Lal Salaam movie review: రజినీకాంత్ 'లాల్ సలాం' మూవీ రివ్యూ.. రొటిన్ విలేజ్ డ్రామా..

Rajinikanth - Lal Salaam movie review: సూపర్ స్టార్ రజినీకాంత్ కీలక పాత్రలో నటించిన మూవీ 'లాల్ సలాం'. తలైవా కూతురు ఐశ్వర్య రజినీకాంత్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ నేడు విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా ? లేదా అనేది చూద్దాం..

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 9, 2024, 08:46 PM IST
Lal Salaam movie review: రజినీకాంత్ 'లాల్ సలాం' మూవీ రివ్యూ.. రొటిన్ విలేజ్ డ్రామా..

రివ్యూ: లాల్ సలాం
నటీనటులు: రజినీకాంత్, విష్ణు విశాల్, విక్రాంత్, నిరోషా, జీవిత రాజశేఖర్, సెంథిల్, తంబి రామయ్య, అనంతిక సునీల్ తదితరులు..
సినిమాటోగ్రఫీ: విష్ణు రంగస్వామి
సంగీతం: AR రెహమాన్
ఎడిటింగ్: బి. ప్రవీణ్ భాస్కర్
నిర్మాత: సుభాస్కరన్
కథ, దర్శకత్వం: ఐశ్వర్య రజినీకాంత్

Rajinikanth - Lal Salaam movie review: సూపర్ స్టార్ రజినీకాంత్ కీలక పాత్రలో నటించిన మూవీ 'లాల్ సలాం'. తలైవా కూతురు ఐశ్వర్య రజినీకాంత్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ నేడు విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా ? లేదా అనేది చూద్దాం..

Rajinikanth - Lal Salaam movie review: 'జైలర్'సినిమాతో పవర్ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చిన సూపర్ స్టార్ రజినీకాంత్.. తాజాగా తన కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో 'లాల్ సలాం' మూవీ చేసారు. మరి ఈ మూవీతో రజినీకాంత్ మాయ చేసారా.. ?

కథ విషయానికొస్తే..

'లాల్ సలాం' కథ విషయానికొస్తే.. 1993 కసూనురు అనే గ్రామం బ్యాక్ డ్రాప్‌లో మొదలవుతుంది. ఈ గ్రామంలో ఉండే హిందూ, ముస్లిమ్స్ ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఉంటారు. ఒక తరం తర్వాత అక్కడ వారసుల్లో హిందూ, ముస్లిమ్ అనే బేధ భావాలు వస్తాయి. ఈ క్రమంలో ఆ గ్రామంలో గురు (విష్ణు విశాల్), షంషుద్దీన్ (విక్రాంత్)  ఆ గ్రామంలో రెండు వేరు వేరు జట్లకు కెప్టెన్‌గా వ్యవహరిస్తూ ఉంటారు. ఒకపుడు మిత్రలుగా ఉన్న వీళ్లిద్దరు ఆ తర్వాత క్రమంలో బద్ధ శత్రువులుగా మారుతారు. ఈ సందర్భంగా ఆ ఊరిలో జరిగిన ఓ మ్యాచ్ సందర్భంగా జరిగిన ఓ ఘటనలో షంషుద్దీన్‌, గురు మధ్య తీవ్ర విభేదాలు వస్తాయి. ఈ క్రమంలో ముంబైకు ప్రముఖ టెక్స్‌టైల్ వ్యాపారి మెయినుద్దీన్ (రజినీకాంత్)  ఆ ఊరితో సంబంధాలు ఉంటాయి. ఈ క్రమంలో ఆ ఊరిలో క్రమం తప్పకుండా జరిగే జాతరలో పక్క ఊరి నుంచి కసునూరు ప్రజలకు అవమానం ఎదురు అవుతోంది. దాన్ని ఆ గ్రామ ప్రజలు ఎలా సాల్వ్ చేసుకున్నారు. ఈ క్రమంలో శత్రువులుగా మారిన షంషుద్దీన్, గురులు ఒకటయ్యారా.. ? ఈ క్రమంలో ఆ గ్రామానికి ఎదురైన అవమానాన్ని మెయినుద్దీన్ ఎలా పరిష్కరించాడనేదే ఈ సినిమా లాల్ సలాం మూవీ స్టోరీ.  

కథనం, టెక్నికల్ విషయానికొస్తే..

