Vijayakanth Death News Live Updates: సినీ నటుడు, డీఎండీకే అధినేత విజయ్ కాంత్ అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మరణవార్తను తమిళనాడు ఆరోగ్య శాఖ సెక్రటరీ వెల్లడించారు. చెన్నైలోని మియోట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విజయ్ కాంత్ మరణించారని తెలిపారు. ఇటీవల అనారోగ్యంతో కోలుకున్న ఆయన.. కరోనా బారిన పడడంతో మళ్లీ ఆసుపత్రిలో చేరారు. బుధవారం రాత్రి నుంచి ఆయనకు వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నారు. విజయ్ కాంత్ మరణవార్తను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. పెద్ద ఎత్తున ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు. 1952 ఆగస్టు 25న జన్మించిన విజయ్ కాంత్.. సినీ, రాజకీయ రంగంలో తనదైన ముద్ర వేశారు.