MAA Elections 2021: ‘మా’ మాజీ అధ్యక్షుడు నరేశ్‌, నటి కరాటే కళ్యాణిలపై ఫిర్యాదు చేసిన నటి హేమ

Hema Files Complaint Against Naresh: సినీ నటి హేమ ‘మా’ మాజీ అధ్యక్షుడు నరేశ్‌, నటి కరాటే కళ్యాణిలపై ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు ఫిర్యాదు చేశారు. తనపై దుష్ప్రచారం చేస్తున్నారని హేమ ఫిర్యాదులో పేర్కొన్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 6, 2021, 06:40 PM IST
  • మా ఎన్నికల నేపథ్యంలో రోజుకో వివాదం
  • ‘మా’ మాజీ అధ్యక్షుడు నరేశ్‌, నటి కరాటే కళ్యాణిలపై హేమ ఫిర్యాదు
  • నరేశ్‌ వైఖరి తనను అగౌరవ పరిచేలా ఉందటూ ఫిర్యాదు
 MAA Elections 2021: ‘మా’ మాజీ అధ్యక్షుడు నరేశ్‌, నటి కరాటే కళ్యాణిలపై ఫిర్యాదు చేసిన నటి హేమ

MAA Elections 2021, Hema Files Complaint Against Naresh, Karate Kalyani For Obscene Comments: మా ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రోజుకో వివాదం తెరపైకి వస్తోంది. ఒకవైపు మంచు విష్ణు ప్యానెల్‌... మరోవైపు ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌ వారు ఒకరిపై ఒకరు మాటల యుద్ధానికి దిగుతూనే ఉన్నారు. ఈ క్రమంలో బుధవారం సినీ నటి హేమ ‘మా’ మాజీ అధ్యక్షుడు నరేశ్‌(Naresh) , నటి కరాటే కళ్యాణిలపై (Karate Kalyani) ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు (Krishna Mohan) ఫిర్యాదు చేశారు. తన ఫొటోలు మార్ఫింగ్‌ చేసి, తనపై దుష్ప్రచారం చేస్తున్నారని హేమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నెల 10న జరుగుతున్న ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే అని పేర్కొన్నారు హేమ. నిన్న తనపై కుమారి కళ్యాణి అలియాస్‌ కరాటే కళ్యాణి, వి.నరేశ్‌లు కొన్ని అవాంఛితమైన, పరువుకు భంగం కలిగించే వ్యాఖ్యలతో ఒక వీడియోను విడుదల చేశారని ఫిర్యాదు లేఖలో తెలిపారు హేమ. సినీ రంగానికి చెందిన నటీమణుల ఫొటోలను మార్ఫింగ్‌ చేసి కొన్ని యూట్యూబ్‌ ఛానళ్లలో పోస్ట్ చేస్తున్నారని హేమ ఆరోపించారు. ఇక గతంలోనూ ఈ విషయంపై తాను సైబర్‌సెల్‌ పోలీసులకు (cyber cell police) ఫిర్యాదు చేశా అని పేర్కొంది హేమ. ఇక తర్వాత ఇలాంటి ఘటనలు కాస్త తగ్గాయని చెప్పుకొచ్చింది హేమ.

Also Read : RTC Fares Increased: దసరా బాదుడు షురూ.. 50 శాతం చార్జీలు పెంచనున్న APS RTC

ఇక తాజా ఘటన గురించి హేమ ఈ విధంగా పేర్కొన్నారు... తాను అమర్యాదకరమైన ఫొటోలను గ్రూపుల్లో పెట్టి, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నట్లు కూడా వీడియోలో పేర్కొన్నారని హేమ తెలిపారు. అంతేకాకుండా అందుకు ఆధారాలున్నాయని, వాటిని బయటపెడతామని బెదిరించారని, నరేశ్‌ వైఖరి తనను అగౌరవ పరిచేలా,తన వ్యక్తిత్వాన్ని కించరిచేలా ఉందని హేమ పేర్కొన్నారు. తనపై అసభ్యకరమైన ప్రచారాలు చేయకుండా కట్టడి చేయాలని కోరుతున్నా అంటూ ఆమె అన్నారు. మా ఎన్నికల (MAA Elections)  ప్రచార సమయంలో సంస్థ ప్రతిష్ఠ దిగజారకుండా చూడాల్సిన బాధ్యత సభ్యులందరిపైనా ఉందని.. వీరి వల్ల సంస్థకు చెడ్డ పేరు రావటమే కాకుండా, కొందరు సభ్యులు కూడా వీరి ధోరణిని అనుసరించే ప్రమాదం ఉందని హేమ ఫిర్యాదు చేశారు. అలాగే ఈ సారి మా ఎన్నికల్లో వారికి ఓటు హక్కు లేకుండా క్రమశిక్షణ చర్యలు తీసుకొమ్మని కోరుతున్నా అంటూ హేమ (Hema) తన ఫిర్యాదు లేఖలో పేర్కొన్నారు.

Also Read : Kondapolam making video: అంచనాలు పెంచిన కొండపొలం మేకింగ్ వీడియో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News