Lal Salaam 2023: లీడర్ లుక్‌లో సూపర్ స్టార్ రజినీకాంత్, లాల్ సలామ్ ఫస్ట్ లుక్ అదుర్స్‌!

Lal Salaam Movie 2023: ఐశ్వర్య డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న మూవీ లాల్ సలామ్.. ఈ సినిమాలో ప్రధాన పాత్రధారుడుగా సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్నాడు. దీనికి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో సూపర్ స్టార్ కొత్త లుక్‌లో కనిపించారు.   

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : May 8, 2023, 11:56 AM IST
Lal Salaam 2023: లీడర్ లుక్‌లో సూపర్ స్టార్ రజినీకాంత్,  లాల్ సలామ్ ఫస్ట్ లుక్ అదుర్స్‌!

Lal Salaam Movie 2023: ఐశ్వర్య ధనూష్‌ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రధారుడుగా తెరకెక్కుతున్న సినిమా లాల్ సలామ్.. ఈ మూవీ పాన్‌ ఇండియా లెవల్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఇటీవల నెల్సన్ దిలీప్ డైరెక్షన్‌లో జైలర్ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని.. ఇప్పుడు పూర్తిగా లాల్ సలామ్‌ మూవీ షూటింగ్‌కి టైమ్‌ కేటాయించారని సమాచారం. 

ప్రస్తుతం సీనియర్‌ హీరోస్‌ అందరూ యంగ్ జెనరేషన్ డైరెక్టర్ల స్టోరీలకు ఒకే చెబుతున్నారు. అయితే సూపర్ స్టార్ కూడా స్టార్ దర్శకులతో కాకుండా టాలెంటెడ్ యంగ్‌ డైరెక్టర్లలతో నెక్ట్స్‌ ప్రాజెక్ట్స్ ఒకే చెప్పబోతున్నారట.. లాల్ సలామ్ సినిమా తర్వాత లోకేష్ కనగరాజ్‌ డైరెక్షన్‌లో సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా టాలీవుడ్‌లో కూడా దిల్ రాజు ప్రొడక్షన్‌లో కూడా మరో సినిమాకు ఒకే చెప్పారని తెలుస్తోంది. 

ఇదిలా ఉండగా..ఐశ్వర్య ధనూష్‌ రూపొందిస్తున్న లాల్ సలామ్ సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది సినిమా బృందం.. ఈ పోస్టర్‌లో సూపర్ స్టార్ రజినీకాంత్ సరికొత్త లుక్‌లో దర్శనమిచ్చారు. ఇందులో ముస్లిం లీడర్ గా కనిపించబోతున్నారు. అంతేకాకుండా మోయిద్దీన్ భాయ్ అనే పాత్రలో రజిని నటించబోతున్నారని ఈ పోస్టర్‌ ద్వారా తెలుస్తోంది. ఈ సినిమాను దేశ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు సమాచారం.

Also Read: Samantha Shaakuntalam : శాకుంతలం పరిస్థితి ఇంతలా దిగజారిందా?.. ఇదే నిదర్శనం

పోస్టర్‌ను చూస్తే.. ముంబై అల్లర్ల ఘర్షణల నేపథ్యంలో ఐశ్వర్య మూవీని అవిష్కరిస్తున్నట్లు  టాక్ వస్తోంది. ఒక స్టోరీ విషయానిస్తే.. ఎలిమెంట్స్, సెన్సిటివ్‌తో ఉండబోతోందని సినీ నిపుణుల టాక్‌. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించగా లైకా ప్రొడక్షన్‌లో రూపొందుతుంది. ఇక ఈ చిత్రాన్ని వచ్చే సంవత్సరంలోగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లానింగ్‌ జరుగుతుంది. 

Also Read: Samantha Shaakuntalam : శాకుంతలం పరిస్థితి ఇంతలా దిగజారిందా?.. ఇదే నిదర్శనం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

 

Trending News