Manchu Vishnu, MAA association: మా అసోసియేషన్ ఎన్నికలు సమరంలో మంచు విష్ణు

Manchu Vishnu into MAA association politics: మా అసోసియేషన్ ఎన్నికలు సమీపించడంతో తెలుగు సినీ పరిశ్రమలో మళ్లీ పాలిటిక్స్ మొదలయ్యాయి. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో (Movie Artist Association - MAA elections) ప్రకాశ్ రాజ్ మా అధ్యక్ష పదవికి పోటీపడనున్నట్టు వార్తలు రాగా తాజాగా వినిపిస్తున్న ఫిలింనగర్ టాక్ ప్రకారం అదే పదవికి మంచు ఫ్యామిలీ నుంచి మంచు విష్ణు కూడా బరిలోకి దిగుతున్నట్టు తెలుస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 22, 2021, 07:46 AM IST
Manchu Vishnu, MAA association: మా అసోసియేషన్ ఎన్నికలు సమరంలో మంచు విష్ణు

Manchu Vishnu into MAA association politics: మా అసోసియేషన్ ఎన్నికలు సమీపించడంతో తెలుగు సినీ పరిశ్రమలో మళ్లీ పాలిటిక్స్ మొదలయ్యాయి. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో (Movie Artist Association - MAA elections) ప్రకాశ్ రాజ్ మా అధ్యక్ష పదవికి పోటీపడనున్నట్టు వార్తలు రాగా తాజాగా వినిపిస్తున్న ఫిలింనగర్ టాక్ ప్రకారం అదే పదవికి మంచు ఫ్యామిలీ నుంచి మంచు విష్ణు కూడా బరిలోకి దిగుతున్నట్టు తెలుస్తోంది. 

నటుడిగా, నిర్మాతగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న మంచు విష్ణు గతంలో ఎప్పుడూ మా ఎన్నికల రాజకీయంలో అంత చురుకుగా వ్యవహరించలేదు. కానీ ఈసారి ఏకంగా మా అసోసియేషన్ ప్రెసిడెంట్ పోస్టుకే పోటీ చేయాలని ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. తమిళనాట విశాల్ (Vishal) తరహాలో యువతరం పాత్ర పెరిగితేనే మా అసోసియేషన్‌లో అభివృద్ధి, అందరికీ సంక్షేమం అనే ఆలోచనతో ఉన్న మంచు విష్ణు (Manchu Vishnu) ఇప్పటికే ఆనాటి సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం, కృష్ణం రాజుతో పాటు ఇతర సినీ పెద్దలను కలిసి వారి ఆశీర్వాదం తీసుకున్నట్టు ఫిలినగర్ వర్గాలు చెబుతున్నాయి. 

Also read: Fathers Day 2021 Wishes: తమ హీరోలకు ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలిపిన టాలీవుడ్ సెలబ్రిటీలు

మా అసిసోయేషన్‌లో ఎన్నికలు జరిగే ప్రతీసారి అంతకంటే ముందుగా పెద్ద రచ్చే జరుగుతోంది. పాత కార్యవర్గం, కొత్తగా పోటీ చేయబోయే వర్గాల మధ్య తీవ్రస్థాయిలో ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడం సర్వసాధా'రణం' అయింది. మరి ఈసారి మా అసోసియేషన్ ఎన్నికలు (MAA Association elections 2021) ఎలాంటి వాతావరణంలో జరగనున్నాయో, ఎవరెవరో ఏయే పదవులకు పోటీపడనున్నారో, ఎవరు పోటీలోంచి తప్పుకోనున్నారో వేచిచూడాల్సిందే.

Also read : Sonu Sood Fathers Day Gift: సోనూసూద్ కుమారుడికి రూ.3 కోట్ల లగ్జరీ కారు కొనిచ్చాడా.. క్లారిటీ ఇచ్చిన నటుడు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News