Taraka Ratna Death Live Updates: ముగిసిన తారకరత్న అంత్యక్రియలు.. నుదుటిపై ముద్దు పెట్టి ఏడ్చిన తండ్రి మోహన కృష్ణ!

Taraka Ratna Death Live Updates: గత ఇరవై రోజులకు పైగా తారకరత్న హాస్పిటల్‌లోనే ఉన్న సంగతి తెలిసిందే. విదేశీ వైద్యుల పర్యవేక్షణలో తారకరత్నకు చికిత్స అందించారు. అయితే తారకరత్న నాడీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడంతో చికిత్సకు స్పందించలేదు. శనివారం ఆయన తుదిశ్వాస విడిచారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 20, 2023, 05:04 PM IST
Taraka Ratna Death Live Updates:  ముగిసిన తారకరత్న అంత్యక్రియలు.. నుదుటిపై ముద్దు పెట్టి ఏడ్చిన తండ్రి మోహన కృష్ణ!
Live Blog

Taraka Ratna Health Live updates నందమూరి తారకరత్న కన్నుమూశారు. ఆయన మరణవార్తను అధికారికంగా కుటుంబ సభ్యులు ధృవీకరించారు. గత 23 రోజులుగా  బెంగుళూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడించారు. తారకరత్న మృతితో సినీ లోకం విషాదంలో మునిగిపోయింది. అయన కుటుంబాన్ని పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సందర్శించి తమ సంతాపాన్ని తెలుపుతున్నారు. 

20 February, 2023

  • 16:57 PM

     ముగిసిన తారకరత్న అంత్యక్రియలు

  • 16:56 PM

     చితికి నిప్పు పెట్టిన తారకరత్న తండ్రి మోహన్ కృష్ణ
     

  • 16:55 PM

    చివరిసారి తారకరత్న నుదుటిపై ముద్దు పెట్టి ఏడ్చిన తండ్రి మోహన కృష్ణ

  • 16:22 PM

    మహప్రస్థానంలో మొదలైన తారకరత్న అంత్యక్రియలు

     
  • 16:21 PM

     తారక రత్న కు అంతిమ సంస్కారాలు నిర్వహించనున్న తనయుడు తనయ్ రామ్

     
  • 16:21 PM

    తారకరత్న పాడే మోసిన బాలకృష్ణ.
     

     
  • 16:20 PM

    మహా ప్రస్థానంకు చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్
     

  • 16:20 PM

     మహా ప్రస్థానంకు చేరుకున్న తారకరత్న భౌతికకాయం
     

     
  • 14:03 PM

    తారకరత్న కోసం వచ్చిన మతిస్థిమితం లేని వ్యక్తి..

    తారకరత్న పార్థివదేహాన్ని సందర్శించేందుకు మతిస్థిమితం లేని వ్యక్తి వచ్చాడు. తారకరత్నను చూసిన తరువాత బాలయ్యతో ముచ్చట్లు పెట్టాడు. కానీ పోలీసులు వెంటనే అతడ్ని పక్కకి తీసుకెళ్లారు.

  • 13:03 PM

    నివాళి అర్పించిన వెంకీమామ..

    తారకరత్న భౌతిక కాయానికి టాలీవుడ్ ప్రముఖులంతా నివాళి అర్పిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్, నటుడు శివాజీ, దర్శకుడు అనిల్ రావిపూడి వంటి వారు నివాళి అర్పించారు. హీరో తరుణ్ కూడా సందర్శించుకున్నాడు. ఇక వెంకటేష్ అయితే తారకరత్న భౌతిక కాయాన్ని చూసి అలా నిల్చుండిపోయాడు. ఏమీ మాట్లాడకుండా మౌనం పాటించాడు.

  • 08:52 AM

    ఉదయం 9.03 గంటలకు శంకర్ పల్లిలోని నివాసం నుంచి ఫిలిం ఛాంబర్ కు పార్ధివ దేహం తరలింపు
    10 గంటల నుంచి అభిమానుల సందర్శనకు అవకాశం
    3 గంటల తరువాత మహాప్రస్థానంలో అంత్యక్రియలు
    ఈ మేరకి ముహూర్తం పెట్టిన బాలకృష్ణ

  • 20:33 PM

    బాలయ్యను చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్లి కౌగలించుకొని ఏడ్చిన తారక రత్న కుమార్తె

     
     
  • 20:25 PM

    సీసీఎల్ లో అఖిల్ టీం విక్టరీ.. తారకరత్నకు అంకితం అంటూ పోస్ట్

     

     
  • 20:23 PM

    'బ్రతుకుతో పోరాడావ్.. చావుతో పోరాడావ్.. నీ అలైఖ్యలో ఎప్పటికీ జీవించే ఉంటావ్' అంటూ షర్మిల ట్వీట్ చేశారు

     
     
  • 20:18 PM

     తారకరత్న మరణం పై దగ్గుబాటి పురందేశ్వరి స్పందన 
    తారకరత్న ఎప్పుడూ చక్కటి చిరునవ్వుతో కనిపించేవాడు
    అత్తా అనే పిలుపు నీ నుంచి ఇక వినకపోవచ్చు
    నువ్వెప్పుడూ మా హృదయంలో, మదిలో, స్మృతిలో చిరంజీవిగా ఉంటావు 
    లవ్ యూ తారకరత్న అంటూ పురందేశ్వరి ట్వీట్

     

  • 19:42 PM

    అలేఖ్యా రెడ్డి అస్వస్థతపై ఎంపీ విజయ సాయి రెడ్డి స్పందన 
    తారక రత్న మరణం ఎంతో బాధించింది 
    39 ఏళ్లలోనే అకాల మరణం బాధాకరం 
    రాజకీయ రంగంలోకి ప్రవేశించే సందర్భంలో ఇలాంటి ఘటన బాధకరం 
    అందరిని అన్న, చెల్లి అని ఆప్యాయంగా పలకరించేవాడు 
    తారక్ కి ముగ్గురు పిల్లలు, మొదట పెద్దమ్మాయి, తర్వాత ట్విన్స్
    ఇందులో ఒకరు బాబు..ఇంకొకరు పాప
    తారక్ విషయంలో బాలకృష్ణ చాలా శ్రద్ధ చూపారు 
    అత్యంత మంచి చికిత్స అందించాడానకి  కృషి చేశారు
    అలేఖ్య మానసిక ఒత్తిడికి గురైంది 
    కాళ్లు చేతులు వణుకుతున్నాయి, ఆందోళన లేదు 
    ప్రేమించిన వ్యక్తి కోల్పోవడంతో అలా అయ్యింది
    అలేఖ్యకి బాలకృష్ణ మాట ఇచ్చారు 
    మా కుటుంబ సభ్యుల మాదిరిగా చూసుకుంటాం 
    ఆందోళన వద్దని మాట ఇచ్చారు

     

  • 18:25 PM

    తారకరత్న భార్యా అలేఖ్య రెడ్డిని పరామర్శించిన వైఎస్ షర్మిల

  • 18:23 PM

    రేపు మధ్యాహ్నం వరకు అమావాస్య 
    ఉదయం 7 గంటల కల్లా తారక రత్న ఇంటికి బాలకృష్ణ
    ఉదయం 9.03 నిమిషాలకు ఇంటి నుండి తారక రత్న భౌతిక కాయం ఫిల్మ్ ఛాంబర్ కి 
    అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శనార్థం 
    మూడు గంటల వరకు ఫిల్మ్ ఛాంబర్ లో భౌతిక కాయం 
    మూడున్నర తర్వాత అంతిమ యాత్ర ప్రారంభం 
    4 నుంచి 5 గంటల మధ్య అంతిమ సంస్కారాలు

     

  • 18:10 PM

    తారకరత్న భార్య అలేఖ్యకు అస్వస్థత.. 

    రెండు రోజులుగా ఏమి తినకపోవడంతో నీరసించిన అలేఖ్య

    అలేఖ్యను ఆసుపత్రికి తరలించే యోచన కుటుంబ సభ్యులు..

  • 16:49 PM

    తారకరత్న కుటుంబానికి మోహన్ బాబు పరామర్శ 
    తారకరత్న ఎంత మంచివాడో, ఎంత సౌమ్యుడో, స్నేహ శీలో చెప్పడానికి మాటలు  రావడం లేదు
    టీవీల్లో అతని మరణ వార్తకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు చూస్తుంటే బాధతో గుండె తరుక్కుపోతుంది
    తారకరత్న మరణం ఒక్క నందమూరి కుటుంబానికే  కాదు 
    యావత్ తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు
    ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా: మోహన్ బాబు
     

  • 16:34 PM

    నందమూరి తారకరత్న భౌతికకాయానికి సినీ ప్రముఖుల నివాళులు 
    తారకరత్న నివాసానికి చేరుకుని తారకరత్న కుటుంబాన్ని పరామర్శించిన చిరంజీవి 
    తారకరత్న భార్యను ఓదార్చిన మెగాస్టార్ చిరంజీవి 
    తారకరత్న కుటుంబానికి ప్రగాఢ సానుభూతి 

     

  • 16:03 PM

    తారకరత్న మృతిపై కొడాలి నాని సంతాపం

    తెలుగు ఇండస్ట్రీకి తీరని లోటు, కలిసి మెలిసి ఉండే వ్యక్తి

    టీడీపీలో కొనసాగాలని, ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నారు

    నేను తారక్ అని పిలిచే వాడిని

    నాతో ఎంతో మంచి ఫ్రెండ్ గా మెదిలేవాడు

    తారకరత్న దేనికి ఆశ పడలేదు

    ఎన్టీఆర్ బాటలో నడవాలని అనుకున్నారు

    ఆయనకు తండ్రి వైపు టీడీపీ

    అత్తగారి ఇంటి వైపు వైసీపీ ఉంది

    రాజకీయాల్లోకి వస్తానని నాతో ఫోన్ లో చెప్పాడు

  • 15:13 PM

    రేపు ఉదయం 8.45కి ఫిల్మ్ ఛాంబర్ కి తారక రత్న భౌతిక కాయం : మాదాల రవి 
    3 గంటల వరకు అక్కడే, ఆ తర్వాత అంతిమ యాత్ర : మాదాల రవి 
    తారక రత్న అసలు పేరు ఓబు, మేమంతా  ఓబులేష్ అని పిలిచే వాళ్ళము : మాదాల రవి 
    బాలకృష్ణ నిర్ణయించిన ముహూర్తం మేరకు అంత్యక్రియలు : మాదాల రవి 
    బాలకృష్ణ. తారక రత్నను బాగా చూసుకునే వారు, ఇంటి పెద్ద కదా : మాదాల రవి 
    బాలకృష్ణ, విజయ సాయి రెడ్డిలు ఇది నిర్ణయించారు  : మాదాల రవి 

  • 14:03 PM

    మహమ్మద్ అలీ నివాళులు..

    తారకరత్న భౌతిక కాయాన్ని తెలంగాణ హోం మంత్రి మహమ్మద్ అలీ దంపతులు సందర్శించారు. అనంతరం నివాళులు అర్పిస్తూ సంతాపాన్ని ప్రకటించారు.

  • 12:50 PM

    తారకరత్న భౌతిక కాయానికి నారా లోకేష్, బ్రాహ్మణి నివాళులు

     
     
  • 12:39 PM

    నివాళులు అర్పించిన నారా లోకేష్‌..

    నివాళులు అర్పించిన నారా లోకేష్‌..
    నారా లోకేష్‌ కాసేపటి క్రితమే తారకరత్న భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. పార్థివదేహాన్ని సందర్శించిన అనంతరం నారా లోకేష్ ఇలా తారకరత్న చిత్రపటానికి నమస్కరిస్తూ సంతాపాన్ని ప్రకటించాడు.

  • 12:07 PM

    విజయ్ సాయి రెడ్డితో ఎన్టీఆర్ ముచ్చట్లు..

    తారకరత్న పార్థివదేహాన్ని సినీ, రాజకీయ ప్రముఖులు సందర్శిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్, కళ్యాణ్‌ రామ్‌లు ఇప్పుడే తారకరత్న భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. ఇక అక్కడే ఉన్న విజయ్ సాయి రెడ్డితో ఎన్టీఆర్ ముచ్చటించారు.

  • 11:59 AM

    తారకరత్నకు నివాళులర్పించిన కమెడియన్ ఆలీ దంపతులు

  • 11:58 AM

    తారకరత్నకు నివాళులర్పించిన దేవినేని ఉమామహేశ్వరరావు

     
  • 11:58 AM

    తారకరత్నకు నివాళులర్పించిన నారా లోకేష్

     
  • 11:56 AM

    చంద్రబాబుతో మాట్లాడిన విజయసాయి రెడ్డి

    నందమూరి తారకరత్నకు నివాళులు అర్పించేందుకు వచ్చిన చంద్రబాబు

    పక్కనే ఉన్న విజయసాయిరెడ్డితో మాటామంతీ

    తారకరత్న చికిత్స తీరు గురించి చంద్రబాబుకు వివరించిన విజయసాయి

    ఇద్దరూ పక్కపక్కనే కూర్చుని కాసేపు మాటలు

    అంతకుముందు ఎన్టీఆర్తోనూ విజయసాయి మాటలు

    గతంలో తారకరత్నను ఆస్పత్రిలో పరామర్శించిన విజయసాయి

    తారకరత్నను దగ్గరుండి చూసుకున్న బాలకృష్ణకు థ్యాంక్స్ చెప్పిన విజయసాయి

  • 11:49 AM

    తారకరత్న మృతికి నరేష్ ఎమోషనల్ వీడియో

     
  • 11:47 AM

     

