Krithi Shetty : కొత్త అడుగు వేయబోతోన్న కృతి శెట్టి.. ఆ హీరోతో బేబమ్మ రొమాన్స్.. నిలదొక్కుకునేనా?

Krithi Shetty New Movie Launched కృతి శెట్టి ప్రస్తుతం వరుస ఫ్లాపులతో సతమతమవుతోంది. ఒక్కటంటే ఒక్క హిట్ కూడా ఆమె ఖాతాలోకి వచ్చి పడటం లేదు. అలాంటి కృతి శెట్టి ఇప్పుడు మాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 11, 2022, 06:09 PM IST
  • టాలీవుడ్లో ఐరన్ లెగ్‌గా మారిన కృతి శెట్టి
  • వరుస ఫ్లాపులతో బేబమ్మ డమాల్
  • మాలీవుడ్లోకి కృతి శెట్టి ఎంట్రీ
Krithi Shetty : కొత్త అడుగు వేయబోతోన్న కృతి శెట్టి.. ఆ హీరోతో  బేబమ్మ రొమాన్స్.. నిలదొక్కుకునేనా?

Krithi Shetty : ఉప్పెన సినిమాతో కృతి శెట్టి క్రేజ్ ఉప్పెనలా ఎగిసింది. బేబమ్మగా కృతి శెట్టి తెలుగు వారిని కట్టిపడేసింది. సినిమా విడుదల కాకముందే చేతినిండా ఆఫర్లతో దూసుకెళ్లింది. స్టార్ హీరోలందరూ కూడా ఆశ్చర్యపోయేలా ఆఫర్లతో దూసుకుపోయింది. ఇక ఏ హీరోయిన్‌కు దక్కని గ్రాండ్ వెల్కమ్ కృతి శెట్టికి దక్కింది. అలా కృతి శెట్టి తెలుగులో మొదటి సినిమా విడుదల కాకముందే ఎనలేని క్రేజ్ దక్కించుకుంది.

ఉప్పెన లాంటి సక్సెస్ కృతి శెట్టికి వరంగానూ శాపంగానూ మారింది. ఇంత వరకు మళ్లీ ఉప్పెన రేంజ్ సక్సెస్‌ను కృతి శెట్టి చూడలేకపోయింది. ఆమె చేస్తోన్న సినిమాలన్నీ వరుసబెట్టి ఫ్లాపులు అవుతున్నాయి. చివరకు ఆమెకు ఐరన్ లెగ్ అనే ముద్ర వేసేస్థాయికి వచ్చింది. ఆమె నటించిన చిత్రాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేశాయి.

రామ్ ది వారియర్, నితిన్ మాచర్ల నియోజకవర్గం, సుధీర్ బాబు నటించిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ఇలా అన్ని సినిమాలు కూడా కమర్షియల్‌గా ఫెయిల్ అయ్యాయి. దీంతో కృతి శెట్టి పూర్తిగా డౌన్ ఫాల్ అయింది. అప్పటి వరకు విపరీతమైన కండీషన్లు పెట్టే కృతి శెట్టి తల్లి కూడా సైలెంట్ అయిందట. కృతి శెట్టి కూడా కాస్త ఒళ్లు దగ్గర పెట్టుకుని ప్రవర్తిస్తోందట.

అలాంటి కృతి శెట్టి ఇప్పుడు టాలీవుడ్‌లో తన స్టార్డంను కోల్పోయే స్థితికి వచ్చింది. ఇప్పుడు ఆమె చేతిలో కొత్త ప్రాజెక్టులేమీ లేవు. ఇక స్టార్ హీరోలు సైతం కృతి శెట్టిని తీసుకునేందుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. నటన పరంగానూ కృతి శెట్టి ఇంత వరకు నిరూపించుకున్న దాఖలాలు కూడా లేవు.

అయితే కృతి శెట్టికి ఇప్పుడు పక్క భాషల నుంచి కూడా ఆఫర్లు వస్తున్నట్టు కనిపిస్తోంది. తమిళంలోనూ కృతి శెట్టి వారియర్ చిత్రంతో పరిచయమైంది. కానీ అక్కడ అంతగా క్లిక్ కాలేదు. అయితే సొంత భాష అయిన కన్నడలోనూ కృతి శెట్టి ఇంత వరకు నటించలేదు. అక్కడ ఎంట్రీ జరగలేదు. కానీ ఇప్పుడు కేరళ ప్రేక్షకుల ముందుకు వెళ్లింది కృతి శెట్టి.

కేరళ స్టార్ హీరో టొవినో థామస్ హీరోగా రాబోతోన్న చిత్రంతో కృతి శెట్టి మాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తోంది. ఈమూవీకి సంబంధించిన షూటింగ్ నేడు ప్రారంభమైనట్టు తెలుస్తోంది. పూజా కార్యక్రమంలో కృతి శెట్టి చిత్రయూనిట్‌తో కలిసి సందడి చేసింది. అయితే కేరళలో కృతి శెట్టికి ఎలాంటి వెల్కమ్ లభిస్తుందో.. చూడాలి. అక్కడైనా కృతి శెట్టి సక్సెస్‌లతో దూసుకుపోతుందో లేదో చూడాలి.

Also Read : Godfather Collections : బ్రేక్ ఈవెన్‌కు అందనంత దూరంలో చిరంజీవి

Also Read : Sreemukhi : ఎద అందాల గుట్టురట్టు.. రెచ్చిపోతోన్న శ్రీముఖి.. పిక్స్ వైరల్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News