Anantha Sriram Controversy : చిక్కుల్లో అనంత శ్రీరామ్.. ఆ వర్గం వారిని కించపరిచేలా పదప్రయోగం

Bhatraju caste issue భట్రాజుల మీద అనంత శ్రీరామ్ వాడిన పద ప్రయోగంతో ఒక్కసారిగా కాంట్రవర్సీ తెర మీదకు వచ్చింది. అయితే అనంత శ్రీరామ్ మాత్రం ఆ వర్గానికి క్షమాపణలు చెప్పేసి వివాదానికి పుల్ స్టాప్ పెట్టేశాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 21, 2023, 03:43 PM IST
  • మరోసారి అనంత శ్రీరామ్‌కు చిక్కులు
  • భట్రారాజులపై పదప్రయోగంతో కాంట్రవర్సీ
  • క్షమాపణలు చెప్పిన టాలీవుడ్ లిరిసిస్ట్
Anantha Sriram Controversy : చిక్కుల్లో అనంత శ్రీరామ్.. ఆ వర్గం వారిని కించపరిచేలా పదప్రయోగం

Anantha Sriram Bhatraju caste issue సమాజంలో మనోభావాలు దెబ్బ తినడం అనే పదం కామన్‌గా వింటూనే ఉంటున్నాం. సినిమాలోని మాటలో, పాటలో ఓ వర్గాన్ని టార్గెట్ చేసినట్టుగా ఉన్నాయంటూ సదరు వర్గానికి చెందిన వారంతా కూడా రోడ్డెక్కుతున్నారు. వెంటనే వాటిని సినిమాలోంచి తీసేయాలని, క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తుంటారు. ఇప్పుడు ఇలాంటి ఓ చిక్కులే అనంత శ్రీరామ్‌కు మెడకు చుట్టుకున్నాయి.

సంక్రాంతి సంబరాల్లో భాగంగా పాలకొల్లులో శ్రీరామ్ వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి. భట్రాజులును కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారంటూ భట్రాజు సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. భట్రాజు పొగడ్తలు అనే పదం రాష్ట్రం ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే. నిషేధిత పదాన్ని ఉపయోగించిన అనంతశ్రీరామ్ ప్తె చర్యలు తీసుకోవాలంటూ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల ఫిర్యాదులు చేసిన నానా రచ్చ చేస్తున్నారు. 

అయితే అనంత శ్రీరామ్ మాత్రం సదరు వర్గానికి క్షమాపణలు చెప్పినట్టు తెలుస్తోంది. ఇలాంటి వివాదాలు తరుచుగా వస్తూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న బాలయ్యకు కూడా ఇలాంటి ఘటనే ఎదురైంది. దేవబ్రహ్మణ కులం, రావణ బ్రహ్మ దేవుడు అంటూ చేసిన వ్యాఖ్యల మీద కూడా సదరు వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎవరి మనోభావాలను కించపరిచాలనో, తక్కువ చేసి మాట్లాడాలనో తన ఉద్దేశం కాదని బాలయ్య వివరణ ఇచ్చుకున్నాడు.

Also Read:  Pathaan Advance Booking : పఠాన్ మేనియా.. ఫస్ట్ డే ఎన్ని కోట్లంటే.. కింగ్ ఖాన్ కమ్ బ్యాక్ ఇచ్చినట్టేనా?

Also Read: Mahesh Babu Son : గౌతమ్ మొదటి సారి ఆ పని చేయబోతోన్నాడు.. నమ్రత పోస్ట్ వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 

Trending News