Love story: ‘లవ్‌స్టోరి’ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది..ఎప్పుడంటే?

Love story:  నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం 'లవ్‌స్టోరి'. ఈ చిత్రం నుంచి కొత్త అప్ డేట్ వచ్చేసింది.  వినాయక చవితి కానుకగా సెప్టెంబరు 10న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 18, 2021, 03:51 PM IST
  • 'లవ్‌స్టోరి’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌
  • సెప్టెంబరు 10న చిత్రం విడుదల
  • హీరో హీరోయిన్లుగా నాగచైతన్య, సాయిపల్లవి
Love story: ‘లవ్‌స్టోరి’ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది..ఎప్పుడంటే?

Love story: తెలుగు ప్రేక్షకులు ఎప్పడెప్పుడాఅని ఎదురుచూస్తున్న 'లవ్‌స్టోరి' సినిమా నుంచి కొత్త అప్ డేట్ వచ్చేసింది. ఈ చిత్రాన్ని థియేటర్లలోనే విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.  వినాయక చవితి కానుకగా సెప్టెంబరు 10న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 

ఫిదా(Fida) తర్వాత క్లాస్ డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల(Shekhar Kammula) నుంచి వస్తున్న ఈ మూవీపై అభిమానుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి. ఇటీవల విడుదలైన పాటలు, టీజర్ సినిమాపై  అంచనాలను అమాంతం పెంచేశాయి. ఈ సినిమా విడుదల కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఉత్కంఠ‌తో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా...కరోనా(Covid) కారణంగా వాయిదా పడుతూ వచ్చింది.  

Also Read: Bigg Boss: బిగ్‌బాస్‌ లోకి తీసుకోలేదని రోడ్లపై ప్రముఖ నటి హల్‌చల్‌..వీడియో వైరల్!

'లవ్‌స్టోరి’(Love story) చిత్రం ఓటీటీ(OTT)లో రిలీజ్ అవుతుందా? థియేటర్లలో విడుదలవుతుందా? ఇంతకీ ఎప్పుడొస్తుంది? అనే ప్రశ్నలన్నింటికీ  సమాధానం దొరికేసింది.  ఈ చిత్రాన్ని థియేటర్ల(Theaters)లోనే విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం సామాజిక మాధ్యమాల(Soical Media) వేదికగా ప్రకటించింది. వినాయక చవితి(Vinayaka Festival) కానుకగా సెప్టెంబరు 10న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు వెల్లడించింది. నాగ చైతన్య(Naga Chaitanya), సాయి పల్లవి(Sai Pallavi) జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల(Director Shekhar Kammula) దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌.ఎల్‌.పి.సంస్థ నిర్మించింది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter Facebook

Trending News