ఈ సినిమాకు కథతో పాటు దర్శకురాలిగా ఐశ్వర్య రజినీకాంత్ రెండు పాత్రలను పోషించడంలో తడబడ్డారు. ఆమె దర్శకత్వం అనగానే ఏదైనా కొత్త సబ్జెక్ట్‌తో సినిమా తీస్తుందని అందరు ఎక్స్‌పెక్ట్ చేసారు. కానీ ఐశ్వర్య ఎపుడో బిసీ కాలం నాటి స్టోరీ ఈ డిజిటల్ యుగంలో ప్రేక్షకులపై రుద్దే ప్రయత్నం చేసింది. ఈ మధ్యకాలంలో అలాంటి సినిమాలు చాలానే వచ్చినా.. దాన్ని జన రంజకంగా తీయాలి కదా. అలా తెరకెక్కించడంలో ఐశ్యర్య పూర్తిగా విఫలమ్యారు. ముఖ్యంగా ఈ సినిమా కథ కూడా రొటిన్ గ్రామ కక్ష్యలు.. ఒకపుడు మిత్రులుగా ఉండే వాళ్లు.. ఎలా బద్ద శత్రువులుగా మారారనే రొటిన్ విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ.  ఈ సినిమాకు తన తండ్రి రజినీకాంత్ కూతురుపై ముహమాటం కొద్ది ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు ఆయనే ప్లస్... మరియు మైనస్‌గా మారారు. సూపర్ స్టార్ వంటి తండ్రిని పెట్టుకొని ఆయనకు తగ్గట్టు కొన్ని ఎలివేషన్ సీన్స్ రాసుకోవడంలో విఫలమైంది. ఈ సినిమాను ప్రేక్షకులు కాస్త సహనంతో చూసారంటే అది రజినీకాంత్ ఉండటం వల్లే అని చెప్పాలి. ముఖ్యంగా ఫస్టాఫ్ లో ఏం జరిగిందో సెకండాఫ్ వరకు రివీల్ చేయలేదు. ఇది ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టినట్లైంది. రొటిన్ గ్రామ కక్ష్యలకు క్రికెట్ ఆటను జోడించి.. అందులో ముస్లిమ్ జట్లను పాకిస్థాన్ అని.. హిందూ జట్లను హిందూస్థాన్ అంటూ ప్రజల్లో ఏర్పడిన విభేదాలను చూపించారు. ఇక కుమారుడిని దివ్యాంగుడిగా చేసిన తన మిత్రుడి కొడుకును అతని కుమారుడు చంపాలనుకుంటాడు. కానీ మెయినుద్దీన్ పాత్ర అతన్ని కాపాడుతూ అతని గొప్పతనాన్ని చాటేలే రజినీకాంత్ పాత్రను డిజైన్ చేశారు. ఓవరాల్‌గా ఏదో తీద్దామని ఇంకేదో తెరకెక్కించారు ఐశ్వర్య రజినీకాంత్. ఈ సినిమాకు ఏ.ఆర్.రెహమాన్ తన మార్క్ సంగీతం అందించలేకపోయారు. ఇక ఎడిటర్ తన కత్తెరకు చాలా  పదును పెట్టాల్సిన ఉన్నా.. ఏదో మొహమాటం పడ్టట్టు కనిపిస్తోంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీతో ఈ సినిమాకు పాత కాలం నాటి లుక్ తీసుకొచ్చాడు.

నటీనటుల విషయానికొస్తే..

ఈ సినిమాకు రజినీకాంత్ ప్లస్ మరియు మైనస్. ఆయన నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయనే ఆయుధం లాంటి వాడు. అది సరైన విధంగా ఉపయోగించడంలో కూతరు ఐశ్వర్య పూర్తిగా విఫలమైంది. ఇక గరు పాత్రలో నటించిన విష్ణు విశాల్, షంషుద్దీన్ పాత్రలో నటించిన విక్రాంత్ చక్కటి నటనను కనబరిచారు. ఇక జీవితా రాజశేఖర్ తన పరిధి మేరకు నటించింది. ఇక తంబి రామయ్య, సెంథిల్ తమ పాత్రలకు న్యాయం చేసారు.

ప్లస్ పాయింట్స్

రజినీకాంత్

సినిమాటోగ్రఫీ

నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్
 
రొటీన్ కథ

ఆకట్టుకోని కథనం

సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్

సెకండాఫ్

రేటింగ్.. 2.5/5  

చివరి మాట: 'లాల్ సలాం'.. ఆకట్టుకొని రొటీన్ విలేజ్ డ్రామా..

Also Read: YSRCP MP Candidates: వైఎస్సార్‌సీపీ రాజ్యసభ అభ్యర్థులు వీరే.. మూడో స్థానానికి కూడా పోటీతో ఎన్నికలు రసవత్తరం

Also Read: YSRCP MP Candidates: వైఎస్సార్‌సీపీ రాజ్యసభ అభ్యర్థులు వీరే.. మూడో స్థానానికి కూడా పోటీతో ఎన్నికలు రసవత్తరం

Trending News