ్య రాజుకున్న వివాదం కూడా తారాస్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ అంశంపై పవన్ కల్యాణ్ వీరాభిమాని అయిన నిర్మాత, నటుడు బండ్ల గణేష్ స్పందించాడు. పోసాని కృష్ణమురళి ఓ ఎక్స్‌పైర్డ్ ట్యాబ్లెట్ అంటూ బండ్ల గణేష్ సెటైర్లు వేశారు.

మా ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకోవడంపై స్పందిస్తూ.. ''ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు.. ఇద్దరూ కూడా టాలీవుడ్ పరిశ్రమకు మంచి చేయడం కోసమే పోటీపడుతున్నారని.. అందుకే మా ఎన్నికల పోటీ నుంచి తాను తప్పుకున్నాను'' అని బండ్ల గణేష్ (Bandla Ganesh MAA elections politics) తెలిపారు.

Also read : Republic Movie Review: సాయి ధరమ్ తేజ్ నటించిన "రిపబ్లిక్" మూవీ రివ్యూ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News