    తారకరత్న నివాసంలో టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాటామంతీ

    తారకరత్న పార్థివ దేహానికి నివాళులు అర్పించిన ఇరువురు నేతలు

  • 11:00 AM

    ఉదయం నుంచి తారకరత్న నివాసంలోనే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి

    విజయసాయితో మాట్లాడుతూ కనిపించిన ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ 

  • 10:30 AM

    తారకరత్న కోసం ప్రభలు ఊరేగింపు, కానీ ఇంతలోనే

    తారకరత్న కోలుకోవాలని నందమూరి అభిమానులు ప్రార్థనలు

    ఎన్ని ప్రార్ధనలు చేసినా కనికరించని దేవుడు

    మహాశివరాత్రి సందర్భంగా నిన్న పల్నాడు జిల్లా కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వరస్వామి తిరునాళ్లలో భారీ ప్రభ ఏర్పాటు

    తారకరత్న ఆరోగ్యంతో తిరిగి రావాలని ప్రభ ఊరేగింపు 

    సాయంత్రం తారకరత్న మరణించారని వార్త రావడంతో విషాదంలో మునిగిపోయారు

  • 10:10 AM

    తారకరత్న భౌతికకాయాన్ని సందర్శించిన జూ.ఎన్టీఆర్ 
    హైదరాబాద్ శివారులోని మోకిల నివాసంలో నందమూరి తారకరత్న పార్థివ దేహం 
    తారకరత్న  పార్థీవదేహాన్ని సందర్శించిన ఆయన సోదరులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ 
    తారకరత్న భౌతికకాయానికి  ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ నివాళి 
    తారకరత్న సతీమణి, కుటుంబ సభ్యులను ఓదార్చి, చెప్పిన బ్రదర్స్ 

     

  • 10:01 AM

    తారకరత్న మృతికి ప్రధాని మోడీ సంతాపం

     తారకరత్న అకాల మరణం బాధాకరం, తారకరత్న కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి: ప్రధాని మోడీ

     
  • 09:51 AM

    తారకరత్న మరణానికి కారణం ఇదే

    తారకరత్న గుండెపోటుకు గురైన సమయంలో దాదాపు 45 నిమిషాలు నిలిచిన రక్తప్రసరణ

    ఆ సమయంలో మెదడులో  కొంతభాగం దెబ్బతిందని గుర్తించిన వైద్యులు

    అందుకే మెదడులో నీరు చేరినట్లు చెబుతున్న వైద్యులు

     గుండె, కాలేయం పనితీరు మెరుగుపడినప్పటికీ మెదడు దెబ్బతినడంతో కోలుకోలేకపోయిన తారకరత్న

    చాలా రోజులు వెంటిలేటర్ మీద చికిత్స అందించినా దక్కని ఫలితం

    విదేశాల నుంచి నిపుణులైన డాక్టర్లను రప్పించినా దక్కని ఫలితం

  • 09:44 AM

    తారకరత్న భార్యకు రెండో పెళ్లి
    ఆమెను పెళ్లి చేసుకుని కుటుంబానికి దూరం
    తారకరత్నకు తొలి వివాహమే 
    కానీ అలేఖ్యకు ఈ వివాహం రెండోది
    మాజీ హోంమంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి కుమారుడు సందీప్ తో ఆమెకు మొదటి పెళ్లి 
    కలిసి ఉండలేక విడాకులు
    ఆ తర్వాత ప్రేమలో పడి వివాహం చేసుకున్న తారకరత్న, అలేఖ్య
    ఇద్దరినీ దూరంగా పెట్టిన కుటుంబాలు
    సొంత చెల్లెలు రూప పెళ్లికి కూడా తారకరత్నకు అందని ఆహ్వానం 
    ఈమధ్యనే ఒకటైన కుటుంబాలు

Trending News