Chakravyuham: అజయ్‌ 'చక్రవ్యూహం' ఓటీటీలోకి వచ్చేసింది.. ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌ను ఎక్కడ చూడొచ్చంటే?

Chakravyuham: అజయ్ కీ రోల్ పోషించిన లేటెస్ట్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌  'చక్ర వ్యూహం.. ద ట్రాప్‌'. థియేటర్లలో రిలీజై మంచి టాక్ తెచ్చుకున్న ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తుంది. ఇది ఏ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో అందుబాటులోకి వచ్చిందంటే..   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 6, 2023, 05:42 PM IST
Chakravyuham: అజయ్‌ 'చక్రవ్యూహం' ఓటీటీలోకి వచ్చేసింది.. ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌ను ఎక్కడ చూడొచ్చంటే?

Chakravyuham OTT: టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుల్లో అజయ్ ఒకరు. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు. అయితే గత కొంతకాలంగా ఆయన తెలుగు అడియన్స్ కు పెద్దగా కనిపించడం లేదు. ఆయన చేసిన సినిమాలేవి రిలీజ్ కాలేదు. అయితే చాలా రోజుల తర్వాత అజయ్ మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌తో ప్రేక్షకుల మందుకు వచ్చాడు. ‘'చక్ర వ్యూహం.. ద ట్రాప్‌'’ అనే సినిమాలో పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించాడు. మ‌ధుసూద‌న్ ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ సినిమాలో జ్ఞానేశ్వ‌రి కాండ్రేంగుల‌, వివేక్ త్రివేది, ఊర్వ‌శి ప‌ర‌దేశి, ప్రగ్యా నయన్, శుభలేఖ సుధాకర్, రాజీవ్ కనకాల, ప్రియ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. 

జూన్ 02న రిలీజ్ అయినా ఈ సినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది. చిన్న సినిమా అయినా థ్రిల్లంగ్‌ ఎలిమెంట్స్ ఆకట్టుకునే విధంగా ఉండటంతో కలెక్షన్లు బాగానే వచ్చాయి. ఇలా థియేటర్లలో ప్రేక్షకుల మన్ననలు పొందిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ఈ మూవీ ఓటీటీ రైట్స్ ను కొనుగోలు చేసింది. ఇవాల్టి (జూలై 06) నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చక్రవ్యూహం సినిమాను సావిత్రి నిర్మించగా.. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ థియేటర్లలో రిలీజ్‌ చేసింది. అజయ్‌ నటనకు మంచి ప్రశంసలు లభించాయి.  ఈ మూవీ రన్‌టైమ్‌ కేవలం 1 గంట 47 నిమిషాల నిడివి మాత్రమే ఉండటంతోపాటు ఆద్యం

తం ఉత్కంఠను రేకెత్తిస్తుంది. క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీస్ చూడాలనుకునేవారికి ఇది మంచి ఆప్షన్ అనే చెప్పాలి. 

Also read: Takkar OTT: ఓటీటీలో రానున్న సిద్ధార్థ్‌ ‘'టక్కర్‌'’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?

Also Read: Rana Daggubati-Teja Movie: రెండు పార్టులుగా రానా-తేజ మూవీ